Top 5 Most Searched SUVs On Google In India In 2021, Details Inside - Sakshi
Sakshi News home page

Most Searched SUVs: 2021లో తెగ వెతికిన టాప్-5 ఎస్‌యువీ కార్లు ఇవే..!

Published Sun, Dec 26 2021 3:07 PM | Last Updated on Sun, Dec 26 2021 4:11 PM

Top Five Most Searched SUVs on Google in 2021 - Sakshi

2020తో పోలిస్తే 2021లో కార్ల అమ్మకాలు పెరిగినప్పటికీ ఆశించినంత మేర కొనుగోళ్లు జరగలేదు. దీనికి ప్రధాన కారణం సెమీకండక్టర్ కొరత. ఈ కొరత వల్ల ఆటో పరిశ్రమ 2021లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. ఈ సమస్యల్లో చిన్న ఊరట ఏంటి అంటే? కంపెనీల కార్ల కొనుగోళ్లలో ఎస్‌యువీ కార్ల అమ్మకాలు ఎక్కువగా జరిగినట్లు ఒక నివేదిక తెలిపింది. ఎస్‌యువీ కార్లకు డిమాండ్ కొత్త కార్ల అమ్మకాలలో మాత్రమే కాదు, ప్రీ-ఓన్డ్ కార్ల అమ్మకాలలో కూడా ఉన్నట్లు తేలింది. అయితే, ఈ ఎస్‌యువీ కార్ల కోసం వినియోగదారులు నెట్టింట్లో తెగ వెతికేశారు. ఎక్కువగా వెతికిన కార్లలో కింద పేర్కొన్న కార్లు టాప్-5 స్థానంలో నిలిచాయి. 

కియా సెల్టోస్
ప్రముఖ దక్షిణ కొరియా కార్ల సంస్థ కియా నుంచి వచ్చిన కియా సెల్టోస్ గురుంచి 2021లో గూగుల్ సర్చ్‌లో నెలకు సగటున 8 లక్షల 20 వేల మంది ఈ కారు గురుంచి వెతికారు. భారతీయ మార్కెట్లో ఈ కంపెనీ విడుదల చేసిన మొదటి కారు ఇది. దీనిని 2019లో విడుదల చేశారు. ప్రస్తుతం దేశంలో మొత్తం నాలుగు మోడల్స్  విక్రయిస్తున్నారు. కియా సెల్టోస్ మూడు ఇంజిన్లలో వస్తుంది. కియా సెల్టోస్ ప్రారంభ ధర ₹9.95 లక్షల(ఎక్స్ షోరూమ్)కు విక్రయిస్తున్నారు.

మహీంద్రా థార్
ఈ ఏడాది గూగుల్ సర్చ్‌లో నెలకు సగటున 6.7 లక్షల మంది మహీంద్రా థార్ రెండో ఎస్‌యువీ కారు సర్చ్ చేశారు. ఈ మహీంద్రా థార్ ఎస్‌యువీలో రెండు ఇంజిన్ ఆప్షన్ లు ఉన్నాయి. 2.0-లీటర్ ఎమ్ స్టాలియన్ 150 టిజిడిఐ పెట్రోల్ ఇంజిన్, రెండో ఆప్షన్ 2.2-లీటర్ ఎమ్ హాక్ 130 డీజిల్ ఇంజిన్. మహీంద్రా థార్ బేస్ వేరియంట్ ధర ₹12.78 లక్షల(ఎక్స్ షోరూమ్)తో ప్రారంభమవుతుంది. 

టాటా నెక్సన్
టాటా నెక్సన్ 2021లో ఎస్‌యువీల కోసం గూగుల్లో ఎక్కువగా సర్చ్ చేసిన వాటిలో మూడవ స్థానంలో నిలిచింది. ఈ కాంపాక్ట్ ఎస్‌యువీ భద్రత పరంగా గ్లోబల్ ఎన్‌సిఎపి టెస్టులో 5 స్టార్ రేటింగ్ పొందింది. ఈ ఎస్‌యువీ రెండు ఇంజిన్ లతో వస్తుంది. 1.2-లీటర్ టర్బోఛార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్, మరో 1.5-లీటర్ టర్బోఛార్జ్డ్ డీజిల్ ఇంజిన్ తో వస్తుంది. టాటా నెక్సన్ ₹7.29 లక్షల(ఎక్స్షోరూమ్) ప్రారంభ ధరకు లభిస్తుంది.

కియా సోనెట్
2021లో గూగుల్‌లో ఎక్కువగా వెతికిన ఎస్‌యువీల పరంగా చూస్తే కియాకు చెందిన సోనెట్ 4వ స్థానంలో నిలిచింది. ఈ ఫేస్ లిఫ్ట్ మోడల్ ఈ ఏడాది ప్రారంభంలో సెల్టోస్ కాంపాక్ట్ ఎస్‌యువీతో పాటు అమ్మకానికి వచ్చింది. ఈ కియా సోనెట్ ప్రారంభ ధర ₹6.89 లక్షలు(ఎక్స్ షోరూమ్).

టాటా పంచ్
2021లో గూగుల్‌లో ఎక్కువగా వెతికిన ఎస్‌యువీల పరంగా చూస్తే కియాకు చెందిన సోనెట్ 5వ స్థానంలో ఉంది. టాటా పంచ్ ఇతర టాటా కార్ల కంటే ఎక్కువ బుకింగ్స్  సంపాదించింది. టాటా పంచ్ 1.2-లీటర్ రీవోట్రాన్ పెట్రోల్ ఇంజిన్ తో పనిచేస్తుంది. టాటా పంచ్ ₹5.48 లక్షల(ఎక్స్ షోరూమ్) ధరకు లభ్యం అవుతుంది.

(చదవండి: ఐఫోన్‌లలో అదిరిపోయే ఫీచర్‌, సిమ్‌కార్డ్‌తో పనిలేకుండా..!)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement