మహానుభావుడు! కూతురికి భలే పేరు పెట్టాడే!! | Elon Musk and Grimes born baby girl in December | Sakshi
Sakshi News home page

మహానుభావుడు! కూతురికి భలే పేరు పెట్టాడే!!

Published Fri, Mar 11 2022 7:11 PM | Last Updated on Fri, Mar 11 2022 9:41 PM

Elon Musk and Grimes born baby girl in December - Sakshi

టెస్లా సీఈఓ,స్పేస్‌ ఎక్స్‌ అధినేత ఎలన్‌ మస్క్‌ 7వ సారి తండ్రయ్యాడు. ఎలన్‌ మస్క్‌ మాజీ భార్య హాలీవుడ్‌ సింగర్‌ గ్రిమ్స్‌ కుమార్తెకు జన్మనిచ్చారు. ఎలాన్ మస్క్ - గ్రిమ్స్ దంపతులు గతేడాది డిసెంబర్‌లో పండంటి పాపకు జన్మనిచ్చినట్లు గ్రిమ్స్‌ వానిటీ ఫెయిర్‌ ప్రొఫైల్‌ ఇంటర్వ్యూలో వెల్లడించారు. 

పిల్లల పేర‍్లు ఇలా ఉన్నాయ్‌ 
ఇప్పటి వరకు ఎలన్‌ మస్క్‌ సరోగసీ పద్దతిలో బేబీ ఎక్స్(1) జేవియర్ (17), గ్రిఫిన్ (17), డామియన్ (15), సాక్సన్ (15), కై (15) నెవాడా అలెగ్జాండర్ పిల్లలకు జన్మనిచ్చారు. ఆ పిల్లల పేర్లు ఇలా ఉంటే తాజాగా పుట్టిన పాపకు ఎలన్‌ మస్క్‌ విచిత్రమైన పేరు పెట్టాడు. ఆ పాపకు ఎక్సా డార్క్ సైడెరల్ మస్క్ లేదా షార్ట్‌ కట్‌లో  'వై' అని పిలవొచ్చని గ్రిమ్స్‌ తెలిపింది. దీంతో ఎలన్‌ మస్క్‌ అభిమానులు.. మహానుభావుడు పాపకు భలే పేరు పెట్టాడే అంటూ చమత్కరిస‍్తున్నారు.

 

ఎక్సా డార్క్ సైడెరల్ మస్క్ అంటే 
వానిటీ ఫెయిర్ ఇంటర్వ్యూలో.. గ్రిమ్స్‌ పాప పేరుకు అర్ధం ఏంటో  చెప్పారు. Exa సూపర్ కంప్యూటింగ్ పదం exaFLOPSని, డార్క్ అనే పదం 'unknown'ని సూచిస్తుంది.  డార్క్ అంటే విశ్వం. అందమైన రహస్యం తెలిపారు. పేరు చివరి భాగం అంటే Siderael 'Sigh-deer-ee-el' అని పిలుస్తారని, Siderael ఎల్వెన్ స్పెల్లింగ్ అంటే విశ్వం నక్షత్రం,  సమయం ఇంకా లోతైన ప్రదేశం భూమి నుండి వేరుగా ఉన్నది' అని అర్దం వచ్చేలా ఈ పేరు పెట్టినట్లు వివరణిచ్చారు. 

చదవండి: ఎలన్‌ మస్క్‌ కొత్త ప్రేయసి ఎవరో తెలిసిపోయింది

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement