
సాక్షి, డెహ్రాడూన్: ఆపన్నులకు సాయం చేయడంలో ఒక్కొక్కరిది ఒక్కో మార్గం. పేదలకు సేవ చేసే సదాశయంతో ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీ జిల్లాలో బ్యాంక్ ఆఫ్ హ్యాపీనెస్ ఏర్పాటైంది. పేదలు, అణగారినవర్గాలకు చేయూత అందించేందుకు ఈ బ్యాంక్‌ను ఏర్పాటు చేశానని, ఎవరైనా తమ పాత, కొత్త బట్టలను డొనేట్ చేయవచ్చని, బ్యాంక్ కన్వీనర్ ప్రవీణ్ భట్ చెప్పారు. కార్మికులు, కాయకష్టం చేసుకునే పేద వర్గాలు సంతోషంగా జీవించేందుకు సహాయం చేసే ఉద్దేశంతోనే బ్యాంకును ఏర్పాటు చేశామని భట్ అన్నారు.
తనకు పలు రాష్ట్రాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతున్నారని చెప్పారు. డెహ్రాడూన్, ఢిల్లీ వంటి ప్రాంతాల నుంచీ విరాళాలు సమకూరుతున్నాయని చెప్పారు.