'ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వశాఖకు సంబంధించిన ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) శకటాన్ని ప్రత్యేక ఆకర్షణగా చెప్పవచ్చు. కృత్రిమ మేధ(ఏఐ)లో మన దేశం సాధించిన పురోగతికి అద్దం పట్టేల, హెల్త్‌కేర్, లాజిస్టిక్స్, విద్య, ఎలక్ట్రానిక్స్ మ్యానుఫాక్చరింగ్‌పై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావాన్ని ప్రతిఫలించేలా ఈ శకటాన్ని తీర్చిదిద్దారు.'
శకటంలో ఒక మహిళా రోబోట్ కృత్రిమ మేధస్సును ప్రతిబింబించేలా ఉంటుంది. వివిధ ఎలక్ట్రానిక్ పరికరాల్లో కీలకమైన సెమీకండక్టర్ చిప్ 3డీ మోడల్‌ను శకటంలోఏర్పాటు చేశారు. వివిధ రంగాల్లో భారతదేశ అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్లడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగాన్ని తెలియజేసేలా శకటానికి ఇరువైపులా ఎల్‌ఈడీ లైట్లతో అలంకరించిన సర్క్యూట్ డిజైన్ ఆకట్టుకుంటుంది. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్(పీఎల్‌ఐ) లాంటి కార్యక్రమాల ద్వారా ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్‌లో మన దేశం సాధించిన పురోగతిని కూడా ఈ శకటం హైలెట్ చేస్తుంది.
శకటం మధ్య విభాగంలో లాజిస్టిక్స్‌పై దృష్టి పెట్టారు. కలర్ కోడింగ్ ఆధారంగా పార్శిల్ గుర్తింపు, విభజనకు సాంకేతికత ఎలా సహాయపడుతుందో తెలియజేసేలా ఉంటుంది. శకటం వెనుక భాగం విద్యారంగంపై దృష్టిని మళ్లిస్తుంది. వీఆర్ హెడ్‌సెట్ ధరించి వర్చువల్ రియాలిటీ ద్వారా రిమోట్ క్లాసును నిర్వహించే ఉపాధ్యాయుడి లార్జర్ దెన్ లైఫ్ స్టాచ్యూ ఉత్తేజకరంగా ఉంటుంది. పశువుల ఆరోగ్యాన్ని పర్యవేక్షించడంలో సెన్సర్‌ల ద్వారా ఏఐ అప్లికేషన్‌ల ఉపయోగం, నావిగేషన్‌కు సంబంధించి దృష్టి లోపం ఉన్న వ్యక్తులకు సహాయపడే విషయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహకారాన్ని ఈ ఏఐ శకటం హైలెట్ చేస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment