ఎక్కడికక్కడ అప్రమత్తం .. భద్రత కట్టుదిట్టం
సాక్షి, హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఇతర కేంద్రమంత్రులు, పలు రాష్ట్రాల సీఎంలు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా కీలక నేతలు హైదరాబాద్‌లో జరిగే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హాజరుకానున్న నేపథ్యంలో.. భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. సమావేశాలు జరిగే మాదాపూర్‌లోని హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్(హెచ్ఐసీసీ)తోపాటు నోవాటెల్, రాజ్‌భవన్, బేగంపేట.. మోదీసభ జరిగే పరేడ్ గ్రౌండ్స్ పరిసర ప్రాంతాల్లో పెద్దయెత్తున భద్రతాబలగాలు మోహరిస్తున్నాయి.
స్పెష ల్ ప్రొటెక్షన్ గ్రూప్(ఎస్పీజీ), కేంద్ర బలగాలతో కలిసి నాలుగంచెల భద్రత ఏర్పాట్లు చేశారు. మొత్తం 15 వేల మంది భద్రత, బందోబస్తు విధుల్లో పాల్గొంటున్నారు. ఎస్పీజీ, ఎన్ఎస్జీ, ఆక్టోపస్, శాంతిభద్రతల విభాగంతో పాటు టాస్క్‌ఫోర్స్, సిటీ సెక్యూరిటీ వింగ్, సీఏఆర్ విభాగాలు రంగంలోకి దిగుతున్నాయి. నగరవ్యాప్తంగా నిఘా, తనిఖీతోపాటు భారీగా మఫ్టీ పోలీసులను ఏర్పాటు చేశారు. ప్రధాని తిరిగే మార్గాల్లో రూట్పార్టీలు ఉంటాయి.
దుర్భేద్యంగా హెచ్ఐసీసీ
జాగిలాలతో హెచ్ఐసీసీ, నోవాటెల్ ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు. ఎత్తైన భవనాల పైనుంచి రూఫ్‌టాప్ వాచ్ చేస్తున్నారు. పాస్ ఉన్న వాహనాలు, వ్యక్తులను మాత్రమే హెచ్ఐసీసీ లోపలికి అనుమతిస్తున్నారు. హైటెక్స్ లోపలికి వచ్చే ప్రతి ఒక్క వాహనాన్నీ విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. పాస్‌లేని పోలీస్ వాహనాలను సైతం తిప్పి పంపి స్తున్నారు. హెచ్ఐసీసీ వద్ద ఏర్పాటు చేసిన ఆర్టీపీసీఆర్ కేంద్రాలలో కరోనా పరీక్షలు నిర్వహించాకే లోపలికి అను మతి ఇస్తున్నారు. ఈ నెల 4వ తేదీ వరకు సైబరాబాద్ కమి షనరేట్ పరిధిలో 144 సెక్షన్ విధించారు. ఐదుగురి కంటే ఎక్కువమంది గుమిగూడితే అరెస్టు చేస్తామని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర హెచ్చరించారు. శుక్రవా రం పరేడ్ గ్రౌండ్స్‌కు వెళ్లిన హైదరా బాద్ కొత్వాల్ సీవీ ఆనంద్ అధికారులతో బందోబస్తు, భద్రత ఏర్పాట్లు సమీక్షించారు. మరోపక్క బేగంపేట విమానాశ్రయం నుం చి పరేడ్ గ్రౌండ్స్‌కు, అక్కడ నుంచి రాజ్‌భవన్ వరకు సెక్యూరిటీ, కాన్వాయ్ రిహార్సల్స్ నిర్వహించారు. గ్రౌండ్స్ ను శనివారం ఎస్పీజీ అ«ధీనంలోకి తీసుకోనుంది. శుక్రవా రం నుంచే బేగంపేట విమానాశ్రయం, పరేడ్ గ్రౌండ్స్, బాంబు నిర్వీర్యబృందాలతో తనిఖీ చేస్తున్నారు.
ముందస్తు అరెస్టులు..
‘అగ్నిపథ్’కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా మొదలైన నిరసనలు విధ్వంసానికి దారితీయడం, ప్రతిపక్షాలు మద్దతు ఇవ్వటంతో ప్రధాని పర్యటన నేపథ్యంలో అకస్మాత్తుగా ఆందోళనలు చేపట్టే అవకాశం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఎమ్మార్పీఎస్ శనివారం సడక్‌బంద్‌కు పిలుపు ఇవ్వటంతో అవాంఛనీయ సంఘటనలు జరగ కుండా సైబరాబాద్ పోలీసులు ముందస్తు అరెస్ట్‌లు చేస్తున్నారు. నేరచరితులు, రౌడీషీటర్లకు బైండోవర్లు విధిం చా రు. శంషాబాద్ మున్సిపాలిటి పరిధిలో ఎమ్మార్పీఎస్ పార్టీ కన్వీనర్ రాచమల్ల రాజును పోలీసులు అరెస్టు చేశారు.
ట్రాఫిక్ ఆంక్షలు..
హెచ్ఐసీసీ, నోవాటెల్ హోటల్ పరిసర ప్రాంతాలలో శని, ఆదివారాల్లో పలు మార్గాలలో ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించుకోవాలని పోలీసులు సూచించారు. జేఎన్టీయూ నుంచి సైబర్ టవర్స్, మియాపూర్ నుంచి కొత్తగూడ, కావూరి హిల్స్ నుంచి కొత్తగూడ, బయోడైవర్సిటీ నుంచి జేఎన్టీయూ, నారాయణమ్మ కాలేజ్ నుంచి గచ్చిబౌలి మార్గాలలో భారీ వాహనాలకు ప్రవేశం లేదు.
ట్రాఫిక్ మళ్లింపు మార్గాలివే..
►నీరూస్ జంక్షన్ నుంచి కొత్తగూడ జంక్షన్, గచ్చిబౌలి వైపు వచ్చే వాహనాలను దుర్గం చెరువు – ఇనార్బిట్ – ఐటీసీ కోహినూర్ – ఐకియా – బయోడైవర్సిటీ – గచ్చి బౌలి మీదుగా సీవోడీ జంక్షన్‌కు మళ్లిస్తారు. సైబర్ టవర్స్, హైటెక్స్ జంక్షన్ల మీదుగా ప్రవేశం లేదు.
►మియాపూర్, కొత్తగూడ, హఫీజ్‌పేట మీదుగా హైటెక్ సిటీ, సైబర్ టవర్స్, జూబ్లీహిల్స్ వైపు వచ్చే వాహనాలు రోలింగ్ హిల్స్ – ఏఐజీ హాస్పిటల్ – ఐకియా – ఇన్నార్బిట్ – దుర్గం చెరువు రోడ్ మీదుగా వెళ్లాలి.
►ఆర్సీపురం, చందానగర్ మీదుగా మాదాపూర్, గచ్చిబౌలి వైపునకు వచ్చే వాహనాలు బీహెచ్ఈఎల్ – నల్లగండ్ల – హెచ్‌సీయూ – ఐఐఐటీ – గచ్చిబౌలి రోడ్డు మీదుగా వెళ్లాలి. అల్విన్, కొండాపూర్ రోడ్లో వాహనాలకు ప్రవేశం లేదు.