Hyundai Alcazar SUV Launched In India: Price, Features In Telugu - Sakshi
Sakshi News home page

హ్యుందాయ్ సరికొత్త ఎస్‌యూవీ‘ అల్కజార్’

Published Fri, Jun 18 2021 5:04 PM | Last Updated on Fri, Jun 18 2021 6:01 PM

 Hyundai Alcazar SUV launched in India: Price,features - Sakshi

సాక్షి,న్యూఢిల్లీ: ప్రముఖ కార్ల తయారీదారు హ్యుందాయ్ సరికొత్త అల్కజార్ మోడల్ కారును  భారత మార్కెట్లో విడుదల చేసింది. ప్రెస్టీజ్, ప్రీమియం, సిగ్నేచర్ వేరియంట్లలో  భారతీయ యూజర్లకు అందుబాటులోకి వస్తుంది. ఈ అల్కజార్ పెట్రోల్, డీజిల్ ఇంజిన్లలో లభించనుంది.  ప్రారంభ ధర రూ.16.3లక్షలు కాగా, హై ఎండ్ మోడల్ రూ.20 లక్షలుఎక్స్ షోరూం)గా ఉండనుంది.  ఫీచర్ల ఆధారంగా మొత్తం 14 వేర్వేరు వేరియంట్లలో ఇది అందుబాటులోఉంటుంది. హ్యుందాయ్ భారత మార్కెట్లో 25 వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ‘అల్కాజార్’ తో ఎస్‌యూవీ విభాగంలోకి ప్రవేశిస్తోంది. 25వేల రూపాయలనుచెల్లించి ప్రీ బుకింగ్‌ చేసుకోవచ్చు

కొత్త అల్కాజార్  డీజిల్ వేరియంట్ ధర 16.53 లక్షలు (ఎక్స్-షోరూమ్) ,పెట్రోలు వేరియంట్ ధర 16.30లక్షలు (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభం.  అల్కజార్ పెట్రోల్ వెర్షన్ లీటరుకు 14.5 కిమీ, డీజిల్ వెర్షన్ లీటరుకు 20.4 కిమీ మైలేజీ ఇస్తుంది.  2.0-లీటర్ పెట్రోల్ ఎంపిఐ ఇంజన్ 9.5 సెకన్లలో గంటకు 100 కిమీ వేగం అందుకుంటుందని  కంపెనీ పేర్కొంది. ఇస్తుందని హ్యుందాయ్ వెల్లడించింది. 6 స్పీడ్ మాన్యువల్, 6 స్పీడ్ ఆటోమేటిక్ (ఆప్షనల్) ట్రాన్స్ మిషన్ లతో లభ్యమవుతాయి. హ్యుందాయ్ అల్కజార్ ఎస్‌యూవీ  ప్రధానంగా  టాటా సఫారీ, మహీంద్రా ఎక్స్ యూవీ-700, ఎంజీ హెక్టర్ ప్లస్ లకు గట్టి పోటీగా నిలవనుందని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. హ్యుందాయ్ 10.25-అంగుళాల మల్టీ డిస్‌ప్లే డిజిటల్ క్లస్టర్,  ఆండ్రాయిడ్ ఆటో,  ఆపిల్ కార్‌ ప్లే  బోస్ సౌండ్ సిస్టమ్ (8 స్పీకర్లు),ఏక్యూఐ డిస్ప్లేతో ఆటో హెల్తీ ఎయిర్ ప్యూరిఫైయర్, వాయిస్-ఎనేబుల్డ్ స్మార్ట్  పనోరమిక్ సన్‌రూఫ్, టంబుల్ సీట్లు (కెప్టెన్ & 60:40 స్ప్లిట్ సీట్లు), డ్రైవ్ మోడ్ సెలెక్ట్ (కంఫర్ట్ | ఎకో | స్పోర్ట్), ట్రాక్షన్ కంట్రోల్ మోడ్‌లు (మంచు | ఇసుక | మట్టి ), ప్రధాన ఆకర్షణలు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement