
కూతురు సారాతో సైఫ్ అలీ ఖాన్
బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ తనయ సారా అలీ ఖాన్ కోర్టు మెట్లేక్కనున్నారు. ‘కేదర్‌నాథ్’ సినిమా డేట్స్ విషయంలో గొడవలు రావడంతో సదరు చిత్ర యూనిట్ సారా మీద కోర్టులో దావా వేసింది. ముంబై హైకోర్టు నేడు(శుక్రవారం) ఈ విషయాన్ని విచారించనుండటంతో సారా, తండ్రి సైఫ్ అలీఖాన్‌తో కలిసి కోర్టుకు హజరవ్వనున్నట్లు సమాచారం. వివరాల్లోకి వెళ్తే... సారా అలీఖాన్ కేదార్‌నాథ్ సినిమా ద్వారా బాలీవుడ్‌కు పరిచయమవ్వాల్సిందన్న విషయం తెలిసిందే. అభిషేక్ కపూర్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం కోసం 2018 జూన్ వరకూ సారా డేట్స్ ఇచ్చారు.
అయితే నిర్మాతకు, దర్శకుడికి మధ్య వివాదాలు రావడంతో ఈ సినిమా నిర్మాణం ఆగిపోయింది. దాంతో సారా, రోహిత్ శెట్టి తెరెక్కిస్తున్న ‘సింబా’(టెంపర్ రీమేక్) సినిమా కోసం డేట్లు అడ్జస్ట్ చేశారు. అదే సమయంలో మరో నిర్మాత దొరకటంతో అటకెక్కిందనుకున్న కేదార్‌నాథ్ షూటింగ్ తిరిగి ప్రారంభం అయ్యింది. దీంతో తిరిగి షూటింగ్‌కు హజరవ్వాల్సిందిగా సారాను చిత్ర యూనిట్ కోరింది. కానీ ఆమె మేనేజర్ మాత్రం సింబా షూటింగ్ పూర్తయ్యాకే కేదర్‌నాథ్ చిత్రీకరణలో పాల్గొంటారని తేల్చి చెప్పారు. దీంతో కేదర్‌నాథ్ మేకర్లు సారా మీద కోర్టులో దావా వేసాడు. కోర్టు బయటే వివాదం పరిష్కరించుకునేందుకు సైఫ్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదని తెలుస్తోంది. ఈ పిటిషన్ విచారణకు ముంబై హై కోర్టు ఎస్ జే కథ్‌వాలా నేతృత్వంలో బెంచ్‌ను ఏర్పాటు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment