Prince mahesbabu
-
మరో కంపెనీకి ప్రచారకర్తగా మహేశ్‌బాబు
ఇన్నర్‌వేర్, ఔటర్వేర్ ఉత్పత్తులు తయారుచేస్తున్న డాలర్ ఇండస్ట్రీస్ కంపెనీ ప్రముఖ నటుడు మహేశ్‌బాబును దక్షిణ భారతదేశంలో ప్రచారకర్తగా నియమించుకున్నట్లు ప్రకటించింది. సౌత్ఇండియాలో మరింత విస్తరించేందుకు ఈ నియామకం ఎంతో ఉపయోగపడుతుందని కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ వినోద్ కుమార్ గుప్తా తెలిపారు.ఈ సందర్భంగా కంపెనీ ఎండీ మాట్లాడుతూ..‘2027 నాటికి దక్షిణ భారతదేశంలో కొత్తగా 50 విక్రయ కేంద్రాలు నెలకొల్పనున్నాం. హొజైరీ (ఇన్నర్‌వేర్, ఔటర్వేర్) ఉత్పత్తుల ప్రచారకర్తగా ప్రిన్స్ మహేశ్‌బాబును నియమించుకోవడం సంతోషంగా ఉంది. ఇది సంస్థకు ఎంతో ఉపయోగపడుతుంది. కంపెనీ మొత్తం ఆదాయంలో దక్షిణాది వాటా 8 శాతంగా ఉంది. దీన్ని 20 శాతానికి తీసుకెళ్లేలా లక్ష్యాన్ని నిర్ణయించుకున్నాం. రాబోయే రెండేళ్లలో సంస్థ మొత్తం ఆదాయాన్ని రూ.2,000 కోట్లకు పెంచేలా ప్రయత్నిస్తున్నాం’ అని చెప్పారు.ఇదీ చదవండి: ప్రపంచంలోనే అత్యధిక వేతనం ఆయనకే..ఎంతో తెలుసా..?మహేశ్‌బాబు ఇప్పటికే జొయాలుక్కాస్, రాయాల్స్టాగ్, మహీంద్రా ట్రాక్టర్స్, టాటా స్కై, మౌంటేన్ డ్యూ, టీవీఎస్ మోటార్..వంటి కంపెనీలకు ప్రచారకర్తగా ఉన్నారు. -
Mahesh Babu: మాస్ లుక్ అయిన క్లాస్ లుక్ అయిన మహేష్ బాబే..
-
‘క్రిస్‌గెతిన్స్’లో ప్రిన్స్ సందడి
బంజారాహిల్స్ రోడ్ నెం.2లోని క్రిస్‌గెతిన్స్ జిమ్‌లో గురువారం సినీ హీరో ప్రిన్స్ మహేష్‌బాబు సందడి చేశారు. తన వ్యక్తిగత ట్రైనర్ సతీష్ పర్యాద ఏడాది క్రితం ప్రారంభించిన ఈ జిమ్ మొదటి వార్షికోత్సవ వేడుకులకు మహేష్‌బాబు హాజరై కేక్ కట్ చేశారు. నాణ్యమైన శిక్షణ ఇస్తే ఏ సంస్థ అయినా విజయపథంలో దూసుకుపోతుందనడానికి ఈ జిమ్ నిదర్శనమని ఆయన అన్నారు. కార్యక్రమంలో జిమ్ సీఈఓ సతీష్ పర్యాద, భాగస్వామి శ్రీకాంత్ మక్కపాటి పాల్గొన్నారు. – బంజారాహిల్స్ -
బుర్రిపాలెంలో బ్రహ్మోత్సవం
► ప్రిన్స్ మహేశ్‌బాబు రాకతో మిన్నంటిన కోలాహలం ► వేలాదిగా తరలివచ్చిన అభిమానులు, గ్రామస్తులు ► సామాజిక మార్పునకు ప్రయత్నం చేస్తానని మహేశ్ వెల్లడి ► పేద మహిళలకు ఇళ్ల స్థల పట్టాల పంపిణీ తెనాలి : ఎప్పుడెప్పుడాని ఎదురుచూసిన ఘట్టం రానేవచ్చింది. తమ అభిమాన హీరో, ప్రిన్స్ మహేశ్‌బాబు రానున్న సమాచారం తెలిసి కళ్లు కాయలు కాచేలా ఎదురుచూసిన అభిమానులకు ఆదివారం నిజంగా పండగరోజయింది. ఉదయం నుంచి గ్రామంలో సందడి చేశారు. తెనాలి నుంచి, పరిసర గ్రామాల నుంచి ఏది దొరికితే ఆ వాహనంలో చేరుకున్న అభిమానులు, మహేశ్ పర్యటన మార్గానికి ఇరువైపుల వేచిఉండటమే కాదు, ఆ దారిలో ప్రతి మేడ, గోడ, చెట్టు...అభిమానులతో నిండిపోయింది. ఎండ ఒక పక్క ముచ్చెమటలు పట్టిస్తున్నా, దాహం వేస్తున్నా ఖాతరు చేసినవారు లేరు. మధ్యాహ్నం ఒకటిన్నర తర్వాత గ్రామానికి చేరుకున్న వెండితెర శ్రీమంతుడిని చూసి అంతా కేరింతలు కొట్టారు. చేతులు ఊపి సంతోషాన్ని తెలియ జేయటమే కాదు..సెల్ఫోన్లతో వీడియోలు, ఫోటోలు తీయటంలో మునిగిపోయారు. నేరుగా తమ ఇంటికి చేరుకున్న మహేశ్‌బాబు, రెండు మూడు పర్యాయాలు బయటకొచ్చి డాబాపైనుంచి చేతులూపుతూ కుర్రకారును మరింత కిర్రెక్కించారు. అదే భవనంలో మరో డాబాపై విలేకరుల సమావేశం, అక్కడే వనరులు, రుణ అర్హత కార్డులు, ఆరోగ్య కార్డులను పంపిణీ చేశాక, టాపులేని వాహనంపై బయలుదేరిన మహేశ్‌ను చూసి అభిమానుల ఆనందానికి అవధుల్లేవు. మహేశ్ చేతుల మీదుగా.. గ్రామంలో అభివృద్ధి పనులే కాకుండా, సామాజిక మార్పునకు ప్రయత్నం చేస్తామని ప్రిన్స్ మహేశ్ బాబు ఈ సందర్భంగా చెప్పారు. గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్, ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్, విజయవాడ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, తండ్రి సోదరు డు జి.ఆదిశేషగిరిరావుతో కలిసి మహేశ్ బాబు విలేకరులతో మాట్లాడారు. గ్రామంలో చేపట్టనున్న కార్యక్రమాలతోపాటు అక్కడే ప్రభుత్వానికి చెందిన వివిధ వనరులను లబ్ధిదారులకు అందజేశారు. పేద మహిళలు వెంకటేశ్వరమ్మ, పాపమ్మకు ఇళ్లస్థలాల పట్టాలను పంపిణీ చేశారు. కిలారి రాజేష్‌కు కౌలురైతు రుణ అర్హత గుర్తింపు కార్డు అందజేశారు. డ్వాక్రా గ్రూపులకు కోటి రూపాయల చెక్కు అందించారు. మహేశ్‌తో కలిసి బుర్రిపాలెం గ్రామస్తుల ఆరోగ్య సంరక్షణకు ముందుకొచ్చిన ఆంధ్రా హాస్పటల్ ఆధ్వర్యంలో ఆరోగ్య కార్డులను గ్రామసర్పంచ్ కొండూరి సామ్రాజ్యం, కంచర్ల ఏసుదాసు, పెమ్మసాని సంపతయ్యకు అందజేశారు. గ్రామంలోని ప్రతి ఒక్కరికి ఆరోగ్యకార్డు లు ఇచ్చి, ప్రతి రెం డు నెలలకోసారి వైద్యశిబిరాలను నిర్వహిస్తామని ఆ హాస్పటల్ చైర్మన్ డాక్టర్ రమణ వెల్లడించారు. ఆర్నెల్లకోసారి పిల్లలకు ఉచితంగా వ్యాక్సిన్ వేస్తామని చెప్పారు. గ్రామస్తులకు తమ హాస్పటల్లో స్పెషలిస్టు వైద్యపరీక్షలు ఉచితంగానే చేస్తామని ప్రకటించారు. ఐసీడీఎస్ పథకంలో భాగంగా అంగన్వాడీ కేంద్రం నుంచి ఒకటో తరగతిలో చేరనున్న ఇద్దరు బాలికలకు తగిన పత్రాలను ఇచ్చారు. మచిలీపట్నం దగ్గర్లోని ఘంటసాల శివారు దేవరకోటలో ముత్యాలమ్మ తల్లి దేవాలయానికి మహేశ్‌బాబు అందించిన సహకారానికి కృతజ్ఞతగా ఆ గ్రామస్తులు తీసుకొచ్చిన చిత్రపటాన్ని ఆవిష్కరించారు. ఆదర్శగ్రామంగా బుర్రిపాలెం... గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ మాట్లాడుతూ, చిత్తూరులో తమ తల్లిదండ్రుల ఊర్లను దత్తత తీసుకొని అభివృద్ధి చేశామని చెప్పారు. తన అత్తగారి ఊరయిన బుర్రిపాలెంను దత్తత తీసుకొని అభివృద్ధి చేయాలని సంకల్పించినపుడు, ప్రధానమంత్రి గ్రామయోజన పథకంలో నిబంధనతో వీలు కాలేదన్నారు. ఫలితంగానే తన భార్య పద్మావతి, మహేష్‌బాబుకు చెరొక గ్రామం దత్తత తీసుకోవాలని సూచించినట్టు తెలిపారు. రోడ్లు, డ్రెయిన్లు, కమ్యూనిటీ హాలు, పైపులైను, అదనపు తరగతి గదులు నిర్మించి గ్రామాన్ని ఒక మోడల్‌గా తీర్చిదిద్దుతామని చెప్పారు. ప్రముఖ నిర్మాత, హీరో కృష్ణ సోదరుడు జి.ఆదిశేషగిరిరావు మాట్లాడుతూ, మహేష్, ఎంపీ జయదేవ్‌లు గ్రామాభివృద్ధికి చేస్తున్న ప్రయత్నాలను స్వాగతిస్తున్నట్టు చెప్పా రు. గ్రామాన్ని బాగు చేస్తారని ఆశిస్తున్నానని అన్నారు. మహేశ్, జయదేవ్‌ల చొరవతో బుర్రిపాలెం రాష్ట్రంలో ఒక ఆదర్శ గ్రామంగా రూపొందగలదన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. మహేశ్‌బాబు చేపట్టిన దత్తత కార్యక్రమం మరెం దరికో స్ఫూర్తి కాగలదన్నారు. తెనాలి ఆర్డీవో జి.నర్సిం హులు, ఎంపీపీ ఎస్.వెంకట్రావు, తహశీల్దారు జీవీ సుబ్బారెడ్డి, ఎంపీడీవో శ్రీనివాసరావు, టీడీపీ నాయకులు అమిరినేని రాజా, సౌపాటి కిరణ్, బుర్రిపాలెం గ్రామస్తులు పాల్గొన్నారు. -
శ్రీమంతుడిపై విశ్వనాయకుడు ప్రశంసలు
తమిళసినిమా : ఒక నటుడి నటనను మరో నటుడు అభినందించడానికి చాలా పెద్ద మనసు కావాలి. అలా ప్రశంసించే ఉన్నత వ్యక్తిత్వం విశ్వనాయకుడు కమలహాసన్‌కు, ఆ అర్హత ప్రిన్స్ మహేశ్‌బాబుకు మెండుగా ఉన్నాయి. అందుకే ఈ వార్త ప్రాధాన్యత సంతరించుకుంది. వివరాల్లోకెళితే టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్‌బాబు నటించిన తాజా చిత్రం శ్రీమంతుడు ఈ నెల 7న ప్రపంచవ్యాప్తంగా విడుదలై విజయ విహారం చేస్తున్న విషయం తెలిసిందే. మంచి కథ, కథనం, దర్శకత్వం, విలువలతో కూడిన నిర్మాణం, నటీనటుల ఉత్తమ నటన, చక్కని సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందిన చిత్రం శ్రీమంతుడు అంటూ సర్వత్రా అభినందనలు అందుకుంటున్న నేపథ్యంలో నటుడు కమలహాసన్ ప్రశంసలు చిత్ర యూనిట్ రెట్టింపు సంతోషానికి గురి చేశాయి. ఇందులో కథానాయికిగా శ్రుతీహాసన్ నటించారన్నది తెలిసిన విషయమే. శ్రీమంతుడు చిత్రాన్ని ఆమె ఇటీవల తన తండ్రి కమల్‌కు చూపించారు. చిత్రం చూసిన కమలహాసన్ మహేశ్‌బాబు నటన, డాన్స్‌లపై ప్రశంసల వర్షం కురిపించారు. శ్రుతి డాన్స్‌ను అభినందిం చారు. సామాజిక సృహ ఉన్న కథాంశంతో రూపొందించిన దర్శకుడిని, నిర్మాతను అభినందించారు. ఇది తెలిసిన మహేశ్‌బాబు ఇంకా ఖుషీ అవుతున్నారట. కాగా, శ్రీమంతుడు చిత్రం ప్రపంచవ్యాప్తంగా తొలి వారానికి 101.25 కోట్లు వసూలు చేసి వంద కోట్ల క్లబ్లో చేరినట్లు ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసిన ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ అధినేత వెల్లడించారు. -
ఘనంగా ‘శ్రీమంతుడు’ సక్సెస్ వేడుకలు
కాచిగూడ: ప్రిన్స్ మహేష్‌బాబు జన్మదినం, శ్రీమంతుడు సినిమా సక్సెస్ సందర్భంగా ఆదివారం ఆల్ ఇండియా సూపర్ స్టార్ కృష్ణ మహేష్ సేన ఆధ్వర్యంలో సంధ్య థియేటర్లో కేక్ కట్‌చేసి వేడుకలు జరుపుకున్నారు. కార్యక్రమంలో సూపర్‌స్టార్ కృష్ణ మహేష్ సేన జాతీయ అధ్యక్షుడు, జీహెచ్ఎంసీ మాజీ ఫ్లోర్ లీడర్ దిడ్డి రాంబాబు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో కృష్ణ, మహేష్‌బాబు అభిమానులు మధు, బ్యాంకు రాజు, రాజారెడ్డి, మహేందర్‌గౌడ్, శ్రీనివాస్ గౌడ్, బిఆర్ రవి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.