
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం క్రిష్ డైరెక్షన్‌లో హరిహార వీరమల్లు సినిమాలలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌ను జరుపుకుంటోంది. దీనితో పాటు అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ మూవీకి కూడా పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా తాజాగా పవన్ ఓ లగ్జరీ కారు బుక్ చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. రేంజ్ రోవర్ ఎస్‌యూవీ 3.0 మోడల్ కారును బుక్ చేసినట్లు తెలుస్తోంది. దీని ఖరీదు రూ. 4 కోట్ల రూపాయలు ఉంటుందని టాక్.
కాగా కొద్దిమంది సెలబ్రెటీల దగ్గర మాత్రమే ఉండే ఈ రేంజ్‌రోవర్ కారు దేశంలోనే అంత్యంత విలువైనది. 4 కోట్ల రూపాయలు విలువ చేసే ఈ రేంజ్ రోవర్ ఆటో బయోగ్రఫీ మోడల్‌ను పవన్ తన పేరు మీద బుక్ చేసినట్లు తెలుస్తోంది. ఎప్పుడు సింపుల్‌గా ఉండే పవన్ ఇంతటి విలువైన కారును కొనుగోలు చేయడంతో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. కాగా పవన్ ప్రస్తుతం ఇటూ సినిమాలు అటూ రాజకీయాలతో బిజీగా ఉన్న నేపథ్యంలో దూర ప్రయణాలకు సౌకర్యంగా ఉంటుందనే ఉద్దేశంతో ఖరీదైన కారును కొనుగోలు చేస్తున్నారని ఆయన అభిమానులు చర్చించుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment