Warangal Doctor Died Due To Heart Attack In Badrinath Yatra - Sakshi
Sakshi News home page

బద్రినాథ్‌యాత్రలో వరంగల్‌ వైద్యురాలు మృతి

Oct 16 2022 2:32 PM | Updated on Oct 16 2022 6:35 PM

Warangal Doctor Died In Badrinath Yatra - Sakshi

డాక్టర్‌ ఉషారాణి (ఫైల్‌)

సాక్షి, వరంగల్‌: బద్రినాథ్‌ యాత్రకు వెళ్లిన ఓ వైద్యురాలు గుండెపోటుతో మృతి చెందింది. ఈ ఘటన శనివారం ఉదయం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. వరంగల్‌ జిల్లా నర్సంపేట పట్టణానికి చెందిన చామర్తి ఉషారాణి(52), భర్త డాక్టర్‌ నందకిషోర్‌లు శ్రీనివాస నర్సింగ్‌హోం నిర్వహిస్తున్నారు. ఓ వైపు డాక్టర్‌గా పనిచేస్తూనే మరోవైపు సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. దంపతులిద్దరు 12 యాత్రల దర్శనంలో భాగంగా ఈ నెల 9వ తేదీన వెళ్లారు. శనివారం ఉదయం బద్రినాథ్‌లో ఉషారాణికి గుండెపోటు రావడంతో అక్కడికక్కడే మృతిచెందారు. ఆమె మృతదేహం రాత్రి నర్సంపేటకు రానున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి డాక్టర్‌ ఉషారాణి కుటుంబ సభ్యులతో ఫొన్‌లో మాట్లాడి ప్రగాడ సంతాపం వ్యక్తం చేశారు.  శ్రీనివాస నర్సింగ్‌హోంలో ప్రత్యేకంగా ఉషారాణి చిత్రపటాన్ని ఏర్పాటు చేసి పలువురు పూలమాల వేసి నివాళులర్పించారు. నివాళులర్పించిన వారిలో డాక్టర్‌ మనోజ్‌లాల్, డాక్టర్‌ భారతి, గుడిపూడి అరుణ, నల్ల భారతి, చిలువేరు రజినిభారతి, పెండెం రాజేశ్వరి, గుర్రపు అరుణ, వాసం కరుణ తదితరులు ఉన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement