ఇన్ఫోసిస్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా ప్రపంచ నం.1 టెన్నిస్‌ ప్లేయర్‌ | Infosys ropes in Rafael Nadal as brand ambassador | Sakshi
Sakshi News home page

ఇన్ఫోసిస్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా ప్రపంచ నం.1 టెన్నిస్‌ ప్లేయర్‌

Published Fri, Aug 25 2023 8:11 AM | Last Updated on Fri, Aug 25 2023 8:12 AM

Infosys ropes in Rafael Nadal as brand ambassador - Sakshi

న్యూఢిల్లీ: ఐటీ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్‌కు, ఆ సంస్థకే చెందిన డిజిటల్‌ ఇన్నోవేషన్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా అంతర్జాతీయ టెన్నిస్‌ స్టార్‌ రఫేల్‌ నాదల్‌ నియమితులయ్యారు. మూడేళ్ల పాటు ఈ భాగస్వామ్యం అమల్లో ఉంటుంది. ఈ సందర్భంగా ఇన్ఫీ, నాదల్‌ కోచింగ్‌ టీమ్‌ కలిసి కృత్రిమ మేధ ఆధారిత మ్యాచ్‌ అనాలిసిస్‌ టూల్‌ను అభివృద్ధి చేయనున్నాయని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.

వ్యక్తులు, వ్యాపార దిగ్గజాలు ఎప్పటికప్పుడు మారే పరిస్థితులకు అనుగుణంగా తమను తాము మల్చుకుంటూ, ముందుకు ఎలా సాగాలనేది తెలుసుకునేందుకు నాదల్‌ చక్కని నిదర్శనమని సంస్థ సీఈవో సలిల్‌ పరేఖ్‌ తెలిపారు. ఇన్ఫోసిస్‌ డిజిటల్‌ రంగంలో తనకున్న అనుభవంతో టెన్నిస్‌ క్రీడకు కూడా సేవలు అందించే తీరు తనకు నచ్చిందని నాదల్‌ పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement