హానర్ హోమ్స్ ‘రిచ్‌మాంట్’ ఆవిష్కరణ కార్యక్రమంలో హానర్ హోమ్స్ సహవ్యవస్థాపకులు, డైరెక్టర్లు ఎం. బాలు చౌదరి, పి. వెంకటేశ్వర్లు, వై. స్వప్న కుమార్, ఎస్. రాజమౌళిలతో సినీ నటుడు అల్లు అర్జున్
హైదరాబాద్: ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ హానర్ హోమ్స్ తాజాగా తమ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రముఖ నటుడు అల్లు అర్జున్‌ను నియమించుకుంది. కొత్తగా ’రిచ్‌మాంట్’ ప్రాజెక్టును ఆవిష్కరించిన సందర్భంగా సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ విషయం వెల్లడించింది.
ఏడేళ్ల క్రితం హానర్ ప్రస్థానం ప్రారంభమైందని, ఇది తమకు మూడో ప్రాజెక్టని ఈ సందర్భంగా సంస్థ సహ వ్యవస్థాపకుడు, ప్రమోటర్ ఎం బాలు చౌదరి తెలిపారు. హానర్ ప్రచారకర్తగా నియమితులు కావడంపై అల్లు అర్జున్ హర్షం వ్యక్తం చేశారు. ఆయన తమతో జట్టు కట్టడం సంతోషకరమని సంస్థ ఎండీ వై స్వప్న కుమార్ పేర్కొన్నారు. దాదాపు 28.4 ఎకరాల విస్తీర్ణంలో తలపెట్టిన ఈ ప్రాజెక్టులో అధునాతన సదుపాయాలతో 142 ఫ్లాట్లు ఉంటాయని సంస్థ వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment