రంజీ ట్రోఫీ క్వార్టర్స్‌లో హైదరాబాద్‌ | Ranji Trophy: Delhi eliminated after losing to Saurashtra by 5 runs | Sakshi

రంజీ ట్రోఫీ క్వార్టర్స్‌లో హైదరాబాద్‌

Published Sun, Dec 11 2016 2:02 AM | Last Updated on Mon, Sep 4 2017 10:23 PM

బ్యాట్స్‌మెన్‌ బద్రీనాథ్‌ (84 బంతుల్లో 14 నాటౌట్‌), కొల్లా సుమంత్‌ (59 బంతుల్లో 10 నాటౌట్‌) సంయమనంతో ఆడటంతో...

లక్నో: బ్యాట్స్‌మెన్‌ బద్రీనాథ్‌ (84 బంతుల్లో 14 నాటౌట్‌), కొల్లా సుమంత్‌ (59 బంతుల్లో 10 నాటౌట్‌) సంయమనంతో ఆడటంతో... ఆంధ్రతో జరిగిన రంజీ ట్రోఫీ గ్రూప్‌ ‘సి’ చివరి లీగ్‌ మ్యాచ్‌ను హైదరాబాద్‌ ‘డ్రా’ చేసుకుంది. 219 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్‌ రెండో ఇన్నింగ్స్‌లో 47 ఓవర్లలో 5 వికెట్లకు 56 పరుగులు చేసింది. పొగమంచు, వెలుతురులేమి కారణంగా చివరిరోజు లంచ్‌ తర్వాతే ఆట మొదలైంది.

మ్యాచ్‌ ‘డ్రా’గా ముగిసినా... తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం దక్కినందుకు ఆంధ్రకు 3 పాయింట్లు లభించగా... హైదరాబాద్‌ ఖాతాలో ఒక పాయింట్‌ చేరింది. లీగ్‌ దశ మ్యాచ్‌లు ముగిశాక హైదరాబాద్‌ (నాలుగు విజయాలు) 31 పాయింట్లతో గ్రూప్‌ ‘సి’ టాపర్‌గా నిలిచి క్వార్టర్‌ ఫైనల్‌కు అర్హత పొందింది. హరియాణా కూడా 31 పాయింట్లతో (మూడు విజయాలు) రెండో స్థానంలో నిలిచి ఈ గ్రూప్‌ నుంచి క్వార్టర్‌ ఫైనల్‌కు చేరింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement