శాసనమండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్‌అలీ
సాక్షి, హైదరాబాద్: చేనేతకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఆంధ్రావాళ్ల కోడలు తప్ప తెలంగాణ వాళ్లు పనికిరారా అని శాసనమండలిలో ప్రతి పక్షనేత షబ్బీర్‌అలీ ప్రశ్నించారు. అసెంబ్లీ ఆవరణలో మంగళవారం ఆయన విలేకరు లతో మాట్లాడుతూ, చేనేతకు బ్రాండ్ అంబా సిడర్‌గా ఆంధ్రాకు చెందిన సినీనటుడు, ఎన్ కన్వెన్షన్‌లో భూమిని కబ్జా చేసిన అక్కినేని నాగార్జున కోడలిని నియమించడం వెనుక ఉన్న రహస్యం ఏమిటని ప్రశ్నించారు. చేనేత కు ప్రచారం చేయడానికి తెలంగాణ బిడ్డలు పనికిరారా అని ప్రశ్నించారు. నాగార్జునతో భూమికి సంబంధించిన అక్రమ లావాదేవీల తోనే సమంతను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించారని ఆరోపించారు.
మంత్రి కేటీఆర్ రాజకీయాల్లో ఒక బచ్చా అని, కాం గ్రెస్ పార్టీ చరిత్ర ఏమిటో ఆయన తండ్రి, సీఎం కేసీఆర్‌ను అడిగి తెలుసుకోవాలని సూచించారు. కేసీఆర్‌కు రాజకీయభిక్ష పెట్టిన పార్టీ కాంగ్రెస్ అన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా, వట్టి మాటలతో కాలం వెళ్లదీస్తున్న విషయాన్ని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారన్నారు. రాష్ట్రంలో వైద్య, ఆరోగ్య పరిస్థితులపై కేసీఆర్ నిర్ల క్ష్యం వహిస్తున్నారని అన్నారు. టీఆర్‌ఎస్ అధి కారంలోకి వచ్చిన తర్వాత ఆరోగ్య శాఖకు, ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణ, మెరుగు దల కోసం పెట్టిన ఖర్చు, ప్రభుత్వ ఆసుప త్రుల్లో ప్రస్తుత పరిస్థితి తదితరాలపై శ్వేత పత్రం విడుదల చేయాలన్నారు.
అధికారిక లెక్కల ప్రకారమే 30 మంది ఖమ్మంలో డెంగీ జ్వరంతో చనిపోయారని చెప్పారు. సరోజినీ దేవీ ఆసుపత్రిలో ఐదుగురు రోగులు కేటరాక్ట్ ఆపరేషన్‌కు వస్తే, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల శాశ్వతంగా కళ్లు కోల్పోయారని విమర్శించా రు. నిలోఫర్, గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల్లో జరుగుతున్న ఘోరాల గురించి నిత్యం మీడియాలో వస్తున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదన్నారు. ప్రభుత్వ పర్యవేక్షణ, చిత్తశుద్ధి లేకపోవడం వల్లనే ఆరోగ్య శాఖకే పెద్ద రోగం వచ్చిందన్నారు. అసెంబ్లీలో ఇచ్చిన హామీ ప్రకారం మణికొండ జాగీరులోని వక్ఫ్ భూమిపై తగిన చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్‌కు లేఖ రాసినట్టుగా షబ్బీర్ వెల్లడించారు.