Egmore
-
రన్నింగ్ ట్రైన్లో నుంచి కిందపడినా..
సాక్షి, చెన్నై : మృత్యవు అంచువరకు వెళ్లొచ్చాడో యువకుడు. రైల్వే ప్రొటక్షన్ ఫోర్స్(ఆర్పీఎఫ్) కానిస్టేబుల్ వేగంగా స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. రన్నింగ్ ట్రైన్ ఎక్కుతూ ప్రమాదవ శాత్తూ పడిపోయిన ఓ ప్రయాణికుడిని ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కాపాడారు. ఈ సంఘటన చెన్నై ఎగ్మోర్ స్టేషన్లో చోటుచేసుకుంది. స్టేషన్ నుంచి రైలు బయలుదేరుతుండగా జనరల్ బోగీలోకి ఎక్కడానికి ఓ యువకుడు ప్రయత్నించాడు. అయితే అదుపుతప్పడంతో కదులుతున్న రైలు, ప్లాట్ ఫామ్ మధ్యలో పడి పోతుండగా అక్కడే ఉన్న ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ సుమన్ అతన్ని లాగేశాడు. వెంటనే స్పందించి అతన్ని లాగివేయడంతో ప్రమాదం తప్పింది. ఈ సంఘటన అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. యువకుడిని కాపాడిన సుమన్‌ను అందరూ అభినందిస్తున్నారు. -
రన్నింగ్ ట్రైన్లో నుంచి కిందపడినా..
-
ఆయుర్వేద చాక్లెట్లలో గంజాయి!
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడులో విద్యాసంస్థలకు సమీపంలోని దుకాణాల్లో అమ్మే ఆయుర్వేద చాక్లెట్లలో మత్తుపదార్థం కలిసి ఉన్నట్లు తేలింది. దీంతో ఫుడ్ ఇన్స్పెక్టర్లు రాష్ట్ర వ్యాప్తంగా పలు దుకాణాలపై దాడులు చేస్తున్నారు. ఉత్తర చెన్నైకి చెందిన 9వ తరగతి విద్యార్థి ఒకరు గురువారం ఉదయం ఆయుర్వేద చాక్లెట్ తిని మైకంలోకి జారుకోవడంతో ఎగ్మూరులోని చిన్న పిల్లల ఆసుపత్రిలో చేర్పించారు. ఆ చాక్లెట్లలో గంజాయి మత్తుపదార్థం కలిపి ఉన్నట్లు పరిశోధనల్లో తేలింది. నిషేధిత మత్తుపదార్థాలైన పాన్‌మసాలా, గుట్కా, పొగాకు ఉత్పత్తుల తయారీ కేంద్రాలు, కార్యాలయాలపై చెన్నై ఆదాయపు పన్నుశాఖ అధికారులు శుక్రవారం దాడులు జరిపి ఓ గిడ్డంగి నుంచి రూ.300 కోట్ల విలువైన నల్లధనం, డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. గిడ్డంగి యజమాని అంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యక్తి అని నిర్ధరించారు. -
తమిళ తంబీలు ఖుష్!
అది ఎగ్మోర్. చెన్నైలో ఉన్న ఫేమస్ ఏరియాల్లో అదొకటి. ఎప్పుడూ సందడి సందడిగా ఉంటుంది. గత వారం రోజుల్లో ఆ సందడి రెట్టింపయింది. దానికి కారణం మన చిన్న ఎన్టీఆర్. ప్రస్తుతం ఈ యంగ్ టైగర్ నటిస్తున్న ‘జనతా గ్యారేజ్’ చిత్రం షూటింగ్ ఎగ్మోర్‌లోని మెమోరియల్‌లో జరిగింది. అక్కడ షూటింగ్ జరుగుతోందని తెలిసి, చుట్టుపక్కల జనాలు గుమిగూడిపోయారట. అదేం పెద్ద విశేషం కాదు. షూటింగ్ అంటే ఆ హడావిడి ఉంటుంది. కానీ, ఎన్టీఆర్‌ని చూడ్డానికి ఏకంగా క్యూలో నిలబడటం విశేషం. గంటలు గంటలు క్యూలో నిలబడి, ఎన్టీఆర్‌ని కలిసిన తర్వాతే వెళ్లారట. ఒక తెలుగు హీరోకి పొరుగు రాష్ట్రంలో ఆ స్థాయి ఆదరణ అంటే మామూలు విషయం కాదు. గత నెల 27న చెన్నైలో షూటింగ్ మొదలైంది. దాదాపు వారం రోజుల పాటు షూటింగ్ చేశారు. ఆ వారం రోజులూ భారీగా జనాలు వచ్చేవారని ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న బ్రహ్మాజీ అన్నారు. వీలు చేసుకుని ఎన్టీఆర్ ఆటోగ్రాఫులూ, ఫొటోగ్రాఫులూ ఇచ్చి, తమిళ తంబీలను ఖుష్ చేశారట. అఫ్కోర్స్ తంగచ్చీ (చెల్లెళ్లు)లు, అక్కలకు కూడా ఎన్టీఆర్ ఆటోగ్రాఫ్‌లిచ్చి, ఫొటోలు దిగారనుకోండి. ఆ సంగతలా ఉంచితే.. కొరటాల శివ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ఇటీవల విడుదలైంది. ఈ లుక్‌కి మంచి స్పందన లభించింది. ఆగస్ట్ 12న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. -
పోటాపోటీగా పరభాషలో ప్రచారం
వాళ్లని 'భాషాదురాభిమానులు' అని కొందరు వెక్కిరిస్తారు. కానీ వాళ్లు మాత్రం తమని తాము భాషాభిమానులుగా చెప్పుకుంటారు. అవును. మనం మాట్లాడుకునేది తమిళుల గురించే. వారు మాతృభాషను అమ్మకన్నా ఎక్కువగా ఆరాధిస్తారని, దాన్ని కాపాడుకునేందుకు ఎంతకైనా తెగిస్తారని తెలిసిందే. ఆఖరికి సినిమాలకు కూడా పరాయి భాషల పేర్లు పెట్టరు. అలాంటి తమిళనాడులో ఇప్పుడు పరభాషా ప్రచారం పోటాపోటీగా సాగుతోంది. హిందీని ఈసడించుకునే ముఖ్యపార్టీలన్నీ (ఆయా పార్టీల నేతలు గతంలో చేసిన వ్యాఖ్యల ఆధారంగా) జాతీయ భాషలో ఓట్లు అడుక్కుంటున్నాయి. చెన్నై శివారులోని ఎగ్మూర్ స్థానం నుంచి డీఎంకే తరఫున పోటీచేస్తోన్న అభ్యర్థి కేఎస్ రవిచంద్రన్ అయితే మరో అడుగు ముందుకువేసి హిందీలో ఎస్ఎంఎస్ లు పంపుతున్నారు. ఈపాటికే మీకు అర్థమై ఉంటుంది.. ఆ నియోజకవర్గంలో హిందీ మాట్లాడే ఉత్తర భారతీయుల ఓట్లే కీలకమని. తరాల కిందటే ఉత్తరం నుంచి వచ్చి ఎగ్మూర్ లో స్థిరపడ్డ మార్వాడీలు, ఇతరులను ప్రసన్నం చేసుకునేందుకు అన్నిపార్టీలు ఓటర్ల భాషలోనే ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఎగ్మూర్ లో హిందీలో సాగుతున్నట్లే ఆవడి నియోజకవర్గంలో అభ్యర్థులందరూ తెలుగులో ప్రచారం చేస్తున్నారు. తెలుగువారు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఆవడి కూడా ఒకటి. హోసూర్, గుమ్మిడిపూండి, తిరుత్తణిల్లోనూ తెలుగు ఓటర్లు అభ్యర్థి జయాపజయాలను నిర్దేశించే స్థాయిలో ఉండటంతో ప్రచారమంతా తేట 'తెనుంగు'లో జరుగుతోంది. ఇక ఈరోడ్, ధర్మపురి, కృష్ణగిరి నియోజకవర్గాల్లో తెలుగుతోపాటు కన్నడ పలుకులూ హోరెత్తుతున్నాయి. అన్నింటికీ భిన్నంగా అటు కన్యాకుమారి, కోయంబత్తూరు జిల్లాలో అయితే మలయాళ మంత్రాలు జపిస్తున్నారు తమిళ రాజకీయ నేతలు. కారణం ఆ జిల్లాల్లో కేరళ నుంచి వచ్చి స్థిరపడ్డ మలయాళీలు ఎక్కువగా ఉండటమే. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరన్నట్లు.. ఎన్నికల సమయంలో అన్ని భాషలను గౌరవిస్తున్న తమిళులను తెలివైనవారు కాదనగలమా! -
గుండెపోటుతో ఐపీఎస్ అధికారి మృతి
చెన్నై: ఐపీఎస్ అధికారి గుండెపోటుతో మృతిచెందిన ఘటన చెన్నైలో గురువారం చోటుచేసుకుంది. కర్ణాటకకు చెందిన ఎన్ హరీష్ మదురైలో ఐపీఎస్ అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవల ఆయనను మదురై నుంచి చెన్నైకు తమిళనాడు ప్రభుత్వం బదిలీ చేసింది. ఎగ్మూర్ లోని పోలీస్ ఆఫీసర్స్ మెస్‌లో గురువారం ఉదయం ఒక్కసారిగా గుండెపోటు రావడంతో ఆయన మృతి చెందాడు. హరీష్ 2009 బ్యాచ్‌కు చెందిన ఐపీస్ అధికారి. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.