మిర్యాలగూడ: ప్రైవేట్ ట్రావెల్స్ మోసాలతో నల్లగొండ జిల్లా యాత్రికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. మిర్యాలగూడకు చెందిన యాత్రికులను యాత్రాదర్శిని ట్రావెల్స్ కేదార్నాథ్ యాత్రకు తీసుకువెళ్లింది. అనూహ్యంగా రెండు రోజుల కిందట హరిద్వార్లో యాత్రికులను ట్రావెల్స్ సిబ్బంది వదిలేసి వెళ్లిపోయారు. దీంతో వారు అక్కడ ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు. ట్రావెల్స్ తీరుపై బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.