డిజిటల్ మోసాలను నియంత్రించేందుకు, ఆర్థిక మోసాలకు పాల్పడిన సుమారు 1.4 లక్షల మొబైల్ నంబర్‌లను కేంద్ర ప్రభుత్వం బ్లాక్ చేసింది. ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్రటరీ 'వివేక్ జోషి' శుక్రవారం 'సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్' (CFCFRMS) ప్లాట్‌ఫారమ్‌లో బ్యాంకులు, ఆర్థిక సంస్థల ఆన్‌బోర్డింగ్‌తో సైబర్ దాడులపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
CFCFRMS ప్లాట్‌ఫారమ్‌ను నేషనల్ సైబర్‌క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (NCRP)తో అనుసంధానం చేయడం కోసం పోలీసులు, బ్యాంకులు, ఆర్థిక సంస్థల మధ్య సమర్థవంతమైన సహకారాన్ని అందించడం, సరైన సమయంలో పర్యవేక్షించడం, మోసపూరిత కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడం వంటి విషయాలను కూడా చర్చించినట్లు సమాచారం.
బ్యాంకులు, ఆర్థిక సంస్థలు సాధారణ 10 అంకెల సంఖ్యల వినియోగాన్ని దశలవారీగా నిలిపివేయాలని TRAI సూచించిన విధంగా వాణిజ్య లేదా ప్రచార కార్యకలాపాల కోసం ప్రత్యేకించిన నెంబర్ సిరీస్‌లను ఉపయోగించాలని చర్చించుకున్నారు. అంతే కాకుండా నకిలీ డాక్యుమెంట్లతో తీసుకున్న మొబైల్ కనెక్షన్‌లను గుర్తించేందుకు టెలికామ్ శాఖ ఏఐ టెక్నాలజీ తీసుకురానుంది.
ఆర్థిక మోసాలకు పాల్పడిన సుమారు 1.40 లక్షల మొబైల్ నంబర్‌లను కేంద్ర ప్రభుత్వం బ్లాక్ చేసింది. బల్క్ ఎస్‌ఎంఎస్‌లు పంపిన సంస్థల మీద కూడా చర్యలు తీసుకున్నారు. ఇప్పటి వరకు 3.08 లక్షల సిమ్ కార్డులను బ్లాక్ చేసిన కేంద్రం, ఈ నేరాలకు పాల్పడుతున్న 500 మందిని అరెస్ట్ చేసినట్లు సమాచారం.
ఇదీ చదవండి: ఏప్రిల్ నుంచి ఫాస్ట్‌ట్యాగ్‌లు పనిచేయవు! కారణం ఇదే..
సైబర్ మోసాలకు గురైన ప్రజల సమస్యలను త్వరగా పరిష్కరించడం, మోసపోయిన డబ్బును మోస పూరిత ఖాతాల నుంచి తిరిగి ఇవ్వడానికి కార్యాచరణ ప్రణాళికలు చేపడుతున్నారు. ఇవన్నీ అనుకున్నట్లు జరిగితే.. రాబోయే రోజుల్లో సైబర్ దాడుల నుంచి ప్రజలను విముక్తి లభిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment