
డెహ్రాడూన్ : రాఫ్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆయన కుటుంబ సభ్యులు ఆదివారం ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్, బద్రీనాథ్ ఆలయాలను దర్శించారు. ఉత్తరాఖండ్ గవర్నర్ కేకే పాల్, ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్‌లు కూడా రాష్ట్రపతితో కలిసి ఆలయాలను దర్శించారు. కేదార్‌నాథ్‌లో పరమశివుడికి దర్శించుకునేందుకు వచ్చిన రాష్ట్రపతికి ఆలయ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ అధికారి సంప్రదాయల ప్రకారం స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం చేసుకున్న ఆరాష్ట్రతి రామ్‌నాథ్ కోవింగ్ ప్రత్యేకంగా రుద్రాభిషేకం చేయించుకున్నారు. అనంతరం బద్రీనాథ్ వెళ్లిన ఆయన శ్రీమన్నారాయణుడిని దర్శించికుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా హిమాలయాల్లో ప్రత్యేకంగా లభించి ఒక గంధపు మొక్కను రాష్ట్రపతి భవన్‌లో నాటేందుకు కోవింద్ సతీమణి ప్రత్యేకంగా తీసుకున్నారు.