ఇంటర్నెట్ ఆధారిత లైవ్ టీవీ, ఆన్ డిమాండ్ సేవలు అందిస్తున్న యప్ టీవీ నూతన ప్రచార కర్తగా మహేష్ బాబు నియమితులయ్యారు. రెండేళ్లపాటు కంపెనీకి ఆయన బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తారు. మహేష్ రాక ప్రపంచవ్యాప్తంగా మరింత మంది వీక్షకులను చేరుకునేందుకు దోహదం చేస్తుందని యప్ టీవీ ఫౌండర్ ఉదయ్ రెడ్డి సోమవారమిక్కడ మీడియాకు తెలిపారు. ‘పే పర్ వ్యూ’ సేవలను 2017లో భారత్‌లో పరిచయం చేస్తామన్నారు. విడుదలైన నాల్గవ వారం తర్వాత కొత్త సినిమాలను యప్ టీవీలో నిక్షిప్తం చేస్తారు. చందా చెల్లించడం ద్వారా ఆ సినిమాను వినియోగదార్లు వీక్షించొచ్చు. పైరసీని అరికట ్టడంలో పే పర్ వ్యూ దోహదం చేస్తుందని ఈ సందర్భంగా మహేష్ బాబు వ్యాఖ్యానించారు. పే పర్ వ్యూ సర్వీసును యూఎస్‌లో కంపెనీ అందిస్తోంది.