
ముంబై: జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్‌ఆర్) ఇండియా తాజాగా ఎస్‌యూవీలు రేంజ్ రోవర్ స్పోర్ట్, రేంజ్ రోవర్‌లలో అదనపు ఫీచర్లతో కొత్త వేరియంట్లను మార్కెట్లోకి తెచ్చింది. ప్రస్తుత మోడళ్ల ధరలోనే ఈ కొత్త వేరియంట్లు కూడా అందుబాటులో ఉంటాయి.
రేంజ్ రోవర్ స్పోర్ట్ డీజిల్ వేరియంట్ల ధర రూ.99.48– రూ.143 లక్షల శ్రేణిలో, పెట్రోల్ వేరియంట్ల ధర రూ. 110.03–రూ. 196.75 లక్షల శ్రేణిలో ఉంది. అలాగే కంపెనీ తన రేంజ్ రోవర్ డీజిల్ వేరియంట్ల ధరను రూ.174.29– రూ.376.61 లక్షల శ్రేణిలో, పెట్రోల్ వేరియంట్ల ధరను రూ.187.16– రూ.388.16 లక్షల శ్రేణిలో నిర్ణయించింది. రేంజ్ రోవర్, రేంజ్ రోవర్ స్పోర్ట్ 2018 మోడళ్లలో ఎలక్ట్రానిక్ ఎయిర్ సస్పెన్సన్, ట్విన్–స్పీడ్ ట్రాన్స్‌ఫర్ బాక్స్ వంటి ప్రత్యేకతలున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment