గత ఏడాది ఆటో మొబైల్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన టాటా మోటార్స్ కు చెందిన ఎలక్ట్రిక్ వాహనం నెక్సన్, మైక్రో ఎస్యూవీ భారత కార్ల మార్కెట్లను శాసిస్తున్నాయి. ఎస్యూవీ కార్లలో పంచ్ తక్కువ ధరకే రావడంతో వాహనదారులు ఎగబడుతునారు. గత ఏడాది జనవరిలో కంటే ఈ ఏడాది జనవరిలో అమ్మకాల్లో ఈ రెండు కార్లు దుమ్మురేపాయి.
టాటా మోటార్స్ గత ఏడాది ఆవిష్కరించిన రెండు ఎస్యూవీ విజయవంతంగా నిలుస్తునాయి. 2022 మొదటి నెలలోనే అద్భుతమైన వృద్ధిని కంపనీ సాధించింది. టాటా నెక్సాన్ కాంపాక్ట్ SUV జనవరి 2022లో 13,816 యూనిట్లను విక్రయించగా, టాటా పంచ్ సబ్-కాంపాక్ట్ SUV గత నెలలో 10,027 యూనిట్లను విక్రయించింది. ఇక నెక్సాన్ గత నెలలో దేశంలో అత్యధికంగా అమ్ముడైన suv గా నిలుస్తోంది.
నాలుగో ఎస్యూవీ
ఈ ఏడాది జనవరిలో భారత్లో అత్యధికంగా అమ్ముడవుతున్న టాప్ 10 ప్యాసింజర్ వాహనాల్లో నెక్సాన్ నాల్గవ స్థానాన్ని కైవసం చేసుకోగా, టాటా పంచ్ కూడా ప్రారంభించిన ఐదు నెలల్లో టాప్ జాబితాలోకి ప్రవేశించింది. ఈ రెండు Tata SUVల అమ్మకాల విజయం కారణంగా, స్వదేశీ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ మొత్తం అమ్మకాలలో సంవత్సరానికి గత ఏడాది జనవరితో పోల్చితే 27 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఆటోమేకర్ గత నెలలో అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతితో కలిపి మొత్తం 76,210 యూనిట్లను విక్రయించింది.
ప్రభావం చూపని ధరల పెంపు...!
టాటా మోటార్స్ తన కాంపాక్ట్ SUV నెక్సాన్ ధరను గత ఏడాది నవంబర్‌లో రూ.11,000 వరకు పెంచినట్లు ప్రకటించింది. దీంతో ప్రస్తుతం రు.7.30 లక్షల నుంచి రూ. 13.35 లక్షల మధ్య అందుబాటులో ఉంది (ఎక్స్-షోరూమ్). ఇక టాటా మోటార్స్ పంచ్ సబ్-కాంపాక్ట్ SUV ధరను కూడా పెంచగా... ధరల పెరుగుదల ప్రభావం కార్ల అమ్మకాలను ఎలాంటి ప్రభావం చూపలేదు.
Comments
Please login to add a commentAdd a comment