సాక్షి, న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో ప్రముఖ సంస్థకు ప్రచారకర్తగా నియమితుడయ్యారు. క్యాబ్ ఆపరేటర్ ఉబెర్ ఇండియాకు బ్రాండ్ అంబాసిడర్‌గా బాధ్యతలు స్వీకరించారు . ఈ మేరకు టీమిండియా కెప్టెన్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఉబెర్ ఇండియాతో కొత్త సక్సెస్‌ఫుల్ ఇన్సింగ్స్ కోసం సిద్ధంగా ఉన్నానంటూ ట్వీట్ చేశారు.
ఉబెర్‌తో భాగస్వామ్యం పట్ల సంతోషం వ్యక్తం చేసిన కోహ్లీ మాట్లాడుతూ ఓ క్రికెటర్‌గా నేను చాలా ప్రదేశాల్లో పర్యటించాననీ ఉబెర్‌లో తన మొదటి అనుభవం ఇంకా గుర్తుందని తెలిపారు. ఉబెర్ క్యాబ్ ద్వారా తనకు మంచి అనుభూతి ఉందని తెలిపారు. అధునాతన టెక్నాలజీని ఉపయోగించి ప్రజలు వివిధ ప్రాంతాలకు వెళ్లేలా ఒక విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి, ఆర్థిక అవకాశాలను సృష్టించడం ద్వారా లక్షలాది మందికి సాధికారికత కల్పించడం గొప్పవిషయమని పేర్కొన్నారు. తమకు భారత్ కీలకమైన మార్కెట్‌గా ఉన్ననేపథ్యంలో ఇండియాలో ఉబెర్ పెట్టుబడుల ప్రవాహం ఇకపై కూడా కొనసాగుతుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. కాగా ప్రస్తుతం క్రికెట్‌కు దూరంగా ఉండి విశ్రాంతి తీసుకుంటున్న విరాట్ కోహ్లీ ఇప్పటికే పలు దేశీయ, అంతర్జాతీయ కంపెనీల బ్రాండ్లు, ఉత్పత్తులకు బ్రాండ్ అండాసిడర్‌గా ఉన్నసంగతి తెలిసిందే.
Looking forward to a successful innings with @Uber_India. Stoked to #TakeABackseat and here's why! #UberIndia pic.twitter.com/fLwCz5eJ25
— Virat Kohli (@imVkohli) March 9, 2018
Comments
Please login to add a commentAdd a comment