మన్ పసంద్ బీవరేజస్ బ్రాండ్ అంబాసిడర్ గా ప్రముఖ హీరోయిన్ తాప్సీ పన్ను ఎంపికైంది. ప్రముఖ ఫ్రూట్ జ్యూస్ తయారీ సంస్థ మన్ పసంద్ లిమిటెడ్ కు చెందిన బ్రాండ్ 'ఫ్రూట్స్ అప్ ' కు బ్రాండ్ అంబాసిడర్ గా నటి తాప్సీ నియమించి నట్టు మేనేజింగ్ డైరెక్టర్, ఛైర్మన్ ధీరేంద్ర సింగ్ వెల్లడించారు. విలక్షణమైన, క్లిష్టమైన పాత్రల ద్వారా , విమర్శకులు, సినీ పెద్దల ప్రశంసలందుకున్న తాప్సీ త్వరలో తమ ప్రకటనల్లో కనిపించనున్నట్టు చెప్పారు.
ఫ్రూట్స్ అప్ బ్రాండ్ లో 16-17 శాతం పల్ప్ తో మామిడి, ఆపిల్, జామ, లీచీ, నారింజతో పాటు మిక్స్ డ్ ఫ్రూట్ లాంటి వేర్వేరు రుచులలో ప్రీమియం పండ్ల రసాలను అందిస్తుంది గుజరాత్ లోని వడోదరలో రెండు తయారీ యూనిట్టు, ఉత్తరప్రదేశ్, వారణాసిలో డెహ్రాడూన్ లో హర్యానా ఉత్తరాంచల్, అంబాలా ఒక్కోటి చొప్పున ఉన్నాయి. ఈ మధ్యకాలంలో డిస్ట్రిబ్యూషన్ నెట్ వర్క్ ను భారీగా విస్తరించిన మన్ పసంద్ కొత్త ప్రోడక్ట్ లను లాంచ్ చేసింది. ఫ్రూట్స్ అప్, కోకోనట్ వాటర్ బ్రాండ్ కోకో సిప్ ను కొత్తగా ప్రవేశపెట్టింది. తద్వారా మరింత వృద్ధి సాధించాలని యోచిస్తోంది.
కాగా తెలుగులో అగ్రహీరోలందరి సరసన మెప్పించిన తాప్సీ ఇటీవల పింక్ మూవీలో బిగ్ బి తో కలిసి నటించే చాన్స్ కొట్టేసిన ఈ అమ్మడు బాలీవుడ్ లో స్టార్ ఇమేజ్ కోసం శ్రమిస్తున్న సంగతి తెలిసిందే.
'మన్ పసంద్' చాన్స్ కొట్టేసిన అమ్మడు
Published Thu, Dec 15 2016 8:33 PM | Last Updated on Mon, Sep 4 2017 10:48 PM
Advertisement
Advertisement