బద్రీనాథ్ శతకం
వల్సాడ్ (గుజరాత్): ఛత్తీస్‌గఢ్‌తో జరుగుతున్న రంజీ ట్రోఫీ గ్రూప్ ‘సి’ మ్యాచ్‌లో హైదరాబాద్ కెప్టెన్ బద్రీనాథ్ (254 బంతుల్లో 134; 20 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీతో కదంతొక్కాడు. బావనక సందీప్ (135 బంతుల్లో 73 బ్యాటింగ్; 12 ఫోర్లు) అజేయ అర్ధసెంచరీ సాధించాడు. దీంతో ఇక్కడి సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టేడియంలో సోమవారం మొదలైన ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ ఇన్నింగ్‌స నిలకడగా సాగుతోంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి హైదరాబాద్ 88 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 267 పరుగులు చేసింది. అంతకుముందు టాస్ గెలిచిన ఛత్తీస్‌గఢ్ ఫీల్డింగ్ ఎంచుకోగా... హైదరాబాద్ ఇన్నింగ్‌సను తన్మయ్ అగర్వాల్, అక్షత్ రెడ్డి ప్రారంభించారు. రెండో ఓవర్లోనే అక్షత్ (1) అవుట్ కావడంతో హైదరాబాద్‌కు ఎదురుదెబ్బ తగిలింది.
జట్టు స్కోరు 2 పరుగుల వద్ద అతను పంకజ్ రావు బౌలింగ్‌లో నిష్క్రమించాడు. అనంతరం తన్మయ్‌కి జత కలిసిన బద్రీనాథ్ జట్టు స్కోరును నడిపించాడు. ఇద్దరు కుదురుగా ఆడటంతో మరో వికెట్ పడకుండా హైదరాబాద్ స్కోరు 100 పరుగులకు చేరింది. అనంతరం కాసేపటికి తన్మయ్ (39) కాంత్ సింగ్ బౌలింగ్‌లో మనోజ్‌కు క్యాచ్ ఇచ్చి రెండో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. దీంతో 120 పరుగుల రెండో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. తర్వాత సందీప్ అండతో బద్రీనాథ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ భాగస్వామ్యం కూడా సెంచరీ మార్కును దాటింది. మూడో వికెట్‌కు 122 పరుగులు జోడించాక బద్రీనాథ్... అభిమన్యు చౌహాన్ బౌలింగ్‌లో నిష్క్రమించాడు. అదే ఓవర్లో బెంజమిన్ థామస్ (0) డకౌటయ్యాడు. తర్వాత మెహదీ హసన్ (10 బ్యాటింగ్), సందీప్ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు.
స్కోరు వివరాలు
హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్: తన్మయ్ అగర్వాల్ (సి) మనోజ్ (బి) కాంత్ సింగ్ 39; అక్షత్ రెడ్డి (సి) మనోజ్ (బి) పంకజ్ రావు 1; బద్రీనాథ్ (సి) మనోజ్ (బి) అభిమన్యు చౌహాన్ 134; బి. సందీప్ బ్యాటింగ్ 73; బెంజమిన్ థామస్ (సి) మనోజ్ (బి) అభిమన్యు చౌహాన్ 0; మెహదీ హసన్ బ్యాటింగ్ 10; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (88 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి) 267.
వికెట్ల పతనం: 1-2, 2-122, 3-244, 4-244
బౌలింగ్: కాంత్ సింగ్ 18-7-30-1, పంకజ్ రావు 22-3-74-1, అభిమన్యు చౌహాన్ 10-3-22-2, అభిషేక్ 16-3-64-0, సుమిత్ రురుుకర్ 20-4-66-0, సాహిల్ గుప్తా 2-0-7-0
హైదరాబాద్ సారథి బద్రీనాథ్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో 10 వేల పరుగుల మైలురాయిని అధిగమించాడు. తన వ్యక్తిగత స్కోరు 89 పరుగుల వద్ద ఈ ఘనత సాధించాడు.