appliances
-
హైకావా అప్లయెన్సెస్ తో ఎక్స్పర్ట్ ఏసి సొల్యూషన్స్.. జొఇనింగ్ హాండ్స్
-
పాత సామాన్లు కొంటాం..! పనిచేయని ఫోన్లు, పరికరాలు కొంటున్న ఫ్లిప్‌కార్ట్..
పనిచేయని పాత స్మార్ట్ఫోన్లు, ఫీచర్ ఫోన్లు, టీవీలు, ఫ్రిజ్‌లు, ఎయిర్‌కూలర్లు తదితర గృహోపకరణాలను ఫ్లిప్‌కార్ట్ కొనుగోలు చేస్తోంది. ఎక్స్ఛేంజ్ ద్వారా పాతవి ఇచ్చి కొత్త ఉత్పత్తులను కొనుగోలు చేయవచ్చు. ఇందు కోసం హ్యాండ్ ఇన్ హ్యాండ్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్‌ను ఫ్లిప్‌కార్ట్ ప్రవేశపెట్టింది . ఎలక్ట్రానిక్ వ్యర్థాలను (ఈ-వేస్ట్) తగ్గించడంతోపాటు పనికిరాని ఉపకరణాలను డిస్పోజ్ చేయడంలో కస్టమర్లు ఎదుర్కొనే సవాళ్లను పరిష్కరించడం లక్ష్యంగా ఫ్లిప్‌కార్ట్ ఈ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్‌ను తీసుకొచ్చింది. అధీకృత విక్రేతలతో భాగస్వామ్యం ద్వారా రీఫర్బిష్మెంట్, రీసైక్లింగ్ లేదా సరైన డిస్పొజల్ ద్వారా ఈ-వ్యర్థాల సంస్కరణ బాధ్యతను ఫ్లిప్‌కార్ట్ చేపట్టింది. ప్రపంచంలో మూడో అతిపెద్ద ఎలక్ట్రానిక్ వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్న దేశంగా ఉన్న భారత్ ఉన్న నేపథ్యంలో ఈ పరిస్థితిని మార్చాల్సిన ఆవశ్యకతను గుర్తించి ఈ ప్రోగ్రామ్‌ను ప్రవేశపెట్టినట్లు ఫ్టిప్‌కార్ట్ చెబుతోంది. ఈ ప్రోగ్రామ్ ఆకర్షణీయమైన బైబ్యాక్ ఆఫర్లు, పని చేయని ఉపకరణాలను ఇంటి వద్దకే వచ్చి పికప్ చేసుకోవడం, హ్యాండ్-ఇన్-హ్యాండ్ ఎక్స్ఛేంజ్ ద్వారా కొత్త ఉత్పత్తులను అందిస్తుంది. డేటా తొలగింపు ఈ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ అదనంగా పాత మొబైల్ ఫోన్లు, స్మార్ట్ఫోన్లు, ఫీచర్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను రీఫర్బిష్ లేదా డిస్పోజ్ చేయడానికి ముందు వాటిలోని డేటా తొలగింపుపై ప్రత్యేక దృష్టి పెడుతుంది. సమర్థవంతమైన సాంకేతిక ప్రక్రియలు, విస్తృతమైన లాజిస్టిక్స్ నెట్‌వర్క్‌తో ఒకే సారి కస్టమర్లకు అవాంతరాలు లేని సేవలను ఫ్లిప్‌కార్ట్ అందిస్తుంది. దీనిపై ఫ్లిప్‌కార్ట్ రీ-కామర్స్ సీనియర్ డైరెక్టర్, బిజినెస్ హెడ్ అశుతోష్ సింగ్ చందేల్ మాట్లాడుతూ.. కొత్త ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్ ద్వారా కస్టమర్లు తమ వద్ద ఉన్న పని చేయని ఎలక్ట్రానిక్, ఇతర ఉపకరణాలను ఇచ్చి కొత్త ఉత్పత్తులు కొనుక్కునేలా వినూత్నమైన, సౌకర్యవంతమైన పరిష్కారాన్ని అందించాలనుకుంటున్నట్లు తెలిపారు. దీనివల్ల కస్టమర్లకు ప్రయోజనం చేకూర్చడమే కాకుండా పర్యావరణంపై ప్రభావాన్ని తగ్గించడానికి దోహదపడుతుందని పేర్కొన్నారు. ఇదీ చదవండి: కొత్త కొత్తగా.. మోటో జీ32 స్మార్ట్‌ఫోన్ కొత్త వేరియంట్లు -
వెంట వచ్చే రిఫ్రిజిరేటర్.. మొబైల్ ఫోన్లోనే కంట్రోలింగ్
సాధారణ రిఫ్రిజిరేటర్‌ను ఇంట్లో వాడుకోగలం గాని, బయటకు తీసుకుపోలేం. నడివేసవిలో దూర ప్రయాణాలకు వెళ్లేటప్పుడు రిఫ్రిజిరేటర్ ఉంటే బాగుండనపిస్తుంది. పోర్టబుల్ కూల్‌డ్రింక్ చిల్లర్స్ వంటివి ఇప్పుడిప్పుడే అందుబాటులోకి వస్తున్నాయి. ఇదీ చదవండి: నేను ‘మోనార్క్’ని... సెల్ఫ్‌డ్రైవింగ్ ట్రాక్టర్ తాజాగా పోర్టబుల్ మొబైల్ రిఫ్రిజిరేటర్‌ను అమెరికన్ బహుళజాతి సంస్థ ఏంకర్ అందుబాటులోకి తెచ్చింది. ‘ఎవర్ఫ్రాస్ట్ పవర్డ్ కూలర్’ పేరుతో మార్కెట్లోకి విడుదల చేసిన ఈ మొబైల్ రిఫ్రిజిరేటర్ రీచార్జబుల్ బ్యాటరీ సాయంతో పనిచేస్తుంది. ఇది 33 లీటర్లు, 43 లీటర్లు, 53 లీటర్ల పరిమాణాల్లో దొరుకుతుంది. ఇందులో మంచినీళ్లు, కూల్‌డ్రింక్స్, ఐస్‌క్రీమ్స్, పండ్లు, కూరగాయలు వంటివి పెట్టుకోవచ్చు. మొబైల్ ఫోన్లో దీని యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని, యాప్ ద్వారా ఇందులోని ఉష్ణోగ్రతను కోరుకున్న రీతిలో నియంత్రించుకునే వెసులుబాటు కూడా ఉంది. దీని ప్రారంభ ధర 1464 డాలర్లు (సుమారు రూ.1.21 లక్షలు) మాత్రమే! -
వింటర్ జోరు: హీటింగ్ ఉత్పతుల హాట్ సేల్!
న్యూఢిల్లీ: వాటర్ హీటర్లు, గీజర్లు, రూమ్ హీటర్లు తదితర ఉత్పత్తుల అమ్మకాలు ప్రస్తుతం శీతాకాలంలో (వింటర్) జోరుగా ఉంటాయని కంపెనీలు అంచనా వేస్తున్నాయి. ఈ ఏడాది ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గడం అమ్మకాలకు దన్నుగా నిలవనుంది. రెండంకెల స్థాయిలో అమ్మకాలు పెరుగుతాయన్న అంచనాలతో, కంపెనీలు ఇప్పటికే తయారీ సామర్థ్యాన్ని పెంచుకోవడం గమనార్హం. వింటర్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని కంపెనీలు కొత్త ఉత్పత్తులను కూడా మార్కెట్‌కు పరిచేయం చేస్తున్నాయి. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ) సాంకేతికతతో కూడిన గీజర్లను కూడా తీసుకొచ్చాయి. ట్యాంక్ రహిత ఇన్స్టంట్ వాటర్ హీటర్లను కూడా తీసుకొచ్చాయి. ఆయిల్ ఫిల్డ్ రేడియేటర్లతో కూడిన ఖరీదైన రూమ్ హీటర్లు కూడా మార్కెట్లోకి వచ్చాయి. సామాన్య వినియోగదారుల నుంచి, సంపన్న వినియోగదారుల వరకు అవసరాలు, అభిరుచులకు అనుగుణంగా.. సౌకర్యం, మన్నిక, డిజైన్లతో కూడిన ఉత్పత్తులను కంపెనీలు ఆఫర్ చేస్తున్నాయి. (మీరు ఎస్బీఐ ఖాతాదారులా? అయితే మీకో గుడ్ న్యూస్) 20 శాతం వృద్ధిపై క్రాంప్టన్ కన్ను.. క్రాంప్టన్ గ్రీవ్స్ కన్జ్యూమర్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (సీజీసీఈఎల్) అయితే, ఇన్స్టంట్, స్టోరేజ్ వాటర్ హీటర్ల అమ్మకాల్లో 20 శాతం మేర వృద్ధి ఉంటుందని అంచనా వేస్తోంది. గతేడాదితో పోలిస్తే రూమ్ హీటర్ల అమ్మకాల్లో 70 శాతం వృద్ధి ఉండొచ్చని కంపెనీ వైస్ ప్రెసిడెంట్ ఆనంద్ కుమార్ తెలిపారు. ఈ కంపెనీ ఏడు కొత్త మోడళ్లను పరిచయం చేసింది. సోలారియం క్యూబ్ ఐవోటీ సిరీస్, సోలారియం కేర్ సిరీస్ నుంచి ఈ ఉత్పత్తులు ఉన్నాయి. బేబీ కేర్, హెయిర్ కేర్, హైజీన్ కేర్ అనే ఫీచర్లు వీటిల్లో ఉన్నాయి. ఈ ఏడాది వాటర్ హీటర్ల మార్కెట్ సైజ్ 10 శాతం వృద్ధితో 42.5 లక్షలుగా ఉంటుందని కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ అండ్ అప్లయన్సెస్ తయారీదారుల సంఘం (సీఈఏఎంఏ) ప్రెసిడెంట్ ఎరిక్ బ్రగంజా తెలిపారు. రూమ్ హీటర్ల మార్కెట్ 40 లక్షల యూనిట్లు కాగా, ఈ ఏడాది వృద్ధి చలి తీవ్రతపై ఆధారపడి ఉంటుందన్నారు. ముందే సన్నద్ధం.. ‘‘వింటర్ సీజన్‌పైనే వ్యాపార వృద్ధి ఆధారపడి ఉంటుంది. చలి తీవ్రత ఎక్కువైతే ఉత్పత్తులకు డిమాండ్ సహజంగానే అధికమవుతుంది. మార్కెట్లో డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా కొరత ఉండకూడదన్న ఉద్దేశ్యంతో ముందే తయారీ పరంగా తగినంత సన్నద్ధతతో ఉన్నాం’’అని బజాజ్ ఎలక్ట్రికల్స్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ సీవోవో రవీందర్ సింగ్ నేగి వెల్లడించారు. రూమ్ హీటర్ల విభాగంలో ఆయిల్ ఫిల్డ్ రేడియేటర్లు, కార్బన్ రూమ్ హీటర్లు, ఫ్యాన్ రూమ్ హీటర్లు, హాలోజెన్ రూమ్ హీటర్లు ఇలా అన్ని రకాల ఉత్పత్తులను తాము ఆఫర్ చేస్తున్నట్టు నేగి తెలిపారు. హింద్‌వేర్ హోమ్ ఇన్నోవేషన్ ఈ విభాగంలో గడిచిన రెండేళ్లుగా రెండంకెల వృద్ధిని చూస్తున్నట్టు కంపెనీ సీఈవో రాకేశ్ కౌల్ చెప్పారు. ఈ ఏడాది 20 వరకు వాటర్ హీటర్, రూమ్ హీటర్ మోడళ్లను విడుదల చేయడం ద్వారా తమ ఉత్పత్తుల శ్రేణిని విస్తరించినట్టు తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో అమ్మకాల్లో 30 శాతం వృద్ధి కనిపించినట్టు చెప్పారు. (సామాన్యుడికి ఊరట: 11 నెలల కనిష్టానికి రిటైల్ ద్రవ్యోల్బణం) -
చిన్న ఉపకరణాల పరిశ్రమ జోరు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రికల్, వంటింటి ఉపకరణాల తయారీలో ఉన్న వ్యవస్థీకృత రంగ కంపెనీల ఆదాయం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 8–10 శాతం పెరిగే అవకాశం ఉందని క్రిసిల్ రేటింగ్స్ వెల్లడించింది. ‘బ్రాండెడ్ ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతోంది. పట్టణాలేగాక గ్రామీణ ప్రాంతాల్లోనూ స్మార్ట్ ఉపకరణాలను కోరుకుంటున్నారు. ఎలక్ట్రికల్ ఉపకరణాల కొనుగోలు అనేది తక్కువ ప్రమేయం ఉన్న నిర్ణయం అనే అభిప్రాయం వేగంగా మారుతోంది. కిచెన్ పరికరాలు, ఇంటి కోసం లైటింగ్ సొల్యూషన్స్, ఎలక్ట్రిక్ ఫ్యాన్స్, కూలర్స్ వంటివి ఇప్పుడు బ్రాండ్ల పనితీరు, సాంకేతికత, వాడుకలో సౌలభ్యం, బలమైన విక్రయానంతర సేవ వంటి అంశాలను మూల్యాంకనం చేసిన తర్వాతే కస్టమర్లు కొనుగోలు చేస్తున్నారు. స్మార్ట్ ఉపకరణాలకు పెరిగిన డిమాండ్ తయారీదారులను సాంకేతిక పరిశోధన, అభివృద్ధిలో పెట్టుబడి పెట్టేలా చేస్తుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో పరిశ్రమ ఆదాయ వృద్ధి గ్రామీణ, పట్టణ విభాగాల నుండి స్థిరమైన డిమాండ్‌తో ముందుకు తీసుకువెళుతుంది’ అని తెలిపింది. స్థిరమైన డిమాండ్‌తో.. గత ఆర్థిక సంవత్సరంలో రాగి, అల్యూమినియం, ఉక్కు, పాలీప్రొఫైలిన్ వంటి కీలక ముడి పదార్థాల ధరలు పెరిగాయి. స్థిరమైన డిమాండ్ కలిసి రావ డంతో కంపెనీలు ఈ భారాన్ని కస్టమర్లకు బదిలీ చేయడానికి వీలు కలిగింది. గత ఆర్థిక సంవత్సరంలో ఎలక్ట్రికల్ ఉపకరణాల తయారీదారులు ఉత్పత్తి ధరలను 12–14 శాతం పెంచారు. తద్వారా నిర్వహణ లాభదాయకతపై ప్రభావాన్ని పరిమితం చేశారు. ఈ ఆర్థిక సంవత్సరం కూడా ఆపరేటింగ్ మార్జిన్ 50 బేసిస్ పాయింట్లు తగ్గుతుందని అంచనా. నగదు లభ్యత కంపెనీల వద్ద నాలుగేళ్ల క్రితం రూ.3,000 కోట్లు ఉంటే 2022–23లో ఇది రూ.4,000 కోట్లకుపైమాటే అని అంచనా. వ్యవస్థీకృత రంగ కంపెనీలు గత నాలుగు ఆర్థిక సంవత్సరాల్లో స్థిరంగా బ్యాలెన్స్ షీట్లను మెరుగుపరిచాయి. ఇది మధ్య కాలానికి కంపెనీల క్రెడిట్ ప్రొఫైల్స్‌ను బలపరుస్తుంది’ అని క్రిసిల్ రేటింగ్స్ వివరించింది. -
వంట పాత్రల్ని శుభ్రం చేసి..ఆరబెట్టే క్రాకరీ శానిటైజర్!
పింగాణి, గాజు వస్తువులను శుభ్రం చేయడం, భద్రపరచడం చాలా జాగ్రత్తతో చేయాల్సిన పని. పూర్తిగా తడి ఆరని ఈ వస్తువులపై సూక్ష్మజీవులు చేరే అవకాశాలూ ఎక్కువే! ఇలాంటి సున్నితమైన పింగాణి, గాజు వస్తువులను చక్కగా శుభ్రంచేసి, వాటిని పొడిగా ఆరబెట్టేందుకు జపానీస్ సంస్థ ‘యొకాయి’ ఈ క్రాకరీ శానిటైజర్‌ను రూపొందించింది. డిష్వాషర్లు పాత్రలను శుభ్రం చేసే మాదిరిగానే, ఇది పింగాణి, గాజు పాత్రలను, వస్తువులను శుభ్రం చేస్తుంది. అవి శుభ్రమయ్యాక 60 డిగ్రీల ఉష్ణోగ్రత విడుదల చేసి, వాటిపై సూక్ష్మజీవులను నాశనం చేసి, పొడిగా ఆరబెడుతుంది. ప్రస్తుతానికి దీనిని నమూనాగా రూపొందించారు. దీని పనితీరుపై పరీక్షలు కొనసాగిస్తున్నారు. -
Republic Day Sale: ఈ ఆఫర్లు అస్సలు మిస్ చేసుకోవద్దు!
దేశంలో ఈకామర్స్ దిగ్గజాలు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్లు అందిస్తున్న భారీ డిస్కౌంట్ సేల్ కొనసాగుతుంది. రిపబ్లిక్‌డే సందర్భంగా జనవరి 17 నుంచి ప్లిప్ కార్ట్ 'బిగ్ సేవింగ్ డేస్', అమెజాన్ 'గ్రేట్ రిపబ్లిక్ డే సేల్' నిర్వహిస్తున్నాయి. ఈ సందర్భంగా పలు ఉత్పత్తులపై 70 నుంచి 80 శాతం భారీ డిస్కౌంట్‌ను అందిస్తున్నాయి. అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్‌లో అమెజాన్ ఫ్యాషన్‌పై 80 శాతం, గృహోపకరణాల వస్తువులపై 70 శాతం వరకు తగ్గింపుతో అందిస్తుంది. ప్లిప్‌కార్ట్ సైతం అనేక ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లు, బ్యాంక్‌లు ఆఫర్లను అందిస్తున్నాయి. ఈజాబితాలో టీవీలు, స్మార్ట్ఫోన్లు, స్మార్ట్స్పీకర్లు, స్ట్రీమింగ్ ప్రొడక్ట్‌లపై భారీ డిస్కౌంట్లు పొందవచ్చు. ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్ కస్టమర్లు ఎంపిక చేసిన వస్తువులపై గరిష్టంగా 10శాతం తగ్గింపు పొందవచ్చు. 43అంగుళాల స్క్రీన్ 4కే రిజల్యూషన్‌తో స్మార్ట్ టీవీల కోసం చూస్తున్నట్లయితే ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో షియోమీ, శాంసంగ్ నుండి చాలా టీవీలు తగ్గింపు ధరలతో సొంతం చేసుకోవచ్చు. టీవీలు ఎంఐ 4ఎక్స్ 108 సీఎం(43-అంగుళాల) అల్ట్రా హెచ్డీ (4కే) ఎల్ఈడీ స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ: రూ. 29,999 శాంసంగ్ క్రిస్టల్ 4కే 108 సీఎం (43-అంగుళాల) అల్ట్రా హెచ్డీ (4కే ) ఎల్ఈడీ స్మార్ట్ టీవీ: రూ. 36,999 రియల్మీ 108 సీఎం (43-అంగుళాల) అల్ట్రా హెచ్డీ (4కే) ఎల్ఈడీ స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ: రూ. 29,999 వీయూ ప్రీమియం 108 సెం.మీ (43-అంగుళాల) అల్ట్రా హెచ్డీ(4కే) ఎల్ఈడీ స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ: రూ. 25,999 స్మార్ట్ స్పీకర్లు యాపిల్ హోమ్ పాడ్ మినీ ధర రూ. 7,999 గూగుల్ నెస్ట్ హబ్ ధర రూ. 5,999 గూగుల్ నెస్ట్ ఆడియో ధర రూ. 5,999 లెనోవో స్మార్ట్ క్లాక్ ఎసెన్షియల్ ధర రూ. 3,999 స్ట్రీమింగ్ పరికరాలు అదేవిధంగా ప్రస్తుత టీవీని అప్ డేట్ చేయాలనుకుంటే బిగ్ సేవింగ్ డేస్ సేల్ 2022లో అనేక ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. మీరు హెచ్డీఎంఐ పోర్ట్ లేదా యూఎస్బీ పోర్ట్ ద్వారా హార్డ్‌వేర్‌ను మీ టీవీకి కనెక్ట్ చేయవచ్చు. ఎంఐ బాక్స్ 4కే మీడియా స్ట్రీమింగ్ ధర రూ.3,499 రియల్మీ 4కే స్మార్ట్ గూగుల్టీవీ స్టిక్ ధర రూ. 3,499 ఇంటర్నల్ క్రోమాకాస్ట్తో నోకియా మీడియా స్ట్రీమర్ ధర రూ. 2,999 యాపిల్ టీవీ 4కే 32జీబీ ధర రూ.17,999 స్మార్ట్ఫోన్లు యాపిల్ ఐఫోన్ 12మినీ (64జీబీ) రూ. 41,999 మోటరోలా జీ60 (128జీబీ) ధర రూ.17,999 వివో ఎక్స్60 (128జీబీ) ధర రూ.34,990 మి11 లైట్ (128జీబీ) రూ.23,999 రియల్మీ జీటీ 5జీ ధర రూ.37,999గా ఉంది. చదవండి: వచ్చేస్తోంది..అమెజాన్ 'గ్రేట్ రిపబ్లిక్ డే సేల్'..! 70 శాతం మేర తగ్గింపు! -
సింగిల్ స్విచ్‌తో పూటకో వెరైటీ వండివాడ్చేస్తాయి.. సరసమైన ధరల్లోనే..
రోబోటిక్ గ్రిల్ ‘సింగిల్ స్విచ్‌తో పూటకో వెరైటీ ’ అనే పద్ధతికి ఈ ఉరుకుల పరుగుల జీవితాలు బాగా అలవాటు పడిపోయాయి. వంటకు గరిటెతో పని లేకుండా పోయింది. ఇంకా చెప్పాలంటే అసలు మనిషి పక్కనుండాల్సిన అవసరమే లేదు. స్విచ్ ఆన్ చేసి వెళ్తే.. ఏ వేళలో వడ్డించుకున్నా.. వేడివేడిగా అందించడం నేటి టెక్నాలజీ స్పెషల్. చిత్రంలోని ఎలక్ట్రిక్ ఆటోమేటిక్ ఫ్రైయర్ మెషిన్.. గుండ్రంగా తిరుగుతూ క్రిస్పీ రుచులను అందిస్తుంది. గాడ్జెట్లోపల బౌల్ 360 డిగ్రీలు తిరుగుతూ ఆహారాన్ని ఫ్రై చేస్తుంది. ఇంటెలిజెంట్ నాన్‌స్టిక్ డ్రమ్ కలిగిన ఈ రోబోటిక్ మేకర్లో ఒకేసారి ఐదు రకాల ఫుడ్ ఐటమ్స్ గ్రిల్ చేసుకోవచ్చు. అందుకు వీలుగా ఐదు అరలతో కూడిన పార్టిషన్ గ్రిల్ ప్లేట్.. ఈ మేకర్‌తో పాటు లభిస్తుంది. దాన్ని సెట్ చేసి ఒక్కోదానిలో ఒక్కో రకం ఐటమ్‌ని చిత్రంలో ఉన్న విధంగా గ్రిల్ చేసుకోవచ్చు. ఒకే రకాన్ని ఎక్కువ మోతాదులో వండుకోవాలనుకుంటే పార్టీషన్‌ను తీసేసే సౌకర్యమూ ఉంది. ట్రాన్స్పరెంట్ మూత ఉంటుంది. దాన్ని గాడ్జెట్‌కి ఇరువైపులా లాక్ చేసుకునే వీలుంటుంది. గాడ్జెట్ పైభాగంలో ఆప్షన్స్‌తో కూడిన రెగ్యులేటర్ ఉంటుంది. వెనుక వైపు కింది భాగంలో వ్యర్థాలు చేరే ట్రే ఉంటుంది. చదవండి: Viral: సింహాన్ని పరుగులు పెట్టించిన భౌభౌ!! ధర: 181 డాలర్లు (రూ.13,640) పోర్టబుల్ అవుట్ డోర్ గ్రిల్ ఇంట్లో ఉన్నప్పుడు పవర్ సాయంతో నడిచే మేకర్స్ సరే.. కానీ పిక్నిక్స్, హైకింగ్, క్యాంపింగ్‌లకు వెళ్లినప్పుడు ఎలక్ట్రిక్ సేవలు అందిపుచ్చుకోవడం ఎలా? ఆ సమస్యకు పరిష్కారమే ఈ అవుట్ డోర్ చార్కోల్ గ్రిల్. ఒక సూట్ కేస్లా వెంట తీసుకుని వెళ్లి.. అవసరమైనప్పుడు గ్రిల్ ప్లేట్స్‌ను చిత్రంలో చూపిన విధంగా అమర్చుకుని.. బొగ్గులపై క్రిస్పీ రుచులను తయారుచేసుకోవచ్చు. హైక్వాలిటీ మెటీరియల్‌తో రూపొందిన ఈ గాడ్జెట్ తుప్పు పట్టదు. దీన్ని పట్టుకున్నప్పుడు చేతులు గీసుకోకుండా, బట్టల్లోని దారపు పోగులను లాగకుండా అన్ని అంచులు చక్కగా పాలిష్ చే సి ఉంటాయి. ఇందులో ఒకేసారి ఇద్దరి నుంచి ఐదుగురికి సరిపడే ఆహారాన్ని తయారుచేసుకోవచ్చు. ధర: 34 డాలర్లు (రూ.2,562) మల్టీఫంక్షన్ బ్రేక్‌ఫాస్ట్ మేకర్ చిత్రాన్ని చూసి ఇదేదో హ్యాండ్ బ్యాగ్ అనుకునేరు! కాదు కాదు. ఇదో బ్రేక్‌ఫాస్ట్ మేకర్. అవును.. శాండ్విచ్, బ్రెడ్ టోస్ట్, వాఫిల్స్, గుంత పొంగనాలు ఇలా చాలా రుచులను నిమిషాల్లో అందించగలిగే కుక్వేర్. ఒకరిద్దరికి సరిపడే పరిమాణంలో చాలా వెరైటీలను ఇందులో తయారుచేసుకోవచ్చు. ఈ మేకర్‌తో పాటు ఒక జత గ్రిల్ ప్లేట్స్, మరో జత వాఫిల్స్ ప్లేట్స్, రెండు గుంతపొంగనాల ప్లేట్స్ లభిస్తాయి. అవి డీప్ నాన్–స్టిక్ కోటింగ్ ప్లేట్స్ కావడంతో.. మెషిన్‌కి అటాచ్ చేయడం, వేరు చేయడం చాలా సులభం. ఇక దీనిపైన చికెన్, ఫిష్, రొయ్యలు వంటివీ గ్రిల్ చేసుకోవచ్చు. కట్లెట్స్, కబాబ్స్ లాంటివీ వండుకోవచ్చు. మెషిన్ ఆన్ అయిన తర్వాత రెడ్ లైట్ పవర్ ఆన్ని సూచిస్తుంది. ఇది లైట్ వెయిట్ కావడంతో ఉపయోగించడం చాలా తేలిక. ధర: 214 డాలర్లు (రూ.16,127) చదవండి: దయచేసి ఒక్కసారి తుమ్మి మా పార్టీని గెలిపించండి..!! -
గృహోపకరణాలకు పెద్దపీట
సాక్షి, అమరావతి: కోవిడ్ దెబ్బతో కొనుగోళ్ల విషయంలో ప్రజల ఆలోచనా విధానం సమూలంగా మారిపోయింది. గృహోపకరణాలకు డిమాండ్ భారీగా పెరిగింది. ప్రధానంగా సినిమా హాళ్లు మూత పడటంతో వినోదం కోసం ప్రజలు ఇంటినే ఒక సినిమా హాలుగా మార్చుకుంటున్నారు. డబ్బున్న వారు హోమ్ థియేటర్ సమకూర్చుకుంటుంటే.. మధ్య, దిగువ మధ్య తరగతి ప్రజలు పెద్ద స్క్రీన్లు ఉన్న టీవీలను కొని తెచ్చుకుంటున్నారు. కోవిడ్ వల్ల పలు సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఓటీటీ విధానంలో రిలీజ్ చేస్తుండటంతో వాటిని ఇంటి వద్ద నుంచే చూడటానికి అనువుగా పెద్ద స్క్రీన్ల టీవీలపై మొగ్గు చూపుతున్నారు. గతంలో ఎల్ఈడీ టీవీ అమ్మకాల్లో 32 అంగుళాలవి ఎక్కువగా ఉండేవని, ఇప్పుడు 43 అంగుళాలు, అంత కంటే ఎక్కువ సైజు ఉన్న టీవీలు ఎక్కువగా అమ్ముడవుతున్నాయని విజయ్ సేల్స్ (పాత టీఎంసీ) ప్రతినిధి అశోక్ కుమార్ తెలిపారు. గతంతో పోలిస్తే హోమ్ థియేటర్ల అమ్మకాలు 50 శాతం పెరగ్గా, పెద్ద ఎల్ఈడీ టీవీల అమ్మకాల్లో 30 శాతం వృద్ధి కనిపిస్తోందని డీలర్లు చెబుతున్నారు. ఇదే సమయంలో పిల్లలకు ఆన్లైన్ క్లాసులు, వర్క్ ఫ్రమ్ హోమ్ పెరగడంతో ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్ల అమ్మకాలు సైతం భారీగా పెరిగాయి. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికానికి దేశంలో రికార్డు స్థాయిలో 5.43 కోట్ల మొబైల్ ఫోన్లు దిగుమతి అయ్యాయంటే డిమాండ్ ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కోవిడ్ దెబ్బతో రాష్ట్రంలో అనేక రంగాల్లో పారిశ్రామిక ఉత్పత్తి క్షీణిస్తే, కంప్యూటర్లు, మొబైల్ ఫోన్ల తయారీలో మాత్రం భారీ వృద్ధి నమోదైంది. ఏప్రిల్–ఆగస్టు మధ్య కంప్యూటర్లు, మొబైల్ ఫోన్స్ వంటి ఎలక్ట్రానిక్ వస్తువుల ఉత్పత్తి 71.18 శాతం పెరిగినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. పని మనిషికి బైబై.. ► కరోనా మహమ్మారి భయంతో చాలా మంది పని మనుషులకు టాటా చెప్పేశారు. దీంతో రాష్ట్రంలో ఒక్కసారిగా డిష్ వాషర్లకు డిమాండ్ పెరిగింది. గతంలో నెలకు రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి నుంచి రెండు డిష్ వాషర్లు అమ్మడం గగనంగా ఉండేదని, అలాంటిది ఇప్పుడు నెలకు 600 వరకు అమ్ముతున్నట్లు సోనోవిజన్ మేనేజింగ్ పార్టనర్ పి.భాస్కర మూర్తి తెలిపారు. ► ఒక్కసారిగా డిష్ వాషర్లకు డిమాండ్ పెరగడంతో దానికి తగ్గట్టుగా సరఫరా ఉండటం లేదని, దీంతో బుకింగ్ చేసుకున్న 15 రోజులకు గానీ సరఫరా చేయలేకపోతున్నామని విజయ్ సేల్స్ ప్రతినిధి అశోక్ తెలిపారు. ► వాషింగ్ మెషీన్లకూ డిమాండ్ పెరిగినా, ఇప్పుడు గతేడాది స్థాయిలోనే అమ్మకాలు జరుగుతున్నట్లు డీలర్లు పేర్కొన్నారు. పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే రాష్ట్రంలో దసరా అమ్మకాలు గతేడాదితో పోలిస్తే 15 శాతం వరకు వృద్ధి నమోదైంది. దీంతో దీపావళి పండగ అమ్మకాలపై డీలర్లు భారీ ఆశలు పెట్టుకున్నారు. ఇందుకోసం క్యాష్ బ్యాక్ ఆఫర్లు, స్క్రాచ్ కార్డులతో వినియోగదారులను ఆకర్షిస్తున్నారు. -
ఈ ఐదు ముఖ్యం అంటున్న భారతీయులు
సాక్షి, న్యూఢిల్లీ: ఏ కాలమైనా సరే, ఏ విపత్తులు వచ్చినా సరే భారతీయులు వారి అలవాట్లు, ఇష్టాయిష్టాలు మార్చుకోలేరు. డబ్బులు కూడబెట్టి ఇష్టంగా కొనుక్కున్న బంగారాన్ని కష్టకాలంలో తాకట్టు పెట్టేందుకు ఏమాత్రం వెనుకాడరు. పని లేకపోయినా పొట్ట మాత్రం ఖాళీగా ఉంచడానికి ఇష్టపడలేదు. అయితే కరోనా వల్ల తిరిగి ఆయుర్వేద పద్ధతులను అనుసరిస్తూ లాక్డౌన్ తెచ్చిన తంటాల వల్ల ఆధునికతను ఒడిసిపట్టుకుంటున్నారు . ఇలా కొన్ని అలవాట్లను వారి జీవనశైలిలో భాగస్వామ్యం చేసుకోవడం మంచి పరిణామం. మరి మనవాళ్లు ఈ కష్టకాలంలో వేటిని ఎక్కువగా కొనుగోలు చేశారు? దేనిపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారో చూసేద్దాం.. రోగనిరోధక శక్తిని పెంపొందించేవి ఒక్క మనదేశంలోనే కాదు, ప్రపంచమంతా ఇప్పుడు వీటి మీదే దృష్టి కేంద్రీకరించింది. ఎంతటి రోగాన్నైనా తట్టుకునే శక్తి మన శరీరంలో ఉండాలన్న విషయంతో జనాలు ఇప్పుడిప్పుడే ఏకీభవిస్తున్నారు. దీంతో సహజంగానే ఆయుర్వేదం, ఇంటి చిట్కాలను ఫాలో అవుతున్నారు. సహజ ఉత్పత్తులను అందించే డాబర్, హిమాలయ కంపెనీలకు గిరాకీ పెరగడమే ఇందుకు నిదర్శనం. సహజ మూలకాలతో తయారు చేసిన చ్యావన్‌ప్రాష్ అమ్మకాలు ఏప్రిల్ నుంచి జూన్ మధ్య 700 శాతం పెరిగాయని డాబర్ కంపెనీ తెలిపింది. అలాగే తేనే అమ్మకాల్లోనూ 39 శాతం పెరుగుదల కనిపించినట్లు పేర్కొంది. (‘ఎక్కువ జాబ్‌లు లేవు.. అందుకే ఇది’) ఆహారం ప్యాకేజ్డ్ ఫుడ్‌కే వినియోగదారులు మరోసారి జై కొట్టారు. ఇవి ఎక్కువ కాలం నిల్వ ఉండటమే ఇందుకు కారణం. బియ్యంతోపాటు అల్పాహారానికి అవసరమయ్యే తృణధాన్యాలు, నూడుల్స్ ఈ లిస్టులో ఉన్నాయి. ముఖ్యంగా రెండు నిమిషాల్లో రెడీ అయ్యే మ్యాగీ నూడుల్స్ అమ్మకాలు మార్చిలో 10.7 శాతం పెరిగాయి. అలాగే కిట్‌క్యాట్, మంచ్ చాక్లెట్ల కొనుగోళ్లు కూడా పెరిగాయని హాయ్టాంగ్ సెక్యూరిటీస్ కంపెనీ అనలిస్టులు గౌరాంగ్ కక్కడ్, ప్రేమల్ కందార్ పేర్కొన్నారు. అతి సామాన్యుడికి కూడా అందుబాటు ధరలో లభ్యమయ్యే పార్లీజీ బిస్కెట్ ప్యాకెట్ సేల్స్ రికార్డు స్థాయిలో జరిగాయి. డిజిటల్ సేవలు పిల్లలు ఆన్లైన్ పాఠాలు కోసం, పెద్దలు బిజినెస్ మీటింగ్‌ల కోసం డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడక తప్పలేదు. ఆన్లైన్ పాఠాలు అందించే బైజులో చేరే వారి సంఖ్య మూడు రెట్లు పెరిగిందని దాని మాతృ సంస్థ థింక్ అండ్ లెర్న్ ప్రైవేటు చెప్పుకొచ్చింది. మరోవైపు వర్క్ ఫ్రమ్ హోమ్ తప్పనిసరైన నేపథ్యంలో ఆన్లైన్ షాపింగ్ అడ్డా ఫ్లిప్‌కార్ట్‌లో ల్యాప్‌ట్యాప్‌ల కోసం వెతికే వారి సంఖ్య రెండితలైంది. ఒక్క మే నెలలోనే వినోదాన్ని అందించే జీ5 ఓటీటీని ఆశ్రయించినవారి సంఖ్య 33శాతం ఎగబాకిందని ఆ సంస్థ వెల్లడించింది. (జిమ్‌లు రేపట్నుంచే..) బంగారం రుణాలు భారతీయులకు బంగారం అంటే మక్కువ ఎక్కువ. దీన్ని తాకట్టు పెట్టి రుణాలు తీసుకోడానికి ప్రాధాన్యతనిస్తారే తప్ప అమ్మడానికి ఇష్టపడరు. లాక్డౌన్ దెబ్బతో ఉపాధి కోల్పోయిన సామాన్యులు, చిరు వ్యాపారులు, పేదలు కష్టాలను గట్టెక్కించడానికి బంగారం తాకట్టు పెట్టి అప్పులు తీసుకుంటున్నారు. దీంతో మణిపురం ఫైనాన్స్ లిమిటెడ్, ముత్తూట్ ఫైనాన్స్ వంటి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు బంగారంపై ఎక్కువ రుణాలు ఇస్తూ వడ్డీలు ఆర్జిస్తున్నాయి. దీంతో వీటి షేర్లు అమాంతం పెరిగాయి. (బంగారం డిమాండ్ 70% డౌన్) ఉపకరణాలు ఇంట్లో శ్రమను తగ్గించుకునేందుకు అవసరమైన వస్తువులను కొనుగోలు చేయడానికి ఇండియన్స్ ఏమాత్రం వెనకడుగు వేయలేదు. మిక్సీలు, మైక్రోవేవ్‌లు, టోస్టర్లు వంటి వస్తువులకు జూలైలో విపరీతమైన డిమాండ్ ఏర్పడిందని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. వాక్యూమ్ క్లీనర్ల వంటి శుభ్రత కోసం వినియోగించే పరికరాల అమ్మకాలు నాలుగింతలు అయ్యాయని పేర్కొంది. మొన్నటివరకు సెలూన్లు తెరుచుకునేందుకు ప్రభుత్వం నిషేధం విధించడంతో ఇంట్లోనే జుట్టు కత్తిరించేందుకు, గడ్డం గీసుకునేందుకు అవసరమైన ట్రిమ్మర్ వంటి పరికరాలను ప్రజలు కొని పెట్టుకున్నారు. దీంతో ట్రిమ్మర్ల అమ్మకాలు 5 రెట్లు పెరిగాయని హావెల్స్ ఇండియా లిమిటెడ్ కంపెనీ చెప్పుకొచ్చింది. ► మొత్తంగా భారతీయులు ఇంట్లోకి అవసరమయ్యే వస్తువుల కొనుగోలుపై ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారని మింటెల్ అధ్యయనం పేర్కొంది. -
రెట్టింపు పేరుతో నట్టేట ముంచి..
పిఠాపురం(తూర్పుగోదావరి): చెల్లించిన సొమ్ముకు రెట్టింపు విలువైన గృహోపకరణాలు ఇస్తామంటూ ఓ కంపెనీ ప్రజలను నమ్మించి మోసం చేసింది. ఎస్సై అబ్దుల్ నబీ తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణానికి చెందిన కేశబోయిన సతీష్‌బాబు 2018లో పిఠాపురంలో సిరి ఎంటర్‌ప్రైజస్ పేరుతో ఒక కంపెనీ ఏర్పాటు చేశాడు. నెలకు రూ.500 చొప్పున 20 నెలల పాటు (రూ.పదివేలు) చెల్లిస్తే ప్రతి నెలా లక్కీడ్రా తీసి దానికి రెట్టింపు విలువైన గృహోపకరణాలు ఇస్తామంటూ నమ్మబలికాడు. దీంతో పిఠాపురం దాని పరిసర ప్రాంతాలకు చెందిన సుమారు 1500 మంది రూ.పదివేలు చొప్పున చెల్లించారు. నెలలు గడుస్తున్నా ఏవిధమైన గిఫ్ట్‌లు ఇవ్వక పోవడంతో అనుమానం వచ్చి గురువారం రాత్రి ఆ కంపెనీకి చెందిన రిప్రజెంటేటివ్ రాహుల్‌ను పట్టుకున్నారు. తాము మోసపోయినట్టు గ్రహించి సదరు కంపెనీపై చర్యలు తీసుకోవాలంటూ శుక్రవారం ఉదయం నుంచి పిఠాపురం పట్టణ పోలీసు స్టేషన్ వద్ద బారులు తీరారు. పోలీసులు ఆ కంపెనీపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
టీవీ, గృహోపకరణాల ధరలకు రెక్కలు
న్యూఢిల్లీ: టీవీలు, ఇతర గృహోపకరణాల ధరలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. తయారీ వ్యయాలు పెరిగినప్పటికీ ఇటీవల పండుగల సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని కంపెనీలు రేట్ల పెంపును కాస్తంత వాయిదా వేసుకున్నాయి. దీంతో వాటి మార్జిన్లపై ప్రభావం ఉంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ పెరగడం కంపెనీలపై భారం పెరిగేలా చేసింది. ఈ పరిస్థితులను అధిగమించి, తమ మార్జిన్లను బలోపేతం చేసుకునేందుకు కంపెనీలు ధరల పెంపును చేపట్టాయి. కొన్ని కంపెనీలు ఇప్పటికే పెంచగా, ప్యానాసోనిక్ ఇండియా 7 శాతం మేర తన ఉత్పత్తుల ధరలను పెంచనుంది. ‘‘గత కొన్ని నెలలుగా రూపాయి క్షీణిస్తూ రావడం వల్ల మా తయారీ వ్యయాలపై ప్రభావం పడింది. అయితే, చాలా వరకు మేం సర్దుబాటు చేసుకున్నాం. కానీ మార్కెట్ పరిస్థితుల నేపథ్యంలో వచ్చే నెల నుంచి 5–7 శాతం స్థాయిలో పెంచక తప్పడం లేదు’’ అని ప్యానాసోనిక్ ఇండియా ప్రెసిడెంట్ మనీష్ శర్మ తెలిపారు. పండుగల తర్వాత నుంచి తాము రేట్ల పెంపును చేపట్టినట్టు హయర్ ఇండియా ప్రెసిడెంట్ ఎరిక్ బ్రగంజ సైతం తెలిపారు. కంపెనీల వార్షిక విక్రయాల్లో మూడింట ఒకవంతు దసరా, దీపావళి సమయంలోనే జరుగుతుంటాయి. సెప్టెం బర్లో 3–4% ధరలు పెంచినప్పటికీ అవి ఇంకా ఆచరణ రూపం దాల్చలేదని కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ తయారీ సంఘం (సీఈఏఎంఏ) సైతం తెలిపింది. ఎంఆర్పీ పెంచినప్పటికీ డిమాండ్ తగ్గడం, మార్కెట్ వాటా కోసం బ్రాండ్ల మధ్య పోటీతో అమల్లోకి రాలేదని వివరించింది. తమ టెలివిజన్ల ధరలను పెంచే ఆలోచనేదీ లేదని సోనీ స్పష్టం చేసింది. -
ఫ్లిప్‌కార్ట్ దీపావళి ధమాకా
సాక్షి, ముంబై: వరుస పండుగలతో ఈకామర్స్ సంస్థలు ఆఫర్లతో కస్టమర్లకు ఆకర్షించేందుకు సిద్ధమైపోయాయి. దసరా సీజన్‌ను బాగా క్యాష్ చేసుకున్న ఫ్లిప్‌కార్ట్ ఇపుడికి దీపావళి అమ్మకాలపై కన్నేసింది. ఈ నేపథ్యంలో 'ఫెస్టివ్ ధమాకా డేస్' పేరుతో దీపావళి సేల్‌ను ప్రకటించింది. అక్టోబర్ 24-27 వరకు నాలుగు రోజుల పాటు నిర్వహించనుంది. అన్ని ప్రముఖ ఉత్పత్తులపై ఆఫర్లు ఉంటాయని సంస్థ వెల్లడించింది. ముఖ్యంగా స్మార్ట్ఫోన్లతోపాటు టీవీలు, ఇతర గృహోపకరణాలపై 70శాతం వరకు డిస్కౌంట్లు అందుబాటులో ఉంటాయని తెలిపింది. దీపావళి అమెజాన్ వచ్చే వారం మరోసారి గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ఇప్పటికే ప్రకటించిన సంగతి గమనార్హం. బిగ్ బిలియన్ డేస్ సేల్ మాదిరిగా కాకుండా ఈ ఫ్లిప్‌కార్ట్ ఫెస్టివ్ ధమాకా డేస్‌లో తొలి రోజు నుంచే అన్ని ఉత్పత్తులపై సేల్ ప్రారంభం కానుంది. ఇక ఫ్లిప్‌కార్ట్ ప్లస్ కస్టమర్లకు ఈ ఆఫర్లు అక్టోబర్ 23 రాత్రి 9 గంటల నుంచే అందుబాటులోకి వస్తాయి. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యులకు డెలివరీ, కస్టమర్ కేర్ లలో ప్రాధాన్యతతో పాటు అదనంగా రివార్డ్ పాయింట్స్, ఇతర సౌకర్యాలు కల్పించనున్నారు. యాక్సిస్ బ్యాంక్ కార్డులు, డెబిట్ కార్డుపై ఈఎంఐ, నో కార్ట్ ఈఎంఐ, ఫోన్‌పేపై క్యాష్‌బ్యాక్ ఆఫర్లున్నాయి. ఏయే ప్రొడక్ట్స్‌పై ఎంతెంత డిస్కౌంట్లు ఇస్తామనేది ఫ్లిప్‌కార్ట్ ఇంకా ప్రకటించలేదు. -
కొంటే ఏముంది? రెంటే బాగుంది!!
కొనుక్కునే బదులు అద్దెకు తీసుకుంటే మేలు గృహోపకరణాల నుంచి వ్యవసాయ పరికరాలు అందుబాటులో దుస్తులు, పుస్తకాలు, ఆభరణాలు, వాహనాలు, ఫర్నిచర్, బొమ్మలు అద్దెకు అవసరం తీరుతుంది; ఖర్చు ఆదా అవుతుంది తరచూ కొత్తవి మార్చుకోవచ్చు కూడా.. దేశంలో రూ.10,200 కోట్లకు చేరిన అద్దె విపణి ఉద్యోగాల బదిలీ, ప్రీమియం ఉత్పత్తులపై కోరికే వృద్ధికి కారణం: విశ్లేషకులు రమేష్, సునీత భార్యాభర్తలు. మంచి ఉద్యోగాలు చేస్తున్నారు. ఆ నెల్లో దాదాపు నాలుగు ఫంక్షన్లకు అటెండ్ అవ్వాలి. అన్నీ దాదాపు బంధువులవే. ఇంట్లో బ్రాండెడ్ నుంచి డిజైనర్ దుస్తులదాకా చాలానే ఉన్నా... అన్నీ ఒకసారైనా వేసుకున్నవి కావటంతో ఫంక్షన్లకు కొత్తవి కొనాల్సిందే అనుకున్నారు. కానీ నాలుగు ఫంక్షన్లకీ కొత్తవి కొనాలంటే..? అమ్మో!! అనుకున్నారు. ఇంతలో రమేష్ స్నేహితుడు శేఖర్ వచ్చాడు. వీళ్ల సమస్య విని... ‘‘మంచి డిజైనర్ వేర్‌ను అద్దెకు తీసుకోవచ్చు కదా?’’ అంటూ సలహా ఇచ్చాడు. ‘‘నిజమా!! కార్లు, బైకులు అద్దెకిస్తారని తెలుసు కానీ... దుస్తులు కూడా ఇస్తారా?’’ అంటూ ఆశ్చర్యపోయాడు రమేష్. ‘‘అవేకాదు. జ్యుయలరీ, ఫర్నిచర్, బొమ్మలు... ఆఖరికి మీరో ఆఫీసు పెట్టి పది రోజులకు ఉద్యోగులు కావాలంటే కూడా పంపిస్తారు’’ అని వివరించాడు శేఖర్. ఇకనేం!! రమేష్, సునీత సమస్యకు పరిష్కారం దొరికింది. మీకూ ఆ పరిష్కారం కావాలా? దుస్తులు, ఆభరణాలు, వంటింటి సామగ్రి... ఇలా కావాల్సిన వస్తువులన్నీ ఎంచక్కా అద్దెకు తీసుకోవాలనుకుంటున్నారా? అయితే మీ కోసమే ఈ ప్రత్యేక కథనం.. అద్దెకు వస్తువులు తీసుకోవటమంటే ఒకప్పుడు ఇల్లు మాత్రమే. తరవాత కార్లు, బైకులు అద్దె వ్యాపారంలోకి వచ్చాయి. కానీ ఇపుడు వంటింట్లోని సామగ్రి నుంచి వ్యవసాయ పరికరాల వరకూ అన్నీ అద్దె మార్కెట్లోకి వచ్చేశాయి. దీన్నే కాస్త స్టైల్‌గా ‘షేరింగ్ ఎకానమీ’ అని పిలుస్తూ అంతా షేరింగ్ బాట పడుతున్నారు. కొత్త కొత్త వ్యాపారాలకు దారులు తెరుస్తున్నారు. నిజానికి ఈ రెంటల్ వ్యాపారంలో కస్టమర్ ఒక వస్తువును అద్దెకు తీసుకుని... దాన్ని వినియోగించుకున్నాక తిరిగి కంపెనీకి ఇచ్చేస్తాడు. కంపెనీ దాన్ని రీఫర్బిష్ చేసి తిరిగి కొత్తదానిలా మారుస్తుంది. అద్దెకు సిద్ధం చేస్తుంది. సాధారణంగా కంపెనీలు తమ ఉత్పత్తులను అద్దెకివ్వటానికి మూడు మార్గాల్ని అనుసరిస్తున్నాయి. అవి... కొన్ని సంస్థలు ముందుగా ఉత్పత్తులను కొనేసి... వాటిని తమ వెబ్సైట్లో లిస్ట్ చేసి కస్టమర్లకు అద్దెకిస్తున్నాయి. ఫర్నీచర్, గృహోపకరణాలు, ఇంటీరియర్ ఈ విభాగంలో ఈ ధోరణి ఎక్కువ. కానీ ఈ వ్యాపారానికి కొంత పెట్టుబడి కావాలి. వస్తువుల తయారీ సంస్థలు, వెండర్లు, వ్యక్తులు ఇతరత్రా మార్గాల ద్వారా అగ్రిమెంట్, లీజు మీద ఆయా సంస్థలు ఉత్పత్తులను సమీకరిస్తాయి. వాటిని తమ వెబ్సైట్లలో పెట్టి అద్దెకిస్తున్నాయి. బైకులు, కార్ల వంటివి ఈ విభాగంలో ఎక్కువ. ఈ వ్యాపారానికి మొదటి రకం మాదిరి ఎక్కువ పెట్టుబడి అవసరం లేదు. చాలామంది తమ దగ్గరున్న, అప్పటికి అవసరం లేని వస్తువులను ఇతరులకు అద్దెకివ్వాలనుకుంటారు. అలాంటి వారు ఉపయోగించుకోవటానికి రెంటల్ వెబ్‌సైట్లున్నాయి. ఒకరకంగా రెంటల్ అగ్రిగేటర్లన్న మాట. వారు ఈ వెబ్సైట్లలో తమ ఉత్పత్తులను ఉచితంగా నమోదు చేసుకోవచ్చు. అవసరమున్న కస్టమర్ నేరుగా వస్తువు యజమానిని సంప్రదించి అద్దెకు తీసుకుంటాడు. ఈ వ్యాపారంలో వస్తువుల నాణ్యత, బాధ్యత విషయంలో సంస్థకు ఎలాంటి సంబంధం ఉండదు. దుస్తులు: 3 గంటల నుంచి 3 రోజుల వరకూ దుస్తుల విషయానికొచ్చేసరికి ఫ్లైరోబ్, స్విష్‌లిస్ట్, వ్రాప్డ్, లైబ్ రెంట్, క్లోజీ, ది క్లాతింగ్ రెంటల్, ది సైటల్ డోర్, స్టేజ్3 వంటి సంస్థలు ఆన్లైన్ లో అద్దెకిస్తున్నాయి. సంప్రదాయ దుస్తుల నుంచి డిజైనర్ వేర్స్ వరకూ అన్నింటినీ వీటి సాయంతో అద్దెకు తీసుకునే వీలుంది. పిల్లలు, మహిళలు, పురుషులు... ఇలా అన్ని విభాగాల్లోనూ ఇవి దుస్తులను అద్దెకిస్తున్నాయి. అద్దె గరిష్టంగా 3 గంటల నుంచి 3 రోజుల వరకు తీసుకునే వీలుంది. ఎఫ్‌సీయూకే, ఫరెవర్ న్యూ, అసూస్, మ్యాంగో, క్విర్క్బాక్స్ వంటి ప్రముఖ బ్రాండ్లు చాలానే ఉన్నాయి. రీతు కుమార్, మసాబా గుప్తా, సమ్మంత్ చౌహాన్, సెహ్లాఖాన్, సురేంద్రి వంటి ప్రముఖ డిజైనర్స్ కలెక్షన్స్ కూడా వీటిలో దొరుకుతున్నాయి. అయితే హైస్ట్రీట్ బ్రాండ్లకు మాత్రం ఎలాంటి ముందస్తు డిపాజిట్ అవసరం లేదు. డిజైనర్ దుస్తులకైతే 20 శాతం సొమ్మును డిపాజిట్‌గా ముందు చెల్లించాల్సి ఉంటుంది. ఫర్నిచర్: ఫ్రీ డెలివరీ, పికప్ ఫర్నిచర్‌ను అద్దెకివ్వటానికి ఫ్యూర్లెన్కో, రెన్టొమొజో, గ్యారెంటెడ్, రెంటల్వాలా తదితర సంస్థలున్నాయి. తరచుగా ఉద్యోగ బదిలీ కారణంగా మారిన ప్రతి చోటా కొత్త ఫర్నిచర్ కొనుక్కోవటమంటే చాలా కష్టం. పోనీ అప్పటికే ఉన్న ఫర్నిచర్‌ను మారిన చోటికి తీసుకెళదామంటే రవాణా ఖర్చులు మామూలుగా ఉండవు. వాటి బదులు కొత్తవి కొనుక్కోవటమే బెటరనిపిస్తుంది. ఫర్నిచర్ రెంటల్ కంపెనీలకు ఊపిరి పోసింది ఈ అంశమే. అయితే ఈ సంస్థలు ఫర్నీచర్‌తో పాటూ హోం అప్లయెన్సెస్, గేమింగ్, కెమెరా, వైఫై, స్మార్ట్ డోర్ లాక్స్ వంటి ఇంటికి సంబంధించిన ప్రతి వస్తువునూ అద్దెకిస్తున్నాయి. దాదాపు అన్ని సంస్థలూ ఉచితంగా డెలివరీ, పికప్ సర్వీసులను అందిస్తున్నాయి. వీటిని ఎన్నాళ్లయినా అద్దెకు వాడుకోవచ్చు. కాకపోతే కాలం పెరుగుతున్న కొద్దీ అద్దె కూడా పెరుగుతుంది. అదీ కథ. బొమ్మలు: మెట్రోల్లోనే ఎక్కువ పిల్లల కోసం ఆడుకునే బొమ్మలు ఒకసారి కొంటాం. నాలుగైదు సార్లు ఆడగానే... అది బోర్‌కొట్టి కొత్త బొమ్మ కావాలంటారు వాళ్లు. మరి పాత బొమ్మ సంగతో? అందుకే ఫన్ స్టేషన్, కిలోనేవాలా, రెంట్టాయ్స్, టాయ్ఎక్స్ప్రెస్, ఫ్రెండ్లీటాయ్స్ వంటి సంస్థలు బొమ్మలు అద్దెకిస్తున్నాయి. చాలా కంపెనీల సేవలు హైదరాబాద్, బెంగళూరు, ముంబై, పుణె, అహ్మదాబాద్ వంటి పెద్ద నగరాలకే పరిమితమయ్యాయి. ఎందుకంటే మెట్రో నగరాలతో పోలిస్తే ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో బొమ్మల వినియోగం తక్కువని, నాణ్యత కాసింత తక్కువని ఫన్ స్టేషన్ ఫౌండర్ కశ్యప్ షా ‘సాక్షి బిజినెస్ బ్యూరో’కు తెలిపారు. బొమ్మల అద్దెలు వారం రోజుల నుంచి నెల, ఏడాది వారీగా ప్యాకేజీలుంటాయి. 2014లో ప్రారంభమైన ఫన్స్టేషన్లో 500 మంది రిజిస్టర్ యూజర్లున్నారని.. 400 లెగో సెట్స్ అద్దెకిచ్చామని ఆయన తెలియజేవారు. వ్యవ‘సాయం’: అవసరమైతేనే ట్రాక్టర్ మిగతా ఆన్ లైన్ రెంటల్ కంపెనీలతో పోలిస్తే మహీంద్రా అండ్ మహీంద్రా (ఎంఅండ్ఎం) కాస్త డిఫరెంటేనని చెప్పాలి. ఎందుకంటే ఇది ట్రింగో పేరిట సరికొత్త వ్యాపారానికి తెరతీసింది. ఓలా, ఉబెర్ సంస్థలు ఎలాగైతే కార్లను అద్దెకిస్తున్నాయో అదే తరహాలో ట్రింగో వేదికగా ట్రాక్టర్లను, వ్యవసాయ పరికరాలను అద్దెకు తీసుకోవచ్చన్నమాట. ‘‘మనది వ్యవసాయ ఆధారిత దేశం. 80శాతం మంది రైతులకు ట్రాక్టర్లు కొనాలనే కోరిక ఉన్నా ఆర్థిక స్థోమత సహకరించట్లేదు. దీంతో చాలా మంది రైతులు పశువుల మీద ఆధారపడి పొలాన్ని దున్నిస్తున్నారు. చాలా సమయం వృథా అవుతోంది. దీనికి పరిష్కారం చూపించేందుకే గతేడాది రూ.10 కోట్ల పెట్టుబడితో ట్రింగోను ప్రారంభించాం’’ అని సంస్థ సీఈఓ అరవింద్ కుమార్ చెప్పారు. 3 వేల మంది రైతుల వినియోగం.. ట్రింగో ఫిజికల్, డిజిటల్ ఇలా రెండు విధాలుగా పనిచేస్తుంది. ఫిజికల్ విధానంలో.. ఫ్రాంచైజీ సెంటర్లుంటాయి. ఈ స్టోర్లలో ట్రాక్టర్లు, పరికరాలు ఉంటాయి. వీటిని ఎలా వినియోగించాలో శిక్షణ ఇచ్చేందుకు నిపుణులూ అందుబాటులో ఉంటారు. డిజిటల్ విధానంలో కాల్ సెంటర్, యాప్ ద్వారా సేవలను పొందవచ్చు. ప్రస్తుతం ట్రింగో కర్నాటక, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో 13 సెంటర్ల ద్వారా సేవలందిస్తుంది. సుమారు 3 వేల మంది రైతులు వినియోగించుకున్నారు. త్వరలోనే రాజస్థాన్, మధ్య ప్రదేశ్ రాష్ట్రాల్లోనూ ట్రింగో సేవలను ప్రారంభించనున్నట్లు అరవింద్ తెలిపారు. బుక్స్: ఆధునిక టెక్నాలజీతో ‘చినిగిన చొక్కా అయినా తొడుక్కో.. మంచి పుస్తకం కొనుక్కో’ అనేది ఒకనాటి మాట. రెంటల్ కంపెనీలిపుడు ‘పుస్తకం కొనుక్కోవడమెందుకు అద్దెకు తీసుకో’ అని దీన్ని మార్చేశాయి. దేశంలో ఇండియారీడ్స్, డోర్‌స్టెప్స్ బుక్స్, లైబ్రరీవాలా, ఐరెంట్ షేర్, జస్ట్బుక్స్ వంటి పలు సంస్థలు పుస్తకాలను అద్దెకిస్తున్నాయి. ఇందులో క్రీడ, ఆధ్యాత్మిక, సామాజిక, కాల్పనిక, సాహిత్యం, టెక్నాలజీ ఇలా అన్ని పుస్తకాలూ అందించటం వీటి ప్రత్యేకత. బెంగళూరు ఐఐఎంలో ఏర్పాౖటెన జస్ట్ బుక్స్ హైదరాబాద్‌లో కూడా పలు బ్రాంచిలు ఏర్పాటు చేసింది. అద్దెకు తీసుకెళ్లిన బుక్స్‌ను గుర్తించడానికి బార్ కోడ్ రీడర్ల వంటి టెక్నాలజీని కూడా ఇది ఉపయోగిస్తోంది. ఆభరణాలు: వారమైతే ఓకే! ఈవ్స్ 24, రెంట్ జ్యుయలరీ, లక్సీపిక్, రెంటల్వాలా, ఫ్లైరోబ్ వంటి సంస్థలు బంగారు, వజ్రాల ఆభరణాలతో ఇమిటేషన్ జ్యుయలరీని అద్దెకు ఇస్తున్నాయి. ఒక రోజు నుంచి 7 రోజుల వరకు అద్దెకు తీసుకోవచ్చు. ముందుగా కస్టమర్ ఆయా సంస్థల కేవైసీని పూర్తి చేసి సభ్యత్వం తీసుకోవాల్సి ఉంటుంది. నెల, ఏడాది వారీగా ప్యాకేజీలుంటాయి. ఈవ్స్24 వంటి కొన్ని సంస్థలైతే అద్దెతో పాటూ కస్టమర్లు కావాలంటే ఆయా నగలను నెలసరి వాయిదా పద్ధతుల్లో విక్రయిస్తాయి కూడా. ఒకసారి కస్టమర్ ఆభరణాలను వినియోగించుకొని తిరిగి ఇచ్చేశాక ఆయా నగలను శుద్ధి చేసి తిరిగి అద్దెకు రెడీగా ఉంచుతారని ఈ పరిశ్రమలోని వర్గాలు పేర్కొన్నాయి. కార్లు, బైకులు, సైకిళ్లు: దూసుకుపో.. సొంత కారైతే నెలవారీ ఈఎంఐ, నిర్వహణ, బీమా వంటివి ఉంటాయి. ఏటా కారు విలువ కూడా తగ్గిపోతుంటుంది. అదే అద్దె కారైతే నచ్చిన కారులో షికారు చేయొచ్చు. ఇదే సెల్ఫ్ డ్రైవ్ కారు పరిశ్రమకు ఊతమిస్తుందనేది రేవ్ కో–ఫౌండర్ కరణ్ జైన్ మాట. ప్రస్తుతం దేశంలో మైల్స్, జూమ్‌కార్, కార్ క్లబ్, మైకార్, ఆటో రైడర్స్, ఈకో, రెంట్ ఏ కార్, లెట్ మి డ్రైవ్, జస్ట్ రైడ్, రేవ్, ఓలర్, డ్రివెన్ వంటి సంస్థలు బైకులు, కార్లు, సైకిళ్లను అద్దెకిస్తున్నాయి. నానో నుంచి మొదలుపెడితే స్విఫ్ట్, హోండా, ఆడి, ఫోర్డ్, బెంజ్, ఫార్చునర్, డస్టర్ వాహనాలన్నీ అద్దెకు తీసుకోవచ్చు. ధరలు రోజుకు సెడన్ వాహనాలైతే రూ.2,000–2,500, ఎస్యూవీ రూ.3,000–4,000 వరకున్నాయి. 25 ఏళ్ల వయస్సు, డ్రైవింగ్ లైసెన్స్ తో పాటు ఏదైనా గుర్తింపు కార్డు ఉన్నవారే కారు అద్దెకు తీసుకోవటానికి అర్హులు. వీల్స్ట్రీట్లో బైక్స్.. గేర్, గేర్‌లెస్ ద్విచక్ర వాహనాలను మాత్రమే అద్దెకివ్వటం వీల్‌స్ట్రీట్ ప్రత్యేకత. అపాచి, షైన్, యాక్టివా, జూపిటర్, కరిజ్మా, ట్రయంప్, యమహా, హార్లే డేవిడ్సన్ , సుజుకీ హయాబుసా, నింజా, హ్యోసంగ్ వంటి 50కి పైగా సూపర్ బైక్స్ ఉన్నాయి. బైకు అద్దె రోజుకు ప్రారంభ ధర రూ.300. ప్రస్తుతం హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు, పుణె, ముంబై నగరాల్లో సేవలందిస్తున్నామని నెలకు 1000 బుకింగ్స్ అవుతున్నాయని వీల్‌స్ట్రీట్ కో–ఫౌండర్ మోక్షా శ్రీవాస్తవ చెప్పారు. సొంత వాహనాలతో పాటు డీలర్ల నుంచి, బైక్ ఓనర్ల నుంచి లీజు రూపంలో బైకులను అద్దెకు తీసుకుంటామని, ఇటీవలే ఆర్అండ్బీ పార్టనర్స్ నుంచి రూ.10 లక్షల నిధులను సమీకరించామని చెప్పారు. వస్తువులే కాదు ఉద్యోగులు కూడా.. వస్తువులే కాదు నిపుణులను కూడా అద్దెకిచ్చే సంస్థ ఒకటుంది. అదే డెవలపర్ ఆన్ రెంట్. ఇది రిటైల్, ఈ–కామర్స్, హెల్త్‌కేర్, టెలికం, రియల్ ఎస్టేట్, ట్రావెల్, అగ్రికల్చర్, ఆటోమొబైల్స్, ఎడ్యుకేషన్ వంటి అన్ని రంగాల్లో నిపుణులను అద్దెకిస్తుంది. పీహెచ్‌పీ, పైథాన్, ఆండ్రాయిడ్, ఐఓఎస్, యాంగ్లర్ జేఎస్, మీన్ స్టాక్, ఫుల్ స్టాక్ డెవలప్మెంట్, హెచ్‌టీఎంఎల్ 5, ఐఓటీ, మాజెంటో, వర్డ్ ప్రాసెస్ వంటి అన్ని రకాల టెక్నాలజీల్లోనూ వీరు సేవలందిస్తారని సంస్థ ఫౌండర్ కపిల్ మెహతా తెలిపారు. ఇప్పటివరకు జస్ట్ డయల్, శుభ్‌కార్ట్, ఆటోమోబీ, స్కిల్ స్పీడ్, పిట్టిగ్రూప్, స్లాటర్ కన్సల్టింగ్, సెంతిక్ వంటి 50కి పైగా కంపెనీలు మా నిపుణుల్ని అద్దెకు తీసుకున్నాయని పేర్కొన్నారు. అనుభవం, పని కాలం ప్రాతిపదికన చెల్లింపులుంటాయి. రూ.10,200 కోట్లకు అద్దె పరిశ్రమ.. ప్రస్తుతం దేశంలో 300 వరకు ప్రధానమైన ఆన్ లైన్ రెంటల్ కంపెనీలున్నాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా షేరింగ్ ఎకానమీ రూ.7,82,000 కోట్లుగా ఉందని.. 2025 నాటికి ఇది రూ.22,78,000 కోట్లకు చేరుతుందని ప్రైస్‌వాటర్ హౌజ్ కూపర్స్ తాజా నివేదికలో వెల్లడించింది. మన దేశంలో విభాగాల వారీగా అద్దె విపణి గణాంకాలను పరిశీలిస్తే.. ఫర్నిచర్ రూ.5,400 కోట్లు, ఎలక్ట్రానిక్ అప్లయెన్సెస్ రూ. 3,400 కోట్లు, కార్లు, బైకుల మార్కెట్ రూ. 2,040 కోట్లు, బొమ్మలు రూ.800 కోట్లుగా ఉంటుందని తెలిపింది. మొత్తంగా మన దేశంలో అద్దె విపణి రూ.10,200 కోట్లుగా ఉందని నివేదిక పేర్కొంది. నిధుల సమీకరణలోనూ జోరే.. నిధుల సమీకరణలోనూ రెంటల్ కంపెనీలు జోరుమీదున్నాయి. ముంబై కేంద్రంగా పనిచేసే ఫర్నిచర్ రెంటల్ సంస్థ ఫ్లైరోబ్ రెండు రౌండ్లలో 46 మిలియ న్ డాలర్లు సమీకరించింది. సెకోయా క్యాపిటల్, ఐడీజీ వెంచర్స్, జీఆర్ఈఈ వెంచర్స్‌తో పాటూ మరో ఇద్దరు ఇన్వెస్టర్లు ఈ పెట్టుబడి పెట్టారు. మరో ఫర్నిచర్ కంపెనీ రెన్ టొమొజో.. ఐడీజీ వెంచర్స్, యాక్సెల్ పార్టనర్స్ నుంచి గతేడాది నవంబర్‌లో 2 మిలియన్ డాలర్లను, ఫ్యూర్లెన్ కో సంస్థ లైట్‌బాక్స్ వెంచర్స్ నుంచి 6 మిలియన్ డాలర్లను సేకరించాయి. సెల్ఫ్ డ్రైవ్ కార్ పరిశ్రమలో 70 శాతం మార్కెట్‌ను సొంతం చేసుకున్న జూమ్‌కార్ ఇప్పటివరకు 45 మిలియన్ డాలర్ల నిధులను సమీకరించింది. కి.మీ. చొప్పున కాకుండా గంటల వారీగా కార్లను అద్దెకిచ్చే రేవ్ సంస్థలో మెకెన్సీ సంస్థకు చెందిన పలువురు 1.5 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టారు. అయితే అమెరికా, చైనా వంటి దేశాలతో పోలిస్తే మన దేశంలో అద్దె మార్కెట్ ఇంకా ప్రారంభ దశలోనే ఉందన్నది విశ్లేషకుల మాట. – సాక్షి పర్సనల్ ఫైనాన్స్ విభాగం -
విద్యుదాఘాతంతో గృహోపకరణాలు దగ్ధం
వరంగల్(కరీమాబాద్): వరంగల్ జిల్లా కరీమాబాద్ మండల కేంద్రంలోని ఉరుసు ప్రతాప్‌నగర్‌లో ఉంటున్న సిరిమల్ల విద్యాసాగర్ ఇంట్లో విద్యుదాఘాతంతో గృహోపకరణాలు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో సుమారు రూ.50 వేల ఆస్తి నష్టం జరిగింది. మట్టెవాడు నుంచి వచ్చిన ఫైరింజన్లు మంటలను అదుపులోకి తీసుకువచ్చాయి. -
ఇక శామ్సంగ్ స్మార్ట్‌హోమ్స్!
బెర్లిన్: దాదాపు 100 బిలియన్ డాలర్ల స్మార్ట్‌హోమ్స్ మార్కెట్‌పై దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శామ్సంగ్ దృష్టి పెట్టింది. భవిష్యత్ తరం ఇళ్లకు సంబంధించిన టెక్నాలజీని అభివృద్ధి చేసే సంస్థలతో కలసి పనిచేయనున్నట్లు కంపెనీ ప్రెసిడెంట్ బూ-కియున్ యూన్ తెలిపారు. ఇప్పటికే తమ అనుబంధ సంస్థ స్మార్ట్ టెక్నాలజీస్ ఈ దిశగా కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకోవడం ప్రారంభించినట్లు ఎలక్ట్రానిక్స్ పరికరాల అంతర్జాతీయ ట్రేడ్ షో ఐఎఫ్ఏకి హాజరైన సందర్భంగా ఆయన వివరించారు. ప్రస్తుతం భాగస్వామ్య సంస్థలతో కలిసి 1,000 పైగా పరికరాలు, 8,000 పైచిలుకు స్మార్ట్‌హోమ్ యాప్స్‌ను రూపొందించినట్లు తెలిపారు. ఈ నెల 5 నుంచి 10 వరకూ ఐఎఫ్ఏ జరగనుంది. గోడలను జరిపి బెడ్రూమ్ను డైనింగ్ రూమ్‌గా మార్చడం, ఫర్నిచర్‌ను అవసరానికి అనుగుణంగా ఆటోమేటిక్‌గా మార్చడం, పీల్చే గాలిలో క్రిములను గుర్తించి .. సంహరించడం, ఇంట్లో నివసించే వారు తీసుకోవాల్సిన భోజనం, ఔషధాలు మొదలైన వాటిని గురించి గుర్తు చేయడం వంటి టెక్నాలజీలు స్మార్ట్హోమ్స్లో భాగంగా ఉంటాయి. విద్యుత్ వినియోగం అవసరాలను గుర్తించి, తదనుగుణంగా కరెంటును ఉపయోగిస్తాయి ఈ ఇళ్లు. భవిష్యత్ తరం గృహాలు రక్షణ కల్పించడంతో పాటు మనుషుల అవసరాలకు అనుగుణంగా స్పందించగలిగేవిగా ఉంటాయని యూన్ పేర్కొన్నారు. 2018 నాటికల్లా 4.5 కోట్ల స్మార్ట్‌హోమ్స్ ఉండగలవని, ఈ విభాగం మార్కెట్ 100 బిలియన్ డాలర్ల స్థాయికి చేరగలదని ఆయన అంచనా వేశారు.