మలబార్‌ గోల్డ్‌ అండ్‌ డైమండ్స్‌ ప్రచారకర్తగా నటి అలియా భట్‌ | Malabar Gold and Diamonds ropes in Alia Bhatt as brand ambassador | Sakshi
Sakshi News home page

మలబార్‌ గోల్డ్‌ అండ్‌ డైమండ్స్‌ ప్రచారకర్తగా నటి అలియా భట్‌

Published Thu, Apr 20 2023 4:46 AM | Last Updated on Thu, Apr 20 2023 4:46 AM

Malabar Gold and Diamonds ropes in Alia Bhatt as brand ambassador - Sakshi

హైదరాబాద్‌: మలబార్‌ గోల్డ్‌ అండ్‌ డైమండ్స్‌ తన ప్రచారకర్తగా బాలీవుడ్‌ నటి అలియా భట్‌ను నియమించుకుంది. సంస్థ 30 ఏళ్ల వేడుకల సందర్భంగా అలియాతో జట్టు కట్టినట్లు గ్రూప్‌ చైర్మన్‌ ఎం.పీ. అహ్మద్‌ తెలిపారు. ‘‘అందం, అభినయంతో సినీ ప్రేక్షకుల్ని రంజింపచేస్తున్న అలియా.., సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేసి సంస్థ ఉత్పత్తులను కస్టమర్లకు మరింత చేరువ చేస్తుంది.

మా లక్ష్యాల సాధనకు నటిగా, వ్యక్తిగా ఆమె మరింత బలాన్ని చేకూరుస్తుంది’’ అని అహ్మద్‌ విశ్వాసం వ్యక్తం చేశారు. అనిల్‌ కపూర్, కరీనా కపూర్, కార్తీ వంటి నటీనటులు బ్రాండ్‌ ప్రచాకర్తలుగా ఉన్న మలబార్‌ గోల్డ్‌ అండ్‌ డైమండ్స్‌ కుటుంబంలోకి చేరుతున్నందుకు సంతోషంగా ఉందని అలియా అన్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement