‘సమంతను ఎందుకు నియమించారు’
‘సమంతను ఎందుకు నియమించారు’
Published Tue, Feb 14 2017 4:06 PM | Last Updated on Fri, Aug 30 2019 8:24 PM
- మంత్రి కేటీఆర్‌పై షబ్బీర్ ఫైర్
హైదరాబాద్: తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ రాజకీయాల్లో ఓ బచ్చా అని కాంగ్రెస్ శాసన మండలి సభ్యుడు షబ్బీర్ అలీ ఎద్దేవా చేశారు. విలేకరులతో మాట్లాడుతూ..కాంగ్రెస్ నేతల వీపులు పగలడం కాదు.. వచ్చే ఎన్నికల్లో మిమ్మల్ని చెప్పులతో కొట్టడం ఖాయమని ఆరోపించారు. కాంగ్రెస్ చరిత్ర ఏమిటో మీ నాన్నను అడుగు.. మీ నాన్నకు రాజకీయ భిక్ష పెట్టింది కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. చేనేతకు బ్రాండ్ అంబాసిడర్ గా సమంతను నియమించడం వెనుక మతలబు ఏమిటని ప్రశ్నించారు. చేనేత వస్త్రాల ప్రచారానికి తెలంగాణ బిడ్డలు పనికిరారా అని నిలదీశారు. నాగార్జునతో ఉన్న లావాదేవీలతోనే సమంతకు చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా నియమించారని ఆరోపణలు సంధించారు.
రాష్ట్రంలో వైద్యం పడకేసిందని, ఈ విషయం సీఎం కు పట్టడం లేదని అన్నారు. తక్షణం రాష్ట్రంలో హెల్త్ ఏమర్జెన్సీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ లో ఇచ్చిన హామీ ప్రకారం వక్ఫ్ బోర్డు కు ఇస్తానన్న 8 వందల ఎకరాల ల్యాండ్ పై సుప్రీం కోర్ట్ కు స్పష్టత ఇవ్వాలని సీఎం కు లేఖ రాసినట్టు తెలిపారు.
Advertisement
Advertisement