kullayappa
-
ఐదేళ్ల ప్రేమ.. పెళ్లి తర్వాత అందంగా లేదని.. దారుణంగా
కళ్యాణదుర్గం (అనంతపురం): అందంగా లేదని కట్టుకున్న ఇల్లాలిని హతమార్చిన ఘటన కళ్యాణదుర్గంలో కలకలం రేపింది. పోలీసులు తెలిపిన మేరకు... కళ్యాణదుర్గంలోని బ్రహ్మయ్య గుడి సమీపంలో నివాసముంటున్న కుళ్లాయప్ప బేల్దారి పని చేసుకునేవాడు. తాను నివాసముంటున్న ప్రాంతానికి చెందిన అపర్ణ (27)ను ఆరేళ్ల క్రితం పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లికి ముందు ఐదేళ్లు వీరిద్దరూ ప్రేమించుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు సంతానం. కొంత కాలంగా కుళ్లాయప్ప మద్యానికి బానిసయ్యాడు. మద్యం మత్తులో రోజూ భార్యతో గొడవపడేవాడు. అందంగా లేవని వేధింపులకు గురి చేసేవాడు. ఈ క్రమంలోనే విషయాన్ని తన కుటుంబసభ్యులకు తెలిపి విడాకులు తీసుకునేందుకు అపర్ణ సిద్ధమైంది. శుక్రవారం రాత్రి కుళ్లాయప్ప మద్యం మత్తులో ఇంటికి చేరుకుని రోజువారీగానే భార్యతో గొడవ పెట్టుకుని కత్తితో అపర్ణ పొట్టలో బలంగా పొడిచాడు. రక్తపు మడుగులో పడి ఉన్న భార్యను వదిలేసి అక్కడి నుంచి పారిపోయాడు. విషయాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే అపర్ణను కళ్యాణదుర్గం ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సూచన మేరకు.. అనంతపురం సర్వజనాస్పత్రికి తరలించారు. చికిత్సకు స్పందించక శనివారం ఉదయం ఆమె మృతి చెందింది. హతురాలి తల్లి నాగమ్మ ఫిర్యాదు మేరకు పట్టణ సీఐ తేజమూర్తి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (రూ.2లక్షల అప్పు.. భర్త స్నేహితుడితో వివాహేతర సంబంధం..) -
అప్పులబాధతో ఆగిన రైతు గుండె
– మూడేళ్లుగా చేతికందని పంటలు – రూ.మూడు లక్షలకు చేరిన అప్పులు – అరకొరగా పంటనష్ట పరిహారం అప్పుల వ్యధతో ఓ రైతు గుండె ఆగింది. వర్షాభావంతో మూడేళ్లుగా పంటలు చేతికందకపోగా.. పంటల సాగు కోసం చేసిన అప్పులు తడిసి మోపెడయ్యాయి. బోరుబావిలో భూగర్భజలాలు అడుగంటడంతో అర ఎకరం తరి భూమి కూడా బీడుగా మారింది. వీటికి తోడు ప్రభుత్వం మంజూరు చేసిన పంటనష్ట పరిహారం అరకొర మొత్తం జమకావడంతో అప్పులు ఎలా చెల్లించాలన్న మనోవేదన ఆ రైతును కుంగదీసింది. ఫలితంగా గుండె ఆగింది. - నల్లమాడ నల్లమాడ మండలంలోని నల్లసింగయ్యగారిపల్లికి చెందిన బోడెద్దుల కుళ్లాయప్ప (65) శనివారం ఉదయం గుండెపోటుతో మృతి చెందాడు. బోరుబావి కింద ఉన్న అర ఎకరం పొలంలో సత్తువ కోసం గొర్రెలు తోలించేందుకు శనివారం ఉదయం కాపరుల చేత తడికెలు నాటిస్తున్నాడు. ఉన్నఫళంగా గుండెపోటు రావడంతో అక్కడే అతడు కుప్పకూలాడు. చికిత్స కోసం ఆస్పత్రికి తీసుకెళ్లేలోపు ప్రాణాలు కోల్పోయాడు. అతడికి భార్య అక్కులమ్మ, కుమారుడు, కుమార్తె ఉన్నారు. అప్పులబాధ తాళలేక గుండెపోటుతో మృతి చెందినట్లు అతడి భార్య బోరున విలపించింది. వరుస కురువుతో.. అతడికి 3.53 ఎకరాల భూమి ఉంది. మూడేళ్ల నుంచి వేరుశనగ సాగు చేస్తున్నాడు. వానలు లేక, పంటలు పండక పైసా కూడా చేతికందలేదు. గత ఏడాది కూడా పంట ఎండిపోవడంతో గొర్రెలకు వదిలేశాడు. బోరుబావి కింద అర ఎకరంలో పొద్దుతిరుగుడు పంట వేస్తే నీళ్లు లేక ఎండిపోయింది. పంట పెట్టేందుకు, బోరు కోసం చేసిన అప్పులు రూ.3 లక్షలకు పైనే ఉన్నాయి. పంట నష్ట పరిహారం కూడా తక్కువగా పడింది. అప్పులు ఎలా చెల్లించాంటూ రోజూ మధనపడుతుండేవాడని భార్య వాపోయింది. పంట నష్ట పరిహారం వస్తే అప్పులోళ్లకు వడ్డీలైనా కట్టాలనుకున్నాం. అదికూడా అరకొరగా జమకావడంతో ఆయన గుండెపోటుతో మృతిచెందినట్లు ఆమె కన్నీరుమున్నీరైంది. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. -
దంపతుల ఆత్మహత్యాయత్నం
భర్త మృతి, భార్య పరిస్థితి విషమం తాడిపత్రి : కుటుంబ కలహాలతో దంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వీరిలో భర్త మృతి చెందగా.. భార్య చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. వివరాలిలా ఉన్నాయి. తాడిపత్రి పట్టణంలోని టైలర్స్ కాలనీకి చెందిన కుళ్లాయప్ప (55), దస్తగిరమ్మ దంపతులు. రెండు రోజుల కిందట భార్యాభర్తలు గొడవపడ్డారు. మనస్తాపానికి గురైన కుళ్లాయప్ప మంగళవారం విషపుగుళికలు మింగాడు. దీంతో భార్య కూడా ఆ గుళికలను మింగింది. ఇద్దరూ అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందజేసి, ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కుళ్లాయప్ప మృతి చెందాడు. దస్తగిరమ్మ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం అనంతపురం ఆస్పత్రికి తరలించారు. ఎఐ ఆంజనేయులు కేసు దర్యాప్తుచే స్తున్నారు. -
పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య
ముదిగుబ్బ (ధర్మవరం) : మండల పరిధిలోని ఈదులపల్లికి చెందిన రైతు కుళ్లాయప్ప(62) ఆత్మహత్య చేసుకున్నారు. స్థానికులు, బంధువుల కథనం మేరకు.. ఆయన తనకున్న ఆరు ఎకరాల పొలంలో బోరు వేసుకుని రెండు మూడేళ్ల క్రితం నుంచీ అరటి, టమాట లాంటి పంటలు సాగు చేసి నష్టాలు చవిచూశారు. అప్పులయ్యాయి. ఇప్పుడు సాగులో ఉన్న టమాట, వేరుశనగ పంటలు కూడా ఆశాజనకంగా లేవు. దీనికితోడు కుటుంబ సమస్యలు, అనారోగ్యంతో బాధపడుతుండేవారు. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం పొలంలోనే పురుగుల మందు తాగారు. అపస్మారక స్థితిలో ఉన్న ఆయనను గుర్తించిన కుటుంబీకులు బత్తలపల్లిలోని ఆర్డీటీ ఆస్పత్రికి తరలించారు. కానీ కోలుకోలేని ఆయన బుధవారం సాయంత్రం మృతి చెందారు. దీనిపై పోలీసులకు ఎలాంటి ఫిర్యాదూ అందలేదు. కుళ్లాయప్పకు భార్య నరసమ్మ, ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. పిల్లలందరికీ పెళ్లిళ్లయిపోయాయి. -
'చార్ధామ్' బాధలో వ్యక్తి మృతి
జోసెఫ్ నగర్: అనంతపురం నగరంలో విషాదం చోటుచేసుకుంది. తన కుటుంబ సభ్యులు ఛార్‌ధామ్ యాత్ర వరదల్లో చిక్కుకున్నారని తెలుసుకున్న ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ సంఘటన అనంతపురం పట్టణం లోని జోసెఫ్ నగర్లో శుక్రవారం రాత్రి జరిగింది. వివరాలు.. కాలనీకి చెందిన కుళ్లాయప్ప (68) కుటుంబానికి చెందిన ఏడుగురు సభ్యులు ఈ నెల 15న ఛార్ ధామ్ యాత్రకు వెళ్లారు. రెండు రోజుల నుంచి ఉత్తరాఖండ్‌లో భారీగా వరదలు పోటెత్తడంతో తాము అందులో చిక్కుకున్నామని.. శుక్రవారం సాయంత్రం ఇంట్లో ఉన్న తండ్రి కుళ్లాయప్పకు తెలియజేశారు. దీంతో.. ఆవేదన చెందిన కుళ్లాయప్ప గుండె ఆగి చనిపోయాడు. -
ప్రాణం తీసిన వివాహేతర సంబంధం
బత్తలపల్లి (అనంతపపురం): వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న ఓ వ్యక్తి గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో దారుణహత్యకు గురైన సంఘటన అనంతపురం జిల్లా బత్తలపల్లి మండలంలోని మాల్యవంతం గ్రామంలో బుధవారం జరిగింది. మాల్యవంతం గ్రామానికి చెందిన గజ్జెల కుళ్లాయప్ప(38) గ్రామంలోని రైతుల ట్రాక్టర్లకు డ్రైవర్‌గా వెలుతూ జీవిస్తున్నాడు. ఈ క్రమంలో గ్రామంలోని వారి సమీప బంధువుకు చెందిన ఓ మహిళతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ సమాచారం తెలుసుకున్న కుళ్లాయప్ప భార్య వెంకటలక్ష్మి రెండు నెలల క్రితం భర్తతో గోడవ పడి బెంగుళూరుకు వెళ్లి బందువుల వద్ద ఉంటూ జీవిస్తున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో కుళ్లాయప్ప వివాహేతర సంబంధాలకు అడ్డులేకుండా పోయింది. బుధవారం మధ్యాహ్నం గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి మాట్లాడారని, అప్పుడు ఇంట్లో నుంచి వెళ్లిన వ్యక్తి తిరిగి వచ్చి ఇంట్లో నిద్రపోయినట్లు మృతుని తల్లి కుళ్లాయమ్మ వాపోయింది. బయటకు వెళ్లిన వ్యక్తి రక్తపుగాయాలతో ఇంటికి వచ్చి పడుకున్నట్లు తెలుస్తోంది. ఒంటిపైన గాయాలు, తలపై బలమైన దెబ్బలు తగిలి ఉండడంతో గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో దెబ్బలు తని ఇంటికి వచ్చి పడుకుని మృతి చెందినట్లు తెలిపారు. అయితే తనను ఫలానా వ్యక్తులు కొట్టినారనిగాని, దెబ్బలకు ఆసుపత్రికి వెళ్లి చూపించుకుందామన్న ఆలోచనగాని లేకుండానే మృతి చెందడంతో హత్య మిస్టరీగా మారింది. దీంతో ఎస్ఐ హేమంత్‌కుమార్ డ్వాగ్ స్క్వాడ్‌కు సమాచారం అందించారు. వారు వచ్చి తనిఖీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మృతునికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. వారి ఆలానపాలన అంతా మృతుని తల్లి కుళ్లాయమ్మనే చూసుకుంటోంది. తండ్రి హత్యకు గురికావడం, తల్లి ఉన్నా వారికి దూరంగా ఉండడంతో చిన్నారులను చూసి పలువురు సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న బంధువులు తరలివచ్చి బోరున విలపించారు.