ఢిల్లీ ప్రీమియర్ లీగ్ అరంగేట్ర సీజన్‌కు ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ అన్ని రకాల ఏర్పాట్లు చేస్తోంది. ఈ తొట్టతొలి ఎడిషన్ ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 8 వరకు జరగనుంది.
ఈ లీగ్‌లోని అన్ని మ్యాచ్‌లు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరగనుంది. ఈ లీగ్‌లో ఫస్ట్‌క్లాస్ క్రికెటర్లతో భారత స్టార్ క్రికెటర్లు రిషబ్ పంత్, ఇషాంత్ శర్మ, నవదీప్ సైనీ భాగం కానున్నారు.
డీపీఎల్ బ్రాండ్ అంబాసిడర్‌గా సెహ్వాగ్..
ఇక ఇది ఇలా ఉండగా.. ఢిల్లీ ప్రీమియర్ లీగ్ ప్రారంభ సీజన్ బ్రాండ్ అంబాసిడర్‌గా భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్‌ను డీడీసీఎ నియమించింది. శుక్రవారం ఢిల్లీలో జరిగిన గ్రాండ్ ఈవెంట్‌లో డీడీసీఎ తమ నిర్ణయాన్ని ప్రకటించింది. ఈ కార్యక్రామానికి సెహ్వాగ్ సైతం హాజరయ్యాడు.
కాగా ఢిల్లీ నుంచే భారత జట్టుకు సెహ్వాగ్ ప్రాతినిథ్యం వహించాడు. ఇక ఢిల్లీలోని అత్యుత్తమ ప్రతిభావంతులైన యువ క్రికెటర్లను ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని డీడీసీఏ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రీమియర్ లీగ్‌ను డీడీసీఎ ప్రారంభించనుంది.
లీగ్ ప్రారంభ ఎడిషన్‌లో ఆరు ఫ్రాంచైజీలు భాగం కానున్నాయి. సౌత్ ఢిల్లీ సూపర్ స్టార్స్, పురాణి డిల్లీ 6, సెంట్రల్ ఢిల్లీ కింగ్స్, నార్త్ ఢిల్లీ స్ట్రైకర్స్, వెస్ట్ ఢిల్లీ లయన్స్, ఈస్ట్ ఢిల్లీ రైడర్స్ జట్లు మొత్తం రూ. 49.65 కోట్ల రూపాయలకు విక్రయించబడ్డాయి.
Comments
Please login to add a commentAdd a comment