అనంతపురం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది.
జోసెఫ్ నగర్: అనంతపురం నగరంలో విషాదం చోటుచేసుకుంది. తన కుటుంబ సభ్యులు ఛార్‌ధామ్ యాత్ర వరదల్లో చిక్కుకున్నారని తెలుసుకున్న ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ సంఘటన అనంతపురం పట్టణం లోని జోసెఫ్ నగర్‌లో శుక్రవారం రాత్రి జరిగింది.
వివరాలు.. కాలనీకి చెందిన కుళ్లాయప్ప (68) కుటుంబానికి చెందిన ఏడుగురు సభ్యులు ఈ నెల 15న ఛార్ ధామ్ యాత్రకు వెళ్లారు. రెండు రోజుల నుంచి ఉత్తరాఖండ్‌లో భారీగా వరదలు పోటెత్తడంతో తాము అందులో చిక్కుకున్నామని.. శుక్రవారం సాయంత్రం ఇంట్లో ఉన్న తండ్రి కుళ్లాయప్పకు తెలియజేశారు. దీంతో.. ఆవేదన చెందిన కుళ్లాయప్ప గుండె ఆగి చనిపోయాడు.