
చెక్కులను పంపిణీ చేస్తున్న ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ
ఆల్విన్‌కాలనీ/భాగ్యనగర్‌కాలనీ: పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని వివేకానందనగర్, ఆల్విన్ న్‌కాలనీ, హైదర్‌నగర్, కూకట్‌పల్లి డివిజన్ల పరిధిలో పలువురు లబ్దిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం ద్వారా లబ్దిపొందిన 14 మందికి చెక్కులను శనివారం పంపిణీ చేశారు. ఈ సందర్బంగా గాంధీ మాట్లాడుతూ..
దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని సంక్షేమ పథకాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తూ సంక్షేమ ప్రభుత్వంగా పేరు గాంచిందన్నారు. సంక్షేమ పథకాలకు ఏ లోటూ రాకుండా ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తూ పేదలకు ఎంతో ఆసరాగా నిలుస్తుందన్నారు. పథకాల అమలులో తెలంగాణ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని తెలిపారు.
అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వీఆర్‌ఓ యాదగిరి, మాజీ కార్పొరేటర్ రంగారావు, చందానగర్ అధ్యక్షుడు రఘునాథ్‌రెడ్డి, మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడ ఎర్రగుడ్ల శ్రీనివాస్‌యాదవ్, హఫీజ్‌పేట్ అధ్యక్షుడు గౌతమ్‌గౌడ్, నాయకులు కాశీనాద్ యాదవ్, యాదగిరి గౌడ్, వెంకటేష్గౌడ్, దాత్రి గౌడ్, సత్యనారాయణ రాజు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment