క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న టీ20 వరల్డ్‌కప్-2024కు మరో ఐదు వారాల్లో తెరలేవనుంది. జూన్ 1 నుంచి అమెరికా, వెస్టిండీస్‌ల వేదికగా ఈ మెగా టోర్నీ ఆరంభం కానుంది. కాగా ఈ మెగా ఈవెంట్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా టీమిండియా లెజెండ్ యువరాజ్ సింగ్ ఎంపికైన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో ఇటీవలే మియామీ గ్రాండ్ ప్రిక్స్‌లో సందడి చేసిన యువరాజ్.. వరల్డ్‌కప్ ట్రోఫితో ఫోటోలకు ఫోజులిచ్చాడు. రేసింగ్ ట్రాక్‌పై వరల్డ్‌కప్ ట్రోఫితో యువీ ఫోటోలు దిగాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలను యువరాజ్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశాడు.
ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. కాగా 2007లో జరిగిన మొదటి టీ20 ప్రపంచకప్‌లో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించిన యువీ.. టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు.
ఈ టోర్నీలోనే ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో స్టువార్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో యువరాజ్ ఆరు బంతులకు ఆరు సిక్సర్లు బాదాడు. ఇప్పటికి టీ20 వరల్డ్‌కప్ అంటే యువరాజ్ సింగ్ కోసం ప్రతీ ఒక్కరూ చర్చించుకుంటున్నారు.
ఈ నేపథ్యంలోనే యువీని ఐసీసీ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది. యువీ.. ఉసెన్ బోల్ట్‌తో కలిసి ప్రపంచవ్యాప్తంగా నిర్వహించే వరల్డ్‌కప్ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొననున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment