కాలినడకన కేదార్నాథ్ చేరుకున్న రాహుల్
న్యూఢిల్లీ: ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కాలనడకన ప్రసిద్ధ కేదార్నాథ్ ఆలయానికి చేరుకున్నారు. రాహుల్ 16 కిలో మీటర్ల మేర నడిచివెళ్లారు. కేదార్నాథ్ ఆలయంలో రాహుల్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. 2013లో అకాల వర్షాలు, వరదల వల్ల మరణించిన చార్ధామ్ యాత్రికుల ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించినట్టు రాహుల్ చెప్పారు. అంతకుమించి దేవుణ్ని ఏమీ కోరుకోలేదని అన్నారు.
2013లో వరదల సమయంలో కేదార్నాథ్లో పర్యటించి విపత్తును కళ్లారా చూశానని రాహుల్ గుర్తుచేసుకున్నారు. మృతుల ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించడానికే ఇక్కడికి వచ్చానని చెప్పారు. హెలికాప్టర్లో వస్తే వారిని అగౌరవపరిచినట్టు అవుతుందని, అందుకుని వారి ఇక్కడి వచ్చిన కాలిబాటలోనే తాను వచ్చానని రాహుల్ తెలిపారు. కాగా 36 సంవత్సరాల క్రితం 1979లో రాహుల్ నాయనమ్మ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ కూడా 40 కిలో మీటర్లు కాలినడకన వెళ్లి బద్రీనాథ్ను దర్శించుకున్నారని చెప్పారు.