బత్తలపల్లి (అనంతపపురం): వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న ఓ వ్యక్తి గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో దారుణహత్యకు గురైన సంఘటన అనంతపురం జిల్లా బత్తలపల్లి మండలంలోని మాల్యవంతం గ్రామంలో బుధవారం జరిగింది. మాల్యవంతం గ్రామానికి చెందిన గజ్జెల కుళ్లాయప్ప(38) గ్రామంలోని రైతుల ట్రాక్టర్లకు డ్రైవర్‌గా వెలుతూ జీవిస్తున్నాడు. ఈ క్రమంలో గ్రామంలోని వారి సమీప బంధువుకు చెందిన ఓ మహిళతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ సమాచారం తెలుసుకున్న కుళ్లాయప్ప భార్య వెంకటలక్ష్మి రెండు నెలల క్రితం భర్తతో గోడవ పడి బెంగుళూరుకు వెళ్లి బందువుల వద్ద ఉంటూ జీవిస్తున్నట్లు తెలిపారు.
ఈ నేపథ్యంలో కుళ్లాయప్ప వివాహేతర సంబంధాలకు అడ్డులేకుండా పోయింది. బుధవారం మధ్యాహ్నం గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి మాట్లాడారని, అప్పుడు ఇంట్లో నుంచి వెళ్లిన వ్యక్తి తిరిగి వచ్చి ఇంట్లో నిద్రపోయినట్లు మృతుని తల్లి కుళ్లాయమ్మ వాపోయింది. బయటకు వెళ్లిన వ్యక్తి రక్తపుగాయాలతో ఇంటికి వచ్చి పడుకున్నట్లు తెలుస్తోంది. ఒంటిపైన గాయాలు, తలపై బలమైన దెబ్బలు తగిలి ఉండడంతో గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో దెబ్బలు తని ఇంటికి వచ్చి పడుకుని మృతి చెందినట్లు తెలిపారు. అయితే తనను ఫలానా వ్యక్తులు కొట్టినారనిగాని, దెబ్బలకు ఆసుపత్రికి వెళ్లి చూపించుకుందామన్న ఆలోచనగాని లేకుండానే మృతి చెందడంతో హత్య మిస్టరీగా మారింది.
దీంతో ఎస్‌ఐ హేమంత్‌కుమార్ డ్వాగ్ స్క్వాడ్‌కు సమాచారం అందించారు. వారు వచ్చి తనిఖీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మృతునికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. వారి ఆలానపాలన అంతా మృతుని తల్లి కుళ్లాయమ్మనే చూసుకుంటోంది. తండ్రి హత్యకు గురికావడం, తల్లి ఉన్నా వారికి దూరంగా ఉండడంతో చిన్నారులను చూసి పలువురు సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న బంధువులు తరలివచ్చి బోరున విలపించారు.