పార్వతీపురం మన్యం జిల్లా తొలి కలెక్టర్ నిశాంత కుమార్
మన రాజ్యాంగ అమృతో త్సవ సందర్భం తర్వాత జరుగుతున్న 2025 రిప బ్లిక్ దినోత్సవంలోఆంధ్రప్రదేశ్ నుంచి పార్వతీపురం మన్యం జిల్లా తొలి కలెక్టర్ నిశాంత కుమార్‌ను ‘ప్రైమ్ మిని స్టర్స్ అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఫర్ 2023’కి భారత ప్రభుత్వం ఎంపిక చేయడం ఒక వాగ్దానపూరిత ఎంపిక. ఒడిశాను ఆనుకుని ఉన్న ఏపీ సరి హద్దులోని ఆ గిరిజన ప్రాంతం అస్సలు జిల్లా ఎప్పుడు అయింది? అక్కడ కలెక్టర్ ఎందుకుఉంటాడు? అనేవి కొత్తవారికి ఈ వార్త విన్నప్పుడు కలిగే సందేహాలు. ఇక్కడే ‘లెజిస్లేచర్’ (శాసన వ్యవస్థ) పాత్ర కీలకమై, దాని రాజకీయ నిర్ణయాల చర్చకు ఈ ‘అవార్డు’ కేంద్రబిందువు అవుతున్నది.
జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం గత ఐదేళ్ళలో కొత్తగా పదమూడు జిల్లాలు ఏర్పాటు చేసింది. ‘లెజిస్లేచర్’ (శాసన వ్యవస్థ), ‘ఎగిక్యూటివ్’ (కార్యనిర్వాహక వర్గం) కలసి తీసుకున్న (ప్రభుత్వ) నిర్ణయంతో విజయనగరం జిల్లాలో భాగమైన పార్వతీపురం విడిపోయి 2022 ఏప్రి ల్‌లో అదొక కొత్తజిల్లా అయితే... దాని తొలి కలెక్టర్ నిశాంత కుమార్ 2022–24 మధ్య అక్కడ పనిచేశారు. అది జిల్లా కావడానికి కొంచెం ముందుగానే, ఒడిశా సరిహద్దున రెండు రాష్ట్రాల మధ్య వివాదంగా ఉన్న 21 కొటియా గిరిజన గ్రామాల సమస్య విషయమై 2021 నవంబరులో జగన్ అప్పటి ఒడిస్సా సీఎం నవీన్ పట్నాయక్‌ను భువనేశ్వర్‌లో కలిసి మాట్లాడ్డంతో దాని పరిష్కారానికి ఒక రూపం వచ్చి, రెండు రాష్ట్రాల ‘ఎగ్జిక్యూటివ్’ల మధ్య చర్చ మొదలైంది.
పదిహేను మండలాలకు అంటే ఒక ‘ఎస్సీ’, మూడు ‘ఎస్టీ’ అసెంబ్లీ నియోజక వర్గాల ‘ప్రజ లకు’ కొత్తగా ఒక ‘కలెక్టరేట్’ వచ్చింది. ఇక్కడ గమనించవలసిన నాలుగు అంశాలు ఉన్నాయి: ఒకటి ‘ప్రాంతం’ (పార్వతీపురం), రెండు‘ప్రజలు’ (గిరిజనులు), మూడు ‘ప్రభుత్వం’ (వైసీపీ), నాలుగోది ‘సార్వభౌమాధికారం’ (కలె క్టర్). ఈ నాలుగు ‘రాజ్యం’ ఉపాంగాలు. వీటిలో రాజ్యంగ ప్రతినిధిగా ‘కలెక్టరేట్’ రూపంలో ‘సార్వభౌమాధికారం’ (సావర్నిటీ) 75 ఏళ్ల
తర్వాత ఆ మన్య ప్రాంతంలో సూక్మస్థాయిలోకి ప్రవేశించింది.
ఇక ఇక్కడ జరిగింది చూస్తే... జిల్లా
యంత్రాంగం (వైద్య ఆరోగ్యశాఖ) వివరాల ప్రకారం 2022 ఏప్రిల్‌లో కలెక్టరేట్ వచ్చాక ‘ప్రిజం–10’ (‘ప్రాజెక్ట్ టు రెడ్యూస్ ఇన్ఫెంట్ మోర్టాలిటీ రేట్ బిలో 10’) అమలు అయ్యే నాటికి ఇక్కడి శిశు మరణాల రేటు 24, తల్లుల మరణాల రేటు 128, రోగ నిరోధకత 47.2 శాతం ఉంది. కలెక్టర్ తీసుకున్న ప్రత్యేక చొరవతో రెండేళ్లలో 2024 ఫిబ్రవరి నాటికి 97.77 శాతం రోగనిరోధకతతో ఏడాదికి 210 మంది శిశువుల జననంతో మర ణాల రేటు 8కి తగ్గింది. అలా ఈ ప్రాజెక్టు అమలులో పార్వతీపురం జిల్లా రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచింది. ప్రజలు, ప్రభుత్వ సిబ్బందిలో నమ్మకం కలిగించడానికి కలెక్టర్ నిశాంత్ కుమార్ తన భార్య కాన్పు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చేయించారు. దాంతో ‘ఇన్నోవేషన్ డిస్ట్రిక్ట్’గా పార్వతీపురం జిల్లాను భారత ప్రభుత్వం గుర్తించి ఈ అవార్డ్ ప్రకటించింది. ఆ మన్యప్రాంతంలో గాలిలో దీపంలా మారిన గిరిజన శిశువుల ప్రాణాలు నిలపడంతో అక్కడ ‘రాజ్యం’ పని మొదలైంది. పౌర సంక్షేమం విషయంలో రాజ్యం బాధ్యత–‘ఫ్రవ్‌ు క్రేడిల్ టు గ్రేవ్’ (ఊయల దశ నుండి సమాధి వరకూ...) అనేది రాజనీతి శాస్త్ర తొలి పాఠం.
రాష్ట్ర విభజన తర్వాత కొత్తగా పార్వతీపురం, పల్నాడు వంటి జిల్లాలు ఏర్పాటుచేసి, ‘కోటలో పాగా’ రాజకీయాలను మొదలుపెట్టిన జగన్ దీన్నే బహిరంగ సభల్లో జనరంజక భాషలో చెప్పే ప్రయత్నంలో– ‘ఇది పేదలకూ, పెత్తందార్లకూ మధ్య జరుగుతున్న యుద్ధం’ అనేవారు. కొందరి కిది సానుకూలంగా అర్థమైతే, మరికొందరికి ఇది ‘విధ్వంసం’ అనిపించింది. ఎవరికి ఏది ఎలా అర్థ మైనా, ఈ ‘అవార్డు’ అయితే సానుకూలంగా ఆలో చించేవారికి సంతోషం కలిగించేది అవుతుంది.
-జాన్‌సన్ చోరగుడి, వ్యాసకర్త అభివృద్ధి–సామాజిక అంశాల వ్యాఖ్యాత
Comments
Please login to add a commentAdd a comment