
ప్రొకబడ్డీ బ్రాండ్ అంబాసిడర్‌గా బడా హీరో..
పెరంబూరు: ప్రస్తుతం క్రికెట్ తర్వాత అత్యధిక ప్రాధ్యానత సంతరించుకున్న క్రీడల్లో కబడ్డీ ఒకటి. సీజన్ సీజన్ కు ప్రేక్షక ఆదరణ పెరుగుతూ వస్తుంది. ఇప్పటివరకూ ప్రొకబడ్డీ నాలుగు సీజన్లను పూర్తి చేసుకుని 5వ సీజన్ కు రెడీ అయిపోయింది. ఈ కబడ్డీ 5వ సీజన్ కు తమిళ్ తలైవాస్ జట్టుకు విశ్వనటుడు కమలహాసన్ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించబడ్డారు. ప్రఖ్యాత క్రికెట్ క్రీడాకారుడు సచిన్ టెండూల్కర్,మెగాస్టార్ చిరంజీవి, అల్లుఅరవింద్,అల్లుఅర్జున్, రామ్‌చరణ్‌తేజ, నిమ్మగడ్డ ప్రసాద్ వంటి బడా సెలబ్రేటీలు భాగస్తులైన్నారు.
కమల్ అంబాసిడర్ గా నియమించబడటం నిజంగా విశేషమే అవుతుంది. తమ జట్టుకు అంబాసిడర్ కావడం ఎంతో ప్రోత్సాహంగా ఉంటుందని నిర్వాహకుల్లో ఒకరైన నిమ్మగడ్డ ప్రసాద్ అన్నారు.ఎన్నో ఛాలెంజ్‌లను ఆత్మ విశ్వాసంతో, నిబద్దతతో కూడిన ప్రవర్తనతో కమల్ ఎదుర్కొన్నారని ఆయన అన్నారు. అలాంటి వ్యక్తి తమిళ్ తలైవాస్ జట్టుకు మార్గదర్శి అవుతారనే ప్రగాఢ నమ్మకం తమకు ఉందన్నారు.
కళారంగంలో తన సాధనలతో భారత దేశానికి కీర్తిని ఆపాదించిన నటుడు కమలహాసన్ అని ఆయన పేర్కొన్నారు. కమల్ తమ క్రీడాసక్తిని తన చిత్రాలలోనే కాకుండా నిజ జీవితంలోనూ చూపారని అన్నారు. నాలుగో సీజన్ ఫైనల్లో జైపూర్ పింక్ పాంథర్స్ పై పాట్నా పైరేట్స్ విజయం సాధించి టైటిల్ కైవసం చేసుకుంది. మరీ 5వ సీజన్ అతి త్వరలో ప్రేక్షకులను అలరించాడానికి సిద్ధమౌతోంది.
గౌరవంగా భావిస్తున్నాను..
ప్రొకబడ్డీ పోటీల్లో తమిళ్ తలైవాస్ జట్టుకు బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించటాన్ని గౌరవంగా భావిస్తున్నానని కమలహాసన్ పేర్కొన్నారు. మన సంప్రదాయ క్రీడ ప్రొకబడ్డీ పోటీల్లో తానూ ఒక భాగం అవుతున్నందుకు సంతోషంగా ఉందని ఆయన అన్నారు. పొంగే ఉత్సాహంతో ఈ క్రీడల్లో విజయ సాధించి మన దేశానికి ఖ్యాతిని ఆర్జించి పెట్టాలని తమిళ తలైవాస్ జట్టుకు కమల్ ఈ సందర్బంగా పిలుపు నిచ్చారు.