ఆ ఒక్క బ్రిడ్జీ కొట్టుకుపోయింది... | Heavy Rains Wash Away Vital Bridge on Way to Kedarnath | Sakshi
Sakshi News home page

ఆ ఒక్క బ్రిడ్జీ కొట్టుకుపోయింది...

Published Fri, Jun 26 2015 9:33 AM | Last Updated on Sun, Sep 3 2017 4:25 AM

ఆ ఒక్క బ్రిడ్జీ కొట్టుకుపోయింది...

ఆ ఒక్క బ్రిడ్జీ కొట్టుకుపోయింది...

డెహ్రాడూన్: భారీ వర్షాలతో ముంచెత్తుతున్న వరదలు కేధార్నాధ్కు వెళ్లే మార్గంలోని బ్రిడ్జిని ధ్వంసం చేశాయి. మందాకిని నదిపై ఉన్న ఈ వంతెన వరద ఉధృతికి కొట్టుకుపోయింది. దీంతో అక్కడివారి పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. కేదార్ నాథ్కు వెళ్లే మార్గంలోని సోన్ ప్రయాగ్, గౌరీ కుంద్ మధ్య ఈ బ్రిడ్జి ఉంది. గత రెండు రోజులుగా ఎడతెరిపిలేని వర్షాల కారణంగా పర్వత పాద ప్రాంతాల్లో నీటి ప్రవాహం ఎక్కువైంది.

ముఖ్యంగా కేధార్ నాధ్ వెళ్లే మార్గంలోని మందాకిని నది ఉప్పొంగుతోంది. ఈ నది పై ఉన్న బ్రిడ్జి ద్వారానే వాహనాల రాకపోకలు జరుగుతుంటాయి. అయితే, ఉన్నట్లుండి బ్రిడ్జి కూలిపోయి వరదల్లో కొట్టుకుపోవడంతో అధికారులు ఉలిక్కిపడ్డారు. సమయానికి బ్రిడ్జిపై ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం చోటుచేసుకోలేదు. దీంతో ఆ మార్గంలో రవాణా రాకపోకలు స్తంభించగా యాత్రికులు నిలిచిపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement