భారీ పేలుళ్లు.. చార్‌ధామ్ యాత్రకు ఆటంకం
కాంక్రా :
ఉత్తరాఖండ్‌లో ఇండియన్ గ్యాస్కు చెందిన ఓ లారీ ప్రమాదానికి గురైంది. గ్యాస్ సిలిండర్ల లోడ్తో వెళుతున్న లారీలో పేలుడు చోటుచేసుకుంది. దీంతో అందులోని మరిన్ని సిలిండర్లకు మంటలు వ్యాపించి భారీ పేలుళ్లు చోటు చేసుకున్నాయి. ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది. ఈ సంఘటన ఎన్‌హెచ్ 58పై రిషికేష్- బద్రినాథ్ మధ్యలో కాంక్రాలోని ఘాట్ రోడ్డుపై చోటు చేసుకుంది.
సిలిండర్ల పేలుళ్లతో లారీ పూర్తిగా దగ్ధమైంది. దీంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోవడంతో చార్‌ధామ్ యాత్రకు ఆటంకం ఏర్పడింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.