
సాక్షి,ముంబయి: బాలీవుడ్‌లో ప్రతిష్టాత్మక ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న కేదార్‌నాథ్ కోసం చిత్ర మేకర్లు భారీగా ఖర్చు చేస్తున్నారు. సైఫ్ అలీఖాన్ కుమార్తె సారా అలీ, సుశాంత్ సింగ్ రాజ్‌పుట్ జంటగా తెరకెక్కుతున్న కేదార్‌నాథ్ మూవీ ఇప్పటికే హిమాలయాల్లో కొంత భాగం షూటింగ్ పూర్తి చేసుకుంది.కేదార్‌నాథ్ టెంపుల్‌ను ప్రతిబింబించేలా ప్రస్తుతం ముంబయి ఫిల్మ్‌సిటీలో భారీ సెట్‌ను ఏర్పాటు చేశారు.
వరదలకు సంబంధించిన సన్నివేశాలను ఈ సెట్‌లో తెరకెక్కించనున్నారు. దీనికోసం భారీ వాటర్ ట్యాంకర్లను సిద్ధం చేశారు. ఈ సెట్ నిర్మాణానికి నిర్మాతలు రూ ఏడు కోట్లు వెచ్చించినట్టు సమాచారం. వరద ముంపు సన్నివేశాల చిత్రీకరణ కోసం నటీనటులు, చిత్ర బృందానికి నిపుణులతో శిక్షణ ఇప్పించారు. సైఫ్ అలీఖాన్, అమృతాసింగ్‌ల కుమార్తె సారాకు ఇదే తొలిచిత్రం కావడంతో కేదార్‌నాథ్‌పై బాలీవుడ్ దృష్టిసారించింది.
Comments
Please login to add a commentAdd a comment