రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్) చైర్మన్ ముఖేష్ అంబానీ గురువారం బద్రీనారాయణ ఆలయంలో ప్రార్థనలు చేసేందుకు ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్ ధామ్‌కు చేరుకున్నారు. ఈ పర్యటనలో అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ కాబోయే భార్య రాధికా మర్చంట్‌తో కూడా ఉండటం విశేషం. అలాగే RIL డైరెక్టర్ మనోజ్ మోడీ ఈసారి ముఖేష్ అంబానీకి తోడుగా ఉన్నారు. బద్రీనాథ్ కేదార్‌నాథ్ ఆలయ కమిటీ (బీకేటీసీ), సీఈవో బీడీ సింగ్, ఉపాధ్యక్షుడు కిషోర్ పవార్ వీరికి స్వాగతం పలికారు. అనంతరం కేదార్‌నాథ్‌ను కూడా సందర్శించారు అంబానీ.
ఈ సందర్బంగా బద్రీనాథ్ కేదార్‌నాథ్ ఆలయ కమిటీ (BKTC)కి అంబానీ 5 కోట్ల రూపాయలli విరాళంగా ఇచ్చారు. కాగా అంబానీ కుటుంబం దేవాలయాలు పవిత్ర పుణ్యక్షేత్రాలలో నిత్యం సందర్శిస్తుంటారు. గతంలో కూడా ఈ కమిటీకి విరాళాన్ని ప్రకటించారు అంబానీ. అంతేకాదు 2019లో బద్రీనాథ్-కేదార్‌నాథ్ ఆలయ కమిటీ సభ్యుడిగా అనంత్ అంబానీ నియమితులయ్యారు.
అలాగే అనంత్ అంబానీ, రాధిక వచ్చే ఏడాది పెళ్లి పీటలెక్కనున్నారు. చిన్ననాటి స్నేహితుడితో నిశ్చితార్థం జరిగినప్పటి నుంచి ఆమె తన అత్తమామలతో కలిసి అనేక పవిత్ర పుణ్యక్షేత్రాలను సందర్శించడం, తన సింప్లిసిటీతో ఫ్యాన్స్ ఆకట్టుకోవడం తెలిసిందే.
ముఖ్యంగా ఈ ఏడాది ప్రారంభంలో, అంబానీ తన పెద్ద కుమారుడు ఆకాష్ అంబానీ, కోడలు శ్లోకా మెహతా , మనవడు పృథ్వీ అంబానీతో కలిసి ముంబైలోని సిద్ధివినాయక ఆలయాన్ని సందర్శించారు. గతేడాది అక్టోబర్‌లో అంబానీ బద్రీనాథ్ ధామ్, కేదార్‌నాథ్ ధామ్‌లను సందర్శించారు. అలాగే కేరళలోని గురువాయూర్ ఆలయాన్ని సందర్శించి, ఆలయ 'అన్నదానం' నిధికి 1.51 కోట్ల రూపాయలను విరాళంగా ఇచ్చారు. దీంతోపాటు ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ తిరుపతి ఆలయాన్ని సందర్శించినప్పుడు దాదాపు రూ.1.50 కోట్లు విరాళంగా ఇచ్చారు. గతేడాది సెప్టెంబర్‌లో అంబానీ రాజస్థాన్‌లోని శ్రీనాథ్‌జీ ఆలయాన్ని సందర్శించిన సంగతి తెలిసిందే
#WATCH | Reliance Industries Chairman, Mukesh Ambani offered prayers at Badrinath Dham in Uttarakhand. pic.twitter.com/fUUvdljevr
— ANI (@ANI) October 12, 2023
Comments
Please login to add a commentAdd a comment