పీఎన్బీ అంబాసిడర్గా విరాట్ కోహ్లీ | Punjab National Bank ropes in Virat Kohli as brand ambassador | Sakshi
Sakshi News home page

పీఎన్బీ అంబాసిడర్గా విరాట్ కోహ్లీ

Published Sat, Sep 17 2016 6:08 PM | Last Updated on Mon, Sep 4 2017 1:53 PM

పీఎన్బీ అంబాసిడర్గా విరాట్ కోహ్లీ

పీఎన్బీ అంబాసిడర్గా విరాట్ కోహ్లీ

అత్యంత ధనార్జన గల భారత క్రీడాకారుల్లో టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో ఉంటాడు. ఎండార్స్మెంట్ల రూపంలో విరాట్ భారీ మొత్తంలో సంపాదిస్తున్నాడు. కోహ్లీకి తాజాగా మరో ఆఫర్ వచ్చింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్కు బ్రాండ్ అంబాసిడర్గా విరాట్ వ్యవహరించనున్నాడు. శనివారం పీఎన్బీ అధికారులు ఈ విషయాన్ని ప్రకటించారు.

కోహ్లీ ఉత్సాహవంతుడైన యువ క్రీడాకారుడని, యువతలో చాలా క్రేజ్ ఉందని పీఎన్బీ అధికారులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అతనిలో అంకితభావం, విజయం సాధించాలనేతపన వంటి గొప్పలక్షణాలున్నాయని ప్రశంసించారు. పీఎన్బీ బ్రాండ్ అంబాసిడర్గా విరాట్ను ఎంపిక చేయడం వల్ల బ్యాంక్ పురోభివృద్ధికి దోహదపడుతుందని భావిస్తున్నారు. తాను 16 ఏళ్ల వయసు నుంచి పీఎన్బీ ఖాతాదారుడిగా ఉంటున్నట్టు కోహ్లీ చెప్పాడు. పీఎన్బీకి దేశవ్యాప్తంగా లక్షలాదిమంది ఖాతాదారులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement