Tableau
-
AP: రిపబ్లిక్ డే వేడుకల్లో ఏపీ శకటానికి అవార్డు
న్యూఢిల్లీ: భారత 75వ రిపబ్లిక్ డే వేడుకల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన శకటానికి కేంద్ర ప్రభుత్వ అవార్డు దక్కింది. కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్ చేతుల మీదుగా ఏపీ రెసిడెంట్ కమిషనర్ లవ్అగర్వాల్, ఏపీ సమాచార శాఖ జేడీ కిరణ్ కుమార్ అవార్డును అందుకున్నారు. రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొన్న ఏపీ గణతంత్ర శకటానికి, సాంస్కృతిక ప్రదర్శనలకు తృతీయ బహుమతి లభించింది. పీపుల్ ఛాయస్ కేటగిరీలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ శకటం మూడో స్థానంలో నిలిచింది. డిజిటల్ విద్యా బోధన, నాడు నేడు, ఇంగ్లిష్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్,ఆంగ్ల మాధ్యమంలో బోధన నేపథ్యంతో ఆంధ్రప్రదేశ్ శకటం అకట్టుకుంది.ఇక.. తొలి స్థానంలో గుజరాత్ ప్రభుత్వం రూపొందించిన శకటం, ద్వితీయ స్థానంలో ఉత్తర ప్రదేశ్ చెందిన శకటం నిలిచాయి. -
దేశంలోనే తన సత్తా చాటిన ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ
-
రిపబ్లిక్ డే వేడుకలు: ఆకట్టుకున్న ఏపీ విద్యాశాఖ శకటం
సాక్షి, ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఘనంగా గణతంత్ర దినోత్సవం వేడుకలు జరుగుతున్నాయి. రిపబ్లిక్ డే సందర్భంగా శకటాల ప్రదర్శన అద్భుతంగా జరిగింది. ఇక, రిపబ్లిక్ డే వేడుకల్లో ఏపీకి చెందిన విద్యాశాఖ శకటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కాగా, రిపబ్లిక్ వేడుకల్లో ఏపీకి చెందిన పాఠశాల విద్యాశాఖ శకటం ఆకట్టుకుంది. డిజిటల్ ఎడ్యుకేషన్, సీబీఎస్ఈ, ఐబీ, టోఫెల్, ఫ్యూచర్ స్కిల్స్‌ను వివరిస్తూ శకటం రూపకల్పన చేశారు. శకటం ప్రదర్శన సందర్భంగా విద్యార్థులు ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. ఢిల్లీలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు రిపబ్లిక్ డే వేడుకల్లో ఆకట్టుకున్న ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ శకటం డిజిటల్ ఎడ్యుకేషన్, సీబీఎస్ఈ, ఐబీ, టోఫెల్, ఫ్యూచర్ స్కిల్స్‌ను వివరిస్తూ రూపకల్పన#RepublicDay#YSJaganForQualityEducation#AndhraPradesh pic.twitter.com/AyGoFl7T0G — YSR Congress Party (@YSRCParty) January 26, 2024 -
'రిపబ్లిక్ డే' పరేడ్‌లో ప్రధాన ఆకర్షణగా ఏఐ శకటం!
'ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వశాఖకు సంబంధించిన ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) శకటాన్ని ప్రత్యేక ఆకర్షణగా చెప్పవచ్చు. కృత్రిమ మేధ(ఏఐ)లో మన దేశం సాధించిన పురోగతికి అద్దం పట్టేల, హెల్త్‌కేర్, లాజిస్టిక్స్, విద్య, ఎలక్ట్రానిక్స్ మ్యానుఫాక్చరింగ్‌పై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావాన్ని ప్రతిఫలించేలా ఈ శకటాన్ని తీర్చిదిద్దారు.' శకటంలో ఒక మహిళా రోబోట్ కృత్రిమ మేధస్సును ప్రతిబింబించేలా ఉంటుంది. వివిధ ఎలక్ట్రానిక్ పరికరాల్లో కీలకమైన సెమీకండక్టర్ చిప్ 3డీ మోడల్‌ను శకటంలోఏర్పాటు చేశారు. వివిధ రంగాల్లో భారతదేశ అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్లడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగాన్ని తెలియజేసేలా శకటానికి ఇరువైపులా ఎల్ఈడీ లైట్లతో అలంకరించిన సర్క్యూట్ డిజైన్ ఆకట్టుకుంటుంది. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్(పీఎల్ఐ) లాంటి కార్యక్రమాల ద్వారా ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్లో మన దేశం సాధించిన పురోగతిని కూడా ఈ శకటం హైలెట్ చేస్తుంది. శకటం మధ్య విభాగంలో లాజిస్టిక్స్‌పై దృష్టి పెట్టారు. కలర్ కోడింగ్ ఆధారంగా పార్శిల్ గుర్తింపు, విభజనకు సాంకేతికత ఎలా సహాయపడుతుందో తెలియజేసేలా ఉంటుంది. శకటం వెనుక భాగం విద్యారంగంపై దృష్టిని మళ్లిస్తుంది. వీఆర్ హెడ్సెట్ ధరించి వర్చువల్ రియాలిటీ ద్వారా రిమోట్ క్లాసును నిర్వహించే ఉపాధ్యాయుడి లార్జర్ దెన్ లైఫ్ స్టాచ్యూ ఉత్తేజకరంగా ఉంటుంది. పశువుల ఆరోగ్యాన్ని పర్యవేక్షించడంలో సెన్సర్ల ద్వారా ఏఐ అప్లికేషన్ల ఉపయోగం, నావిగేషన్‌కు సంబంధించి దృష్టి లోపం ఉన్న వ్యక్తులకు సహాయపడే విషయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహకారాన్ని ఈ ఏఐ శకటం హైలెట్ చేస్తుంది. ఇవి చదవండి: జనవరి 26నే 'రిపబ్లిక్ డే' ఎందుకో తెలుసా! -
Republic Day Parade: పోరాట యోధుల థీమ్‌తో తెలంగాణ శకటం
న్యూఢిల్లీ: ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకల కవాతుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర శకటాలు ఎంపికయ్యాయి. మదర్ ఆఫ్ డెమోక్రసీ పేరిట ఈ ఏడాది తెలంగాణ శకటం ఆకట్టుకోనుంది. చాకలి ఐలమ్మ, కొమరం భీం, రాంజీ గోండు తదితర పోరాట యోధులతో శకటాన్ని ఏర్పాటు చేశారు. ఈ థీమ్‌కు రక్షణ శాఖ ఆమోదం తెలిపింది. జనవరి 26న కర్తవ్యపథ్‌లో తెలంగాణ శకటం సందడి చేయనుంది. కాగా తెలంగాణ శకటం ప్రదర్శనకు వచ్చే సమయంలో దానికి ఇరువైపులా రాష్ట్ర సంస్కృతిని ప్రతిబింబించేలా కొమ్ముకోయ, గుస్సాడి, డప్పుల నృత్యాల కళాకారుల ప్రదర్శన ఉండే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2015లో ఒకసారి, 2020లో మరోసారి రిపబ్లిక్ డే పరేడ్‌లో తెలంగాణ శకటం కనువిందు చేయగా మళ్లీ నాలుగేళ్ల తర్వాత ప్రస్తుత గణతంత్ర దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర శకటానికి అవకాశం లభించింది మరోవైపు రిపబ్లిక్ డే పరేడ్ కోసం ఎంపికైన ఏపీ శకటం.. ఈసారి డిజిటల్ క్లాస్ రూమ్ థీమ్‌తో ప్రదర్శనకు ఏర్పాటైంది. దేశంలోనే తొలిసారిగా 62,000 డిజిటల్ క్లాస్ రూమ్‌ల ద్వారా విద్యాబోధన చేస్తున్న రాష్ట్రంగా ఏపీ చరిత్ర సృష్టించింది. ఇదే అంశాన్ని దేశం మొత్తం చాటిచెప్పేలా.. శకటం రూపకల్పన జరిగింది. జనవరి 26న కర్తవ్య పథ్‌లో వికసిత్ భారత్ థీమ్‌లో భాగంగా రిపబ్లిక్ డే వేడుకల్లో కనువిందు చేయనుంది.