దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా ఆయా ఎస్‌యూవీ మోడళ్లపై భారీ తగ్గింపును ప్రకటించింది. ఆయా మోడళ్లపై సుమారు రూ. 82 వేల వరకు కార్పోరేట్ డిస్కౌంట్, క్యాష్ డిస్కౌంట్, ఎక్సేచేంజ్ బోనస్‌ను కొనుగోలుదారులకు అందించనుంది. ఈ ఆఫర్ 2022 జనవరి 31 వరకు అందుబాటులో ఉండనుంది. అల్టురాస్, స్కార్పియో, మొరాజో, ఎక్స్‌యూవీ300, మహీంద్రా కేయూవీ100 ఎన్‌ఎక్స్‌టీ, వాహనాలపై ఈ తగ్గింపు వర్తించనుంది.
మహీంద్రా ఆయా మోడల్స్‌పై అందిస్తోన్న ఆఫర్స్..!
మహీంద్రా Alturas SUV
మహీంద్రా అల్టురాస్ ఎస్‌యూవీపై గరిష్టంగా రూ. 81, 500 వరకు క్యాష్ బెనిఫిట్స్ కొనుగోలుదారులకు లభించనున్నాయి. ఇందులో ఎక్సేచేంజ్‌బోనస్ రూ. 50,000 వరకు, కార్పోరేట్ ఆఫర్ రూ. 11, 500, సుమారు రూ. 20 వేల వరకు అదనపు డిస్కౌంట్లను పొందవచ్చును.
మహీంద్రా కేయూవీ100 నెక్స్‌ట్
మహీంద్రా కేయూవీ100 నెక్స్‌ట్‌పై గరిష్టంగా రూ. 61, 055 వరకు క్యాష్ బెనిఫిట్స్ కొనుగోలుదారులకు లభించనున్నాయి. ఇందులో ఎక్సేచేంజ్‌బోనస్ రూ.20,000 వరకు, కార్పోరేట్ డిస్కౌంట్ రూ. 3, 000, క్యాష్ డిస్కౌంట్ రూ. 38, 055 కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనుంది.
మహీంద్రా స్కార్పియో
మహీంద్రా స్కార్పియోపై గరిష్టంగా రూ. 29, 000 వరకు క్యాష్ బెనిఫిట్స్ కొనుగోలుదారులకు లభించనున్నాయి. ఇందులో ఎక్సేచేంజ్‌ఆఫర్ రూ.10,000 వరకు, కార్పోరేట్ ఆఫర్ రూ. 4, 000, సుమారు రూ. 15 వేల వరకు ఇతర ప్రయోజనాలు కొనుగోలుదారులకు లభిస్తాయి.
మహీంద్రా మొరాజో
మహీంద్రా మొరాజో గరిష్టంగా రూ. 40,200 వరకు క్యాష్ బెనిఫిట్స్ కొనుగోలుదారులకు లభించనున్నాయి. ఇందులో ఎక్సేచేంజ్‌ఆఫర్ రూ.15,000 వరకు, కార్పోరేట్ ఆఫర్ రూ. 5,200,క్యాష్ బెనిఫిట్ రూ. 20, 000 కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనుంది.
మహీంద్రా ఎక్స్‌యూవీ300
మహీంద్రా ఎక్స్‌యూవీ300 గరిష్టంగా రూ. 69, 002 వరకు క్యాష్ బెనిఫిట్స్ కొనుగోలుదారులకు లభించనున్నాయి. ఇందులో ఎక్సేచేంజ్‌ఆఫర్ రూ.25,000 వరకు, కార్పోరేట్ డిస్కౌంట్ రూ. 4, 500, క్యాష్ బెనిఫిట్స్ రూ. 30,002 వరకు అందబాటులో ఉండనున్నాయి.
► వీటితోపాటుగా మహీంద్రా బోలెరో ఎస్‌యూవీ కొనుగోలుపై రూ. 13,000; సబ్‌కాంపాక్ట్ ఎస్‌యూవీపై రూ. 10, 000 వరకు క్యాష్ బెనిఫిట్స్‌ను అందిస్తోంది.
చదవండి: న్యూ ఇయర్ ఆఫర్: హోండా కార్లపై భారీ తగ్గింపు..!
Comments
Please login to add a commentAdd a comment