మరో కంపెనీకి ప్రచారకర్తగా మహేశ్‌బాబు Dollar Industries Limited appointed Mahesh Babu as its brand ambassador for South India. Sakshi
Sakshi News home page

మరో కంపెనీకి ప్రచారకర్తగా మహేశ్‌బాబు

Jun 14 2024 3:16 PM | Updated on Jun 14 2024 4:07 PM

Dollar Industries signed Mahesh Babu as their brand ambassador for South India

ఇన్నర్‌వేర్, ఔటర్‌వేర్‌ ఉత్పత్తులు తయారుచేస్తున్న డాలర్‌ ఇండస్ట్రీస్‌ కంపెనీ ప్రముఖ నటుడు మహేశ్‌బాబును దక్షిణ భారతదేశంలో ప్రచారకర్తగా నియమించుకున్నట్లు ప్రకటించింది. సౌత్‌ఇండియాలో మరింత విస్తరించేందుకు ఈ నియామకం ఎంతో ఉపయోగపడుతుందని కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వినోద్‌ కుమార్‌ గుప్తా తెలిపారు.

ఈ సందర్భంగా కంపెనీ ఎండీ మాట్లాడుతూ..‘2027 నాటికి దక్షిణ భారతదేశంలో కొత్తగా 50 విక్రయ కేంద్రాలు నెలకొల్పనున్నాం. హొజైరీ (ఇన్నర్‌వేర్, ఔటర్‌వేర్‌) ఉత్పత్తుల ప్రచారకర్తగా ప్రిన్స్‌ మహేశ్‌బాబును నియమించుకోవడం సంతోషంగా ఉంది. ఇది సంస్థకు ఎంతో ఉపయోగపడుతుంది. కంపెనీ మొత్తం ఆదాయంలో దక్షిణాది వాటా 8 శాతంగా ఉంది. దీన్ని 20 శాతానికి తీసుకెళ్లేలా లక్ష్యాన్ని నిర్ణయించుకున్నాం. రాబోయే రెండేళ్లలో సంస్థ మొత్తం ఆదాయాన్ని రూ.2,000 కోట్లకు పెంచేలా ప్రయత్నిస్తున్నాం’ అని చెప్పారు.

ఇదీ చదవండి: ప్రపంచంలోనే అత్యధిక వేతనం ఆయనకే..ఎంతో తెలుసా..?

మహేశ్‌బాబు ఇప్పటికే జొయాలుక్కాస్‌, రాయాల్‌స్టాగ్‌, మహీంద్రా ట్రాక్టర్స్‌, టాటా స్కై, మౌంటేన్‌ డ్యూ, టీవీఎస్‌ మోటార్‌..వంటి కంపెనీలకు ప్రచారకర్తగా ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement