
టాటా మోటార్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా అక్షయ్ కుమార్
‘టాటా మోటార్స్’ తాజాగా తన వాణిజ్య వాహనాలకు (కమర్షియల్ వెహికల్స్) బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకుంది...
న్యూఢిల్లీ: దేశీ దిగ్గజ వాహన తయారీ కంపెనీ ‘టాటా మోటార్స్’ తాజాగా తన వాణిజ్య వాహనాలకు (కమర్షియల్ వెహికల్స్) బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకుంది. ఈ మేరకు అక్షయ్ కుమార్ టాటా మోటార్స్ వాణిజ్య వాహనాలకు సంబంధించిన మల్టీమీడియా ప్రచార కార్యక్రమంలో కనిపిస్తారు. ఇది వచ్చే ఏడాది తొలివారంలో ప్రచురితం కానుంది. ప్రొడక్టŠస్ వరకు మాత్రమే కాకుండా కంపెనీ చేపట్టే ఇన్నోవేటివ్ మార్కెటింగ్, కస్టమర్ ఎక్స్‌పీరియన్స్ వంటి కార్యక్రమాల్లో కూడా అక్షయ్ కుమార్ పాల్గొంటారని టాటా మోటార్స్ తెలిపింది. టాటా మోటార్స్ వాణిజ్య వాహనాలకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించడాన్ని గౌరవంగా భావిస్తున్నానని అక్షయ్ కుమార్ తెలిపారు.