
బద్రీనాథ్‌కు లక్షల్లో భక్తులు
డెహ్రాడూన్ : చార్‌ధామ్ యాత్రలో ఒకటైన బద్రీనాథ్ క్షేత్రానికి ఈ ఏడాది భక్తులు పోటెత్తారు. గతంలో ఎన్నడూ లేనంతగా ఈ ఏడాది ఆలయం తెరిచిన మే 6 నుంచి ఇప్పటివరకూ.. 7.5 లక్షల మంది బద్రీనారాయణుడిని దర్శించుకున్నట్లు ఆలయ ఎగ్జిక్యూటివ్ అధికారి బీడీ సింగ్ చెప్పారు. భక్తులు కానుకల రూపంలో హుండీలో వేసిన మొత్తం రూ.11.50 కోట్లని ఆయన చెప్పారు.
2013లో వరదల తరువాత బద్రీనీనాథ్‌కు ఇంత పెద్ద సంఖ్యలు భక్తులు హాజరుకావడం ఇదే మొదటిసారని సింగ్ ప్రకటించారు. 2013లో అత్యధికంగా 9.25 లక్షల మంది భక్తులు హాజరయ్యారని.. ఆ తరువాత వరదలు ముంచెత్తడంతో భక్తుల రాక తగ్గిందని సింగ్ తెలిపారు. చెప్పారు. ఆలయాన్ని మూసివేసే సమయానికి మరో లక్ష మంది భక్తులు బ్రదీనారాయణుడిని దర్శించుకుంటారనే ఆశాభావాన్ని సింగ్‌వ్యక్తం చేశారు.