రన్నింగ్‌ ట్రైన్‌లో నుంచి కిందపడినా.. | RPF constable saves passenger life in TamilNadu | Sakshi
Sakshi News home page

రన్నింగ్‌ ట్రైన్‌లో నుంచి కిందపడినా..

Published Wed, Nov 14 2018 5:58 PM | Last Updated on Wed, Nov 14 2018 6:03 PM

RPF constable saves passenger life in TamilNadu - Sakshi

సాక్షి, చెన్నై : మృత్యవు అంచువరకు వెళ్లొచ్చాడో యువకుడు. రైల్వే ప్రొటక్షన్‌ ఫోర్స్‌(ఆర్పీఎఫ్‌) కానిస్టేబుల్‌ వేగంగా స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. రన్నింగ్‌ ట్రైన్‌ ఎక్కుతూ ప్రమాదవ శాత్తూ పడిపోయిన ఓ ప్రయాణికుడిని ఆర్పీఎఫ్ కానిస్టేబుల్‌ కాపాడారు. ఈ సంఘటన చెన్నై ఎగ్మోర్‌ స్టేషన్‌లో చోటుచేసుకుంది. స్టేషన్‌ నుంచి రైలు బయలుదేరుతుండగా జనరల్‌ బోగీలోకి ఎక్కడానికి ఓ యువకుడు ప్రయత్నించాడు.

అయితే అదుపుతప్పడంతో కదులుతున్న రైలు, ప్లాట్‌ ఫామ్‌ మధ్యలో పడి పోతుండగా అక్కడే ఉన్న ఆర్పీఎఫ్‌ కానిస్టేబుల్‌ సుమన్‌ అతన్ని లాగేశాడు. వెంటనే స్పందించి అతన్ని లాగివేయడంతో ప్రమాదం తప్పింది. ఈ సంఘటన అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. యువకుడిని కాపాడిన సుమన్‌ను అందరూ అభినందిస్తున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement