middle class familys
-
నిరుపేదలు, మధ్యతరగతిని మర్చిపోయిన కేంద్రం: రాహుల్
న్యూఢిల్లీ: నిత్యావసరాలు, కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. నిరుపేదలు, మధ్యతరగతిని మోదీ సర్కార్ మర్చిపోయిందన్నారు. పెట్టుబడిదారుల సంపద పెంచడంలో మునిగిపోయిన కేంద్రం మధ్యతరగతి కుటుంబాలను విస్మరిస్తోందన్నారు. ప్రజా సమస్యల నుంచి దృష్టి మరల్చడానికి బీజేపీ వేసే ఎత్తుల్ని సాగనివ్వమని రాహుల్ బుధవారం ఒక ట్వీట్లో పేర్కొన్నారు. ‘‘టమాటా కేజీ రూ.140, కాలీఫ్లవర్ కేజీ రూ.80, కందిపప్పు కేజీ రూ.148, గ్యాస్ సిలిండర్ రూ.1100 పై మాటే. ధరలు ఇలా పెంచుకుంటూ పోతూ పెట్టుబడుదారుల ఆస్తుల్ని పెంచుతోంది. ప్రజల నుంచి పన్నులు వసూలు చేస్తూ వారి ప్రయోజనాలనే విస్మరిస్తోంది’’ అని ట్వీట్ చేశారు. దేశంలో నిరుద్యోగ యువత పెరిగిపోతున్నారని అన్నారు. -
మండే మంచుకొండ నాన్న
తిట్టే నాన్న... దండించే నాన్న... కర్ర తీసుకొని వెంటబడే నాన్న... ఎప్పుడూ కోపంగా ఉండే నాన్న.. ఎన్నడూ దగ్గరకు పిలువని నాన్న... కాని ఆ మనసులో మంచుకొండ ఉంటుంది. ఆ గుండెల్లో ఎంతో ఆర్తి ఉంటుంది. ఆ హృదయంలో పిల్లల గురించి బెంగ ఉంటుంది. మధ్యతరగతి నాన్నను సినిమా అప్పుడప్పుడు సరిగ్గా చూపిస్తుంటుంది. ఇటీవలి సినిమా ‘మిడిల్‌క్లాస్ మెలోడీస్’ చూసిన ప్రేక్షకులు తమ తండ్రుల కబుర్లలో మునుగుతున్నారు. తెలుగు సినిమాల్లో మధ్యతరగతి నాన్నల స్పెషల్ ఇది. గుంటూరు వెళ్లి హోటల్ పెట్టాలనుకుంటాడు కొడుకు. తండ్రికి ఇంత పొడుగున పొడుచుకొచ్చింది కోపం. ‘ఏం... ఇది హోటలు కాదా... ఇక్కడ సరిగ్గా అఘోరించవచ్చుగా’ అంటాడు పల్లెటూళ్లో తాను నడుపుతున్న హోటల్ని చూపిస్తూ కొడుకును పట్టుకొని. కొడుక్కు మీసాలు వచ్చాయి. కండలు పెరిగాయి. ఏదో నిరూపించాలని అనుకుంటున్నాడు. తండ్రికి జుత్తు నెరిసింది. అనుభవం వచ్చింది. కొడుకు ఎక్కడ నష్టపోతాడో అని సంశయిస్తున్నాడు. కాని ఆ ముక్క మెత్తగా చెప్పడు. ఆ ముక్కను నేరుగా చెప్పడు. తిట్టి కొట్టబోయి అదిలించబోయి చెబుతుంటాడు. కొడుక్కు తండ్రిని చూస్తే ఎంత భయమంటే ఒక్కోసారి ఎదిరించేసేంత భయం. లోకంలో చూసేవారందరికీ ఆ తండ్రికి ముక్కు మీద కోపం అని తెలుస్తూ ఉంటుంది. కాని లోకంలో అందరికీ ఆ తండ్రి మనసులో చాలా ప్రేమ ఉందని కూడా తెలుస్తూ ఉంటుంది. కొడుక్కూ తెలుసు. కాని పైకి జరిగేదంతా నాటకమే. ఇటీవల ‘ఓటిటి’ ప్లాట్‌ఫామ్‌పై విడుదలైన ‘మిడిల్ క్లాస్ మెలొడీస్’ సినిమాలో తండ్రి ‘కొండలరావు’ పాత్రను చూసి చాలామంది తమ తండ్రుల్ని గుర్తుకు తెచ్చుకుంటున్నారు. గత కాలపు తండ్రి 1980ల ముందు వరకూ మధ్యతరగతి తండ్రులకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఒక ప్రశాంతత ఉండేది. కాని 1980ల తర్వాత తండ్రుల మీద ఒత్తిడి పెరిగింది. ఆడపిల్ల అయితే కట్నం టెన్షన్... మగపిల్లాడు అయితే ఉద్యోగం టెన్షన్. బొటాబొటి జీతంతో కుటుంబాన్ని లాగాలంటే ఎలాగో తెలియక తండ్రులు చిర్రుబుర్రుమంటూ ఉండేవారు. వారికి తమ మనసులోని ప్రేమను వ్యక్తం చేసే సమయం ఉండేది కాదు. అలాంటి మూడ్ రేర్‌గా ఉండేది. పిల్లలు ఏం చెప్పాలన్నా తల్లికే చెప్పుకునేవారు. ఈ తండ్రులు 2000 సంవత్సరం తర్వాత ముఖ్యంగా ఈ కాలంలో దాదాపుగా తగ్గిపోయారు గాని ఇవాళ ముప్పైల్లో నలభైల్లో ఉన్నవారంతా ‘మిడిల్ క్లాస్ మెలొడీస్’లోని తండ్రులను చూసినవారే. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే మీసాలు వచ్చినా తండ్రి చేతి దెబ్బలు తిన్నవారే. ‘అమ్మో.. నాన్నొచ్చాడు’ అని ఆయన గుమ్మంలో చెప్పులు విడుస్తుంటే దొడ్డి గుమ్మం నుంచి పారిపోయే కొడుకులు ఉన్నారు. ఆ కాలంలో తండ్రులు ఎక్కువగా కూతుళ్లతో అంతో ఇంతో సంభాషించేవారు. కొడుకులతో నిత్యం ఘర్షణే. ఈ ఘర్షణను ‘ఆకలి రాజ్యం’ సినిమా చూపించింది. ఆ సినిమాలో తండ్రిగా రమణమూర్తి, కొడుకుగా కమల హాసన్ చివరి వరకూ ఘర్షణలోనే ఉంటారు. వారి మధ్య సయోధ్య రాదు. చివరకు ఆ తండ్రి ఇంటి నుంచి వెళ్లిపోయిన తన కొడుకును తలుచుకుని ‘కూటి కోసం కూలి కోసం’ అని వేదనాభరితంగా పాడతాడు కాని దగ్గర పడితే గుండెలకు హత్తుకోడు. తండ్రుల కన్నీరు తెలుగు సినిమాలలో మిడిల్ క్లాస్ తండ్రులను సహజత్వానికి దగ్గరగా అతి తక్కువ సందర్భాలలో చూపిస్తుంటారు. చిరంజీవి నటించిన ‘మగ మహరాజు’లో ఉదయ భాస్కర్, ‘విజేత’లో సోమయాజులు అలాంటి తండ్రులుగా కనిపిస్తారు. రెండు సినిమాలలోనూ కొడుకుల ప్రయోజకత్వం మీద నమ్మకం లేక ఇంటి భారం తాము మోయాలనుకున్న తండ్రులే వారు. ఆ తర్వాత మధ్యతరగతిలో అతి స్నేహం ప్రదర్శించే త్రివిక్రమ్ మార్కు తండ్రులు (నువ్వే కావాలి), అతి చనువు చూపదగ్గ శ్రీను వైట్ల మార్కు తండ్రులు (ఆనందం), ఒకరి మీద ఒకరు సెటైర్లు వేసుకునే పూరి జగన్నాథ్ మార్కు తండ్రులు (ఇడియట్) వచ్చారు. కాని ‘7/జి బృందావన్ కాలనీ’ వచ్చి మిడిల్ క్లాస్ తండ్రి అలాగే భగభగలాడుతున్నాడని చూపించింది. ఆ సినిమాలోని తండ్రి చంద్రమోహన్ చిన్నపాటి ఉద్యోగం చేస్తూ కొడుకు రవికృష్ణ బాధ్యత తెలుసుకోవాలని అనుకుంటూ ఉంటాడు. ఆ కొడుక్కు ఎంతకూ బాధ్యత తెలియదు. తిట్టడమే పనిగా పెట్టుకున్న చంద్రమోహన్ చివరకు రవికృష్ణ ఉద్యోగం తెచ్చుకున్నా సరే తిడతాడు. ‘ఇంతకాలం తిట్టాను. కొట్టాను. ఇప్పుడు ఉద్యోగం రాగానే ప్రేమ చూపిస్తే మా నాన్న డబ్బు కోసం యాక్ట్ చేస్తున్నాడు అనుకుంటే...’ అని భార్య దగ్గర చెప్పి కళ్ల నీళ్లు పెట్టుకునే సన్నివేశం అందరికీ గుర్తుంటుంది. 7/జి బృందావన్ కాలనీ తండ్రి కోపానికి అర్థమే వేరులే ఇళ్లల్లో కూతుళ్లు గుండెల మీద కుంపటిలా కూచుని ఉన్నారు అని గతంలో అనేవారు గాని ఇంకా బాధ్యత తెలుసుకోని కొడుకు అసలైన కుంపటి అని మధ్యతరగతి తండ్రి భావిస్తాడు. ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ సినిమాలో వెంకటేష్ బాధ్యత తెలుసుకోడు. భార్య చనిపోయి ఇంటిని, ఉద్యోగాన్ని చూసుకుంటున్న తండ్రి గురించి ఆలోచించడు. గాలివాటుకు పోతుంటాడు. ప్రేమగా ఒక్కమాట మాట్లాడింది లేదు. కాని ఆ తండ్రి చనిపోతేనే ఆయన విలువ తెలుసుకుని విలవిలలాడతాడు. ఇక చిన్న కొడుకు ప్రయోజకుడయ్యి పెద్ద కొడుకు వృథాగా ఉంటే ఆ తండ్రి అవస్థ ఎలా ఉంటుందో ‘రఘువరన్’లో చూశాం. నీదీ నాదీ ఒకే కథ తన మర్యాద పోకుండా కొడుకు మర్యాద చెడకుండా ఇద్దరూ ఒకే ఇంట్లో ఉండటం చాలా కష్టమైన పని అని ఆ తండ్రీ కొడుకులు తెలుసుకుని మాటల్లో చేతల్లో దాగుడుమూతలు ఆడుతూ ఉంటారు. కొడుకును చిన్న మాట అనకుండా ‘మనం కష్టపడ్డాం వాణ్ణన్నా సుఖపడనీ’ అనుకునే తండ్రిని ‘కొత్త బంగారు లోకం’లో, కొడుకులు తెలుసుకున్నప్పుడు తెలుసుకుంటారులే అని హాయిగా నవ్వేస్తూ తిరిగే ‘సీతమ్మ వాకిట్లో’... తండ్రిని కూడా చూశాం. కాని మధ్యతరగతి తండ్రికి కొడుకు మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయని, వాటిని అందుకోకపోతే ఆ తండ్రి హర్ట్ అవుతాడని కనీసం వాటి కోసం కొడుకు ప్రయత్నించాల్సిందేనని ‘నీదీ నాదీ ఒకే కథ’ సినిమాలోని తండ్రి మళ్లీ మనకు చెబుతాడు. అయితే ఆ సినిమాలోని కొడుకు ‘నా స్థాయి ఇంతే. నా బతుకు ఈ మాత్రమే. దానిని నువ్వు స్వీకరించు’ అని చివరి వరకూ డిమాండ్ పెడుతూనే ఉంటాడు. ఫుల్ బనియన్,.. భుజాన టవల్ కాలం ఎంత మారినా ఒంటి మీద ఫుల్ బనియన్, భుజాన టవల్ ఉండే మధ్యతరగతి తండ్రి మారడు. ఆ తండ్రి తన ఇంటిని మర్యాదతో గౌరవంతో నడపడానికి అవస్థ పడక మానడు. పిల్లలు ఎదిగొచ్చి ఆ మధ్యతరగతి మర్యాదలను కొనసాగించాలని, నలుగురిలో ఉన్నంతలో పరువూ మర్యాదతో బతికేలా స్థిరపడాలని తాపత్రయ పడే తండ్రికి కాలదోషం ఉండదు. ఆ తండ్రి నిత్యసజీవుడు. తండ్రులకు కొడుకులు అర్థం కావడం, కొడుకులు తండ్రిని అర్థం చేసుకునే స్థాయికి ఎదగడం కొనసాగుతూనే ఉంటుంది. ఆ నడిమధ్యన కొన్ని పాత్రలు స్క్రీన్ మీద వారిని రిప్రజెంట్ చేసి తళుక్కున మెరుస్తుంటాయి. ఆ క్షణంలో మనకు మన పెరటి చెట్టు కాయ వొకటి తెంపి కొరికినట్టుగా మనసు రుచితో నిండుతుంది. ఇటీవల సినిమా తండ్రులను చూస్తే కలుగుతున్న భావన అదే. – సాక్షి ఫ్యామిలీ -
తాత గొప్పలు
కేశవాపురం గ్రామంలో రాఘవయ్య అనే వ్యక్తి ఉండేవాడు. రాఘవయ్య మధ్యతరగతి కుటుంబంలో పుట్టాడు. తనకు రాజకీయాలంటే ఇష్టం ప్రజా సేవ చేయాలని ఆరాటపడే వాడు. రాజకీయాల్లోకి వచ్చి వార్డు సభ్యునిగా గెలిచాడు. తదనంతరం సర్పంచ్‌గా పోటీ చేసి ఎన్నికైనాడు. అలా ఐదు పర్యాయాలు గ్రామ సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఉండసాగాడు. పాతిక సంవత్సరాలుగా రాఘవయ్యనే సర్పంచ్ కనుక కేశవాపూర్ అభివృద్ధికి పాటు పడసాగాడు. పాఠశాల, ఆస్పత్రి, రహదారులు, వ్యవసాయం పలు అభివృద్ధి కార్యక్రమాలతో గ్రామానికి కీర్తి తెచ్చాడు.రాఘవయ్యకు ఒక్కగానొక్క కుమారుడు సీతయ్య. సీతయ్యను అల్లారుముద్దుగా పెంచారు. సీతయ్యను రాఘవయ్య బయటకు తీసుకెళ్ళినప్పుడు ఆ బడి నేనే కట్టించాను,ఆస్పత్రి నేనే తెచ్చాను,రోడ్లు నేనే వేయించాను,మోరీలు నిర్మించాను,బావులు తవ్వించాను అంటూ సీతయ్యకు చెప్పేవాడు. సీతయ్య ప్రతిరోజూ అందరికీ ‘మా నాన్న అది కట్టించాడు, ఇది కట్టించాడు‘ అంటూ చెప్పసాగాడు. రాఘవయ్య కుమారుడు అలా చెప్తుంటే చాలా సంతోషపడ్డాడు. సీతయ్య పెద్దవాడయ్యాడు వివాహం చేశారు. సీతయ్య కూడా రాఘవయ్యతో పాటుగా గ్రామంలో తిరగసాగాడు. కానీ సీతయ్య మాత్రం ప్రతి ఒక్కరికి తండ్రి రాఘవయ్య చేసిన అభివృద్ధిని పొగుడుతూ కాలం వెళ్ళదీయసాగాడు. సీతయ్య కుమారుడు శీనయ్య. శీనయ్య పెద్దగయ్యాడు. ఒకరోజు శీనయ్య గ్రామంలోకి వెళ్ళాడు. గ్రామ పంచాయతీ భవనంలో రాఘవయ్య పంచాయతీ చెబుతున్నాడు. అక్కడే ఉన్న సీతయ్య పంచాయతీ వద్దకు వచ్చిన వేరే గ్రామ పెద్దలకు మా నాన్న అది కట్టించాడు,ఇది కట్టించాడు అంటూ చెప్పసాగాడు. ప్రతిసారీ సీతయ్య తండ్రి గూర్చి ఊతపదంలా చెప్పడం విసుగనిపించింది. ఒక్కోసారి చాలా కోపం వచ్చినా అణచుకుంటున్నారు ప్రజలు. రాఘవయ్యపై ఉన్న ప్రేమ కొద్దీ సీతయ్యను ఏమీ అనలేక పోతున్నారు. అంతలోనే అక్కడికి శీనయ్య వచ్చాడు. శీనయ్యని చూడగానే వారికి ఒక ఆలోచన వచ్చింది.శీనయ్యను దగ్గరికి పిలిచారు. శీనయ్య మీతాత ఏం చేస్తాడు అని అడిగారు. ‘మా తాత సర్పంచ్. అన్ని పనులు చేస్తాడు. గొప్పోడు‘ అని శీనయ్య అన్నాడు. ఒక్కసారిగా అందరూ తలపట్టుకున్నారు సీతయ్యతోనే వేగలేక పోతున్నామంటే, శీనయ్య తయారయ్యాడా! అనుకున్నారు. సీతయ్య మీసం తిప్పసాగాడు. వారిలో మల్లయ్య అనే వృద్ధుడు అందర్నీ నిశ్శబ్దంగా ఉండమని, అయ్యా! శీనయ్య ‘మరి మీ నాన్నగారు ఏం చేస్తారు‘ అని అడిగాడు. ‘మా తాత అది కట్టాడు, ఇది కట్టాడని తాత గొప్పలు అందరికీ చెప్తుంటాడు. మా నాయనకు అదే పని, నేను పడుకున్నా నిద్రలేపి మరీ చెబుతాడు‘ అని అన్నాడు శీనయ్య. అందరూ ఒక్కసారిగా సీతయ్య వైపు చూశారు. సీతయ్య తలదించుకున్నాడు. కిటికీలోంచి వింటున్న రాఘవయ్య కొడుకు పట్ల తాను చేసిన నిర్లక్ష్యాన్ని శీనయ్య ద్వారా వినడం బాధ కలిగించింది. సీతయ్య శీనయ్యను తీసుకుని ఇంటికి వెళ్లాడు. ప్రజలంతా మనసులో నవ్వుకుంటూ ఇకనైనా సీతయ్య మారాలంటూ మల్లయ్య తాతను అభినందిస్తూ ఇంటికి వెళ్లారు. రాఘవయ్య సీతయ్యను కూర్చోబెట్టి ఇక నుంచి గొప్పలు చెప్పడం మాని పదిమందికీ ఉపయోగపడే పనులు చేయమని చెప్పాడు. సీతయ్యలో కూడా అనతికాలంలోనే మార్పు వచ్చి గ్రామ అభివృద్ధి పనులు చేయసాగాడు. సీతయ్యలో మార్పు వచ్చినందుకు కేశవాపురం ప్రజలు కూడా ఆనందించారు -ఉండ్రాళ్ళ రాజేశం -
ధరల దడ
సామాన్యుడిని నిత్యావసర వస్తువుల ధరలు బెంబేలెత్తిస్తున్నాయి. ఏటా వచ్చే ఆదాయం పెరగకపోయినా ధరలు మాత్రం పెరుగుతున్నాయి. పండుగల సమయాల్లో ఈ ధరలు రెండింతలు అవుతుండడంతో అప్పుచేసి పండుగలు చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ధరల నియంత్రణపై ప్రభుత్వం దృష్టి సారించకపోవడాన్ని పేదలు తప్పుపడుతున్నారు. తిరుపతికి చెందిన సుబ్బమ్మ నాలుగో తరగతి ఉద్యోగిని భార్య. భర్త పారిశుద్ధ్య కార్మికుడు. ఇతని నెల వేతనం రూ.10వేలు. కటింగ్‌లు పోను నెలకు రూ.9,500 చేతికి వస్తుంది. గత ఏడాది కూడా ఇదే వేతనం. సుబ్బమ్మ కుటుంబం అద్దె ఇంట్లో నివాసం ఉంటుంది. ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పిల్లలు మున్సిపల్ స్కూల్లో ఒకరు 10వ తరగతి, ఇంకొకరు 9వ తరగతి చదువుతున్నారు. భర్త సంపాదనపైనే కుటుంబం ఆధారపడి జీవిస్తోంది. కరెంటు బిల్లుతో కలుపుకుని ఇంటి అద్దె రూ.5వేలు. బియ్యం, గ్యాస్, నిత్యావసర వస్తువులకు నెలకు మరో రూ.5వేలు ఖర్చు అవుతోంది. ఇతరత్రా ఎటువంటి అదనపు ఖర్చులు లేకుండానే సుబ్బ మ్మ భర్త సంపాదన పోను ప్రతినెలా రూ.500 అప్పు వస్తోంది. ఇది గత ఏడాది ఖర్చు వివరాలు. అదే ప్రస్తుత ఏడాది ఇంటి అద్దె రూ.500 పెరిగింది. నిత్యావసర వస్తువుల కోనుగోళ్లకు నెలకు అదనంగా రూ.వెయ్యి ఖర్చు అవుతుంది. ప్రస్తుత ఏడాదిలో ప్రతినెలా అదనంగా రూ.1,500 అప్పు వస్తోంది. ఏటా ఖర్చులు పెరుగుతున్నా సుబ్బమ్మ భర్త వేతనం పెరగలేదు. ఎటువంటి ఆదాయమూ లేదు. సుబ్బ మ్మ ఆ ఇల్లు, ఈ ఇల్లు అని పాచిపనికి వెళితే రూ.వెయ్యి వరకు వస్తుంది. ఇంట్లో ఎవరికైనా జబ్బు చేస్తే ఆస్పత్రి ఖర్చు అదనం. ఇలా సుబ్బమ్మ కుటుంబానికి ఏటా ఖర్చులు పెరుగుతున్నాయి. ఆదాయం మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉంది. ఇది ఒక్క సుబ్బమ్మ కుటుంబానికే కాదు జిల్లా వ్యాప్తంగా వేలాది కుటుంబాలు ఎదుర్కొంటున్న పరిస్థితి.. ఏటా పెరుగుతున్న ధరలు ఏటా పండుగలు వచ్చాయంటే సామాన్యుడి గుండెల్లో గుబులు రేగుతోంది. ఆదాయం పెరగకపోయినా నిత్యావసర వస్తువుల ధరలు మాత్రం ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉన్నాయి. కూరగాయల ధరలు ఒక్కటే కాదు ప్రతి వస్తువు ధర ఆకాశాన్నంటుతోంది. జీఎస్టీ అమలైన రోజు నుంచి వ్యాపారులు అనేక మంది ధరలు పెంచేశారు. బిల్లు వేయకపోయినా జీఎస్టీ అంటూ వినియోగదారుల నుంచి భారీ ఎత్తున వసూలు చేస్తున్నారు. బియ్యం, పప్పులు, నూనె ఇతర వస్తువుల ధరలను ç2005 నుంచి పరిశీలిస్తే రెండో రకం బియ్యం రూ.8 నుంచి రూ.45 చేరుకుంది. పప్పులు విషయానికి వస్తే రూ.30 నుంచి రూ.80 చేరాయి. గోధుమ పిండి కిలో రూ.20 నుంచి 50కి చేరింది. ఇలా ప్రతి వస్తువు ధర నాలుగు రెట్లు పెరిగింది. నిత్యావసర వస్తువుల ధరలు ఇలా ఉంటే పండ్లు, పూల ధరలు కూడా పండుగ రోజు ఆకాశాన్నంటుతున్నాయి. మామూలు రోజుల్లో అయితే మూర పూలు రూ.10 ఉంటే, పండుగ రోజుల్లో రూ.25 అమ్ముతున్నారు. పండ్లు విషయానికి వస్తే సామాన్యుడు పండు కొని తినే పరిస్థితి లేదు. ఆపిల్ పండ్లు కిలో రూ.100, అరటిపండ్లు డజను రూ.50 చొప్పున విక్రయిస్తున్నారు. మధ్య తరగతి వారు కొందరు, ధనవంతులు మాత్రమే పం డ్లు కొనుగోలు చేస్తున్నారు. ధరల నియంత్రణపై ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టకపోవడంపై సామాన్య, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
‘నోట్ల’ కష్టాలకు నెల..
రూ.500, 1,000 నోట్లను రద్దు చేస్తూ ప్రధాని మోదీ నవంబర్ 8న అకస్మాత్తుగా ప్రక టన చేశారు. ఆ రోజు అర్ధరాత్రి తర్వాత ఆ నోట్లేవీ చెల్లబోవంటూ షాకిచ్చారు. ఈ నిర్ణ యం అమల్లోకి వచ్చి నెల రోజులు పూర్తయింది. నల్లధనం వెలికితీత, నకిలీ కరెన్సీ కట్టడి కోసమంటూ నోట్లను రద్దు చేసినా.. సాధారణ ప్రజలు ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బ్యాంకులు, ఏటీఎంల ఎదుట గంటలకొద్ది క్యూలైన్లు. ‘నోట్ల’ సమస్య వల్ల దేశవ్యాప్తం గా వంద మందికిపైగానే ప్రాణాలు కోల్పోయినట్లు అంచనా. నవంబర్ 8 500, 1,000 నోట్లను రద్దు చేస్తున్నటు ప్రధాని ప్రకటన. ఆ రోజు అర్ధరాత్రి నుంచే ఆ నోట్లు చెల్లబోవని వెల్లడి. డిసెంబర్ 30 వరకు పాత నోట్లు మార్చుకోవడానికి అవకాశం. ‘నోట్ల’లెక్కలు తేల్చడానికి మరుసటి రోజున బ్యాంకులకు సెలవు, రెండు రోజులపాటు ఏటీఎంల మూసివేత ప్రకటన. పెట్రోల్ బంకులు, ఎల్పీజీ, ఆసుపత్రులు, మెడికల్ షాప్‌లు, విమాన- రైల్వే టిక్కెట్లు, శ్మశాన వాటికలు, ప్రభుత్వ సేవలకు మూడు రోజులపాటు (11వ తేదీ వరకు) పాత నోట్లతో చెల్లింపులకు అవకాశం. బ్యాంకులు, పోస్టాఫీసుల ద్వారా ఒక్కొక్కరు రోజుకు రూ.4 వేలు పాత నోట్ల మార్పిడికి అవకాశం. ఏటీఎంలలో రోజుకు రూ.2 వేలు, బ్యాంకుల్లో రోజుకు రూ.10 వేలు విత్‌డ్రా పరిమితులు. మొత్తంగా వారానికి రూ.20 వేలే తీసుకోగలిగేలా ఆంక్షలు. చెక్కులు, డీడీలు, క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా జరిగే లావాదేవీలు, ఆన్లైన్ లావాదేవీలపై పరిమితి విధించలేదు. నవంబర్ 9 బ్యాంకులు,ఏటీఎంలు పనిచేయలేదు. ప్రజల్లో ఆందోళన. బ్యాం కుల్లో నగదు మార్పిడి కోసం ఏదైనా గుర్తింపుకార్డు ప్రతి సమ ర్పించాలంటూ నిబంధనలు. 11వ తేదీ అర్ధరాత్రి వరకూ టోల్ వసూలు నిలిపివేత. రూ.2.5 లక్షలు దాటిన, లెక్కలు చూపని డిపాజిట్లపై పన్ను, జరిమానా వసూలు చేస్తామని ప్రకటన. నవంబర్ 10 కష్టాలు షురూ. డిపాజిట్లు, నగదు మార్పిడి కోసం బ్యాంకులు, పోస్టాఫీసుల వద్ద కిలోమీటర్ల కొద్దీ క్యూలైన్లు. కొత్త రూ.2 వేల నోట్లు జనంలోకి వచ్చాయి. ఏటీఎంల మూత. నవంబర్ 11 తొలిసారిగా తెరుచుకున్న ఏటీఎంలు. భారీ క్యూలైన్లు. కొత్త రూ.2 వేల నోట్లకు అనుగుణంగా ఏటీఎంలు లేకపోవడంతో.. అన్నీ వంద నోట్లే నింపిన అధికారులు. కొంత సేపటికే ఖాళీ. ప్రజలకు ఇబ్బందులు. పలు రంగాల్లో పాత నోట్ల వినియోగానికి ఇచ్చిన అవకాశాన్ని, టోల్ వసూలు నిలిపివేతను నవంబర్ 14 అర్ధరాత్రి వరకూ పొడిగిస్తూ నిర్ణయం. నవంబర్ 12 బ్యాంకులు, పోస్టాఫీసులు, ఏటీఎంల వద్ద జనం అవస్థలు. నల్లధనం నియంత్రణకు మరిన్ని చర్యలుంటాయన్న ప్రధాని. నవంబర్ 13 ఆదివారం పనిచేసిన బ్యాంకులు. పెరిగిన క్యూలైన్లు. ఏటీఎం, బ్యాంకుల్లో నగదు లేకపోవడంతో జనంలో ఆగ్రహావేశాలు. నగదు మార్పిడి పరిమితి రూ.4,500కు, ఏటీఎంల నుంచి విత్‌డ్రా పరిమితి రూ.2,500కు, బ్యాంకుల్లో రోజుకు రూ.10వేల విత్‌డ్రా పరిమితిని ఎత్తివేస్తూ... వారానికి విత్‌డ్రా పరిమితి రూ.24,000కు పెంపు. కొత్త రూ.500 నోట్లు మార్కెట్లోకి. నవంబర్ 14 పెట్రోల్ బంకులు, ప్రభుత్వ సేవలు సహా పలు రంగాల్లో పాత నోట్లతో చెల్లింపులను నవంబర్ 24 వరకు పొడిగిస్తూ నిర్ణయం. కరెంట్ ఖాతాల నుంచి విత్‌డ్రా పరిమితి వారానికి రూ.50 వేలకు పెంపు. గురునానక్ జయంతి సందర్భంగా మూసి ఉన్న బ్యాంకులు. ఏటీఎంల వద్ద క్యూలైన్లు. పలు చోట్ల ఆందోళనలు వ్యక్తం చేసిన ప్రజలు ఠి ఏటీఎం ట్రాన్సాక్షన్ చార్జీలను డిసెంబర్ 30వ తేదీ వరకూ ఎత్తివేస్తూ నిర్ణయం. నవంబర్ 15 కొనసాగిన క్యూలైన్లు. తొలి వారంలో ఏకంగా రూ.1,14,139 కోట్లు డిపాజిట్లు వచ్చినట్లు ఎస్బీఐ ప్రకటన. నవంబర్ 17 నగదుమార్పిడి పరిమితి రూ.2,000కు కుదింపు. వివాహాల కోసం రూ.2.5 లక్షల వరకు విత్‌డ్రా చేసుకోవచ్చంటూ ప్రకటన. రైతులకు విత్‌డ్రా పరిమితి వారానికి రూ.50 వేలకు పెంపు. టోల్ వసూళ్ల నిలిపివేతను నవంబర్ 24 వరకు పొడిగిస్తూ నిర్ణయం. ఎంపిక చేసిన పెట్రోల్ బంకుల్లో డెబిట్ కార్డుల ద్వారా రూ.2 వేల వరకు తీసుకునే అవకాశం. ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేటును ఒకశాతం తగ్గించిన పలు బ్యాంకులు నవంబర్ 18 ‘నోట్ల రద్దు’తో 55 మంది మరణించారంటూ పార్లమెంటులో విపక్షాల గొడవ. ఢిల్లీలో ఆందోళనలు. నవంబర్ 22 బ్యాంకులు, పోస్టాఫీసుల్లో పాత నోట్ల మార్పిడి నిలిపివేత. డిపాజిట్లకే అవకాశం. టోల్ వసూళ్ల నిలిపివేతను డిసెంబర్ 2 అర్ధరాత్రి వరకూ పొడిగిస్తూ ప్రకటన. పలు రంగాల్లో పాత నోట్లతో చెల్లింపులు డిసెంబర్ 15 వరకు పొడిగింపు. నవంబర్ 25 రిజర్వుబ్యాంకు శాఖల్లో మాత్రం నోట్ల మార్పిడి కొనసాగిస్తూ ప్రకటన. అటు జన్‌ధన్ ఖాతాల్లోకి కేవలం 14 రోజుల్లో రూ.27,200 కోట్లు డిపాజిట్ అయినట్లు 26న కేంద్రం వెల్లడి నవంబర్ 28 మూడు వారాల్లో రూ.8.45 లక్షల కోట్లు పాత నోట్లు డిపాజిట్ అరుునట్లు ఆర్బీఐ ప్రకటన. కొనసాగిన క్యూలైన్లు. నవంబర్ 30 జన్‌ధన్ ఖాతాల్లోంచి నెలకు రూ.10 వేల విత్‌డ్రా పరిమితి విధించిన ఆర్బీఐ. డిసెంబర్ 1 తార స్థాయికి కష్టాలు. వేతనాలు తీసుకోవడానికి ఉద్యోగులకు ఇబ్బందులు. ఒక్కొక్కరికి రూ.2 వేల నుంచి రూ.5 వేల వరకే ఇచ్చిన బ్యాంకులు. పెట్రోల్ బంకులు, విమాన టికెట్లు వంటి వాటిలో పాత నోట్ల చెల్లుబాటు గడువును 2వ తేదీ అర్ధరాత్రి వరకు కుదింపు (తొలుత డిసెంబర్ 15 వరకు గడువిచ్చారు). డిసెంబర్ 6 నోట్ల రద్దు’ తర్వాత రూ.2 వేల కోట్ల లెక్కల్లో చూపని ధనాన్ని వెల్లడించినట్లు ఆదాయ పన్ను శాఖ ప్రకటన. తమ దాడుల్లో రూ. 130 కోట్ల విలువైన నగదు, ఆభరణాలు గుర్తించినట్లు వెల్లడి. డిసెంబర్ 7 బ్యాంకుల్లోకి రూ.11.55 లక్షల కోట్లు డిపాజిట్ అయినట్లు ప్రకటించిన రిజర్వు బ్యాంకు. డిసెంబర్ 8 ‘నోట్ల’ ఇబ్బందులను తట్టుకునేందుకు నగదు రహిత లావా దేవీలను ప్రోత్సహిస్తూ పలు ఉపశమన చర్యల ప్రకటన