సాక్షి, న్యూఢిల్లీ : ఈనెలలో భారత్‌లో లాంఛ్ కానున్న ఆల్ న్యూ హ్యుందాయ్ క్రెటా ఇంటీరియర్స్‌ను కంపెనీ వెల్లడించింది. మరో వారంలో లాంచింగ్‌కు సిద్ధమైన వాహనాన్ని ఆఫ్‌లైన్‌తో పాటు ఆన్‌లైన్‌లోనూ రూ 25,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. భిన్న ఇంజన్, గేర్‌బాక్స్ కాంబినేషన్‌తో కూడిన న్యూ హ్యుందాయ్ క్రెటా ఈ, ఈఎక్స్, ఎస్, ఎస్‌ఎక్స్, ఎస్‌ఎక్స్ (ఓ) విభాగాల్లో లభిస్తోంది. న్యూ హ్యుందాయ్ క్రెటా నలుపు మరియు లేత గోధుమరంగు రంగులతో సరికొత్త డ్యూయల్-టోన్ క్యాబిన్‌తో ఆకర్షణీయంగా రూపొందింది. ఎయిర్-కాన్ వెంట్స్, డోర్ హ్యాండిల్స్ చుట్టూ సొగసైన క్రోమ్ ఇన్సర్ట్‌లు ఉన్నాయి.
తొలిసారి హ్యుందాయ్ క్రెటాకు ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్ లభిస్తోంది.ఇంకా ప్రత్యేకతల విషయానికి వస్తే రిమోట్ ఇంజిన్ స్టార్ట్, రియర్ సీట్ హెడ్‌రెస్ట్ కుషన్, బోస్ సౌండ్ సిస్టమ్ మరియు రెండు-దశల వెనుక సీటు రిక్లైనింగ్ ఫంక్షన్‌తో అందుబాటులోకి రానుంది. రెండవ తరం హ్యుందాయ్ క్రెటా ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ కోసం 7 అంగుళాల డిస్‌ప్లేతో,10.25-అంగుళాల సమాంతర టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, బ్లూలింక్ స్మార్ట్‌వాచ్ యాప్, పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు, ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్, యాంబియంట్ లైటింగ్ టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (టిపిఎంఎస్), రియర్ వ్యూ మానిటర్ వంటి ఫీచర్లతో రూపొందింది. బీఎస్ 6 ప్రమాణాలతో ఆల్ న్యూ హ్యుందాయ్ క్రెటా కస్టమర్ల ముందుకు రానుంది.
Comments
Please login to add a commentAdd a comment