సాక్షి, హైదరాబాద్: కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఒడిశాతీరం చిలికా సరస్సు వద్ద కేంద్రీకృతమైన వాయుగుండం బలహీనపడి అల్పపీడనంగా మారింది. రానున్న ఆరు గంటల్లో ఇది మరింత బలహీనపడే అవకాశం ఉన్నట్టు వెల్లడించింది. జైసాల్మయిర్, కోట, గుణ, మాండ్ల, అంతర్గత ఒడిశా దాని సమీపంలోని ఛత్తీస్‌గఢ్ ప్రాంతంలో ఉపరితల ద్రోణి కేంద్రీకృతమై ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇది తూర్పు, మధ్య బంగాళాఖాతం ప్రాంతం వరకు కొనసాగుతున్నట్టు వివరించింది.
రానున్న రెండు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ వివరించింది. ఆదివారం రాష్ట్రంలో సగటున 3.32 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో 8.81, జగిత్యాల జిల్లాలో 7.01, నిర్మల్ జిల్లాలో 6.92, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 6.83 సెంటీమీటర్ల వర్షం కురిసింది.
నల్లగొండ, గద్వాల జిల్లాలు మినహాయిస్తే రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు నమోదయ్యాయి. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 23.39 సెంటీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా, ఆదివారం నాటికి 36.43 సెంటీమీటర్ల వర్షం కురిసింది. సీజన్లో ఇప్పటివరకు సాధారణ వర్షపాతం కంటే 33శాతం అధికంగా వానలు నమోదయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment